Bus Accident: అహోబిలం వద్ద రోడ్డు ప్రమాదం.. లోయలోపడ్డ ఆర్టీసీ బస్సు.. 10మంది తీవ్రగాయాలు!

కర్నూలు జిల్లాలో ఆర్టీసీ బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో పది మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.

Bus Accident: అహోబిలం వద్ద రోడ్డు ప్రమాదం.. లోయలోపడ్డ ఆర్టీసీ బస్సు.. 10మంది తీవ్రగాయాలు!
Rtc Bus Accident
Follow us
Balaraju Goud

| Edited By: Ravi Kiran

Updated on: Nov 29, 2021 | 6:02 PM

Ahobilam Bus Accident: కర్నూలు జిల్లాలో ఆర్టీసీ బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఎగువ అహోబిలం రహదారి నల్లమల అటవీ ప్రాంతంలో ఆళ్లగడ్డ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు లోయలో పడింది. ఈ ఘటనలో 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు స్పాట్‌కు చేరుకుని సహాయకచర్యలు చేట్టారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆళ్లగడ్డ నుంచి అహోబిలం క్షేత్రానికి వెళ్లిన ఆర్టీసీ బస్సు.. తిరిగి వచ్చే క్రమంలో వెనక్కి తిప్పుతుండగా అదుపుతప్పి లోయలో పడింది. గాయపడిన వారిని బయటకు తీసి రెండు అంబులెన్సుల ద్వారా స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా, ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాద కారణాలపై ఆరా తీస్తున్నారు.

Read Also…  Wines Flexi: వైన్స్ షాపు ముందు బాకీదారుల పేర్లతో ఫ్లెక్సీ.. బిత్తరపోతున్న మందుబాబులు.. ఇదెక్కడంటే..?