Andhra Pradesh: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. పెరగనున్న హెచ్‌ఆర్ఏ.. ఎంతంటే
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి శుభవార్త చెప్పారు. ఉద్యోగుల హౌస్ రెంట్ అలవెన్స్ (హెచ్ఆర్ఏ) విషయంలో వైసీపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న12 శాతం నుంచి 16 శాతానికి హెచ్ఆర్ఏ పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి శుభవార్త చెప్పారు. ఉద్యోగుల హౌస్ రెంట్ అలవెన్స్ (హెచ్ఆర్ఏ) విషయంలో వైసీపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న12 శాతం నుంచి 16 శాతానికి హెచ్ఆర్ఏ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో కొత్త జిల్లాల హెడ్ క్వార్టర్స్‌లో పని చేసే ఉద్యోగులకు హెచ్ఆర్ఏ పెరగనుంది. పార్వతీపురం, పాడేరు, అమలాపురం, బాపట్ల, రాజమండ్రి, భీమవరం, నరసరావుపేట, తదితర జిల్లా కేంద్రాల్లోని ఉద్యోగులకు ఇప్పుడు పెంచిన హెచ్‌ఆర్‌ఏ వర్తింపజేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఉద్యోగుల డిమాండ్ మేరకు 16 శాతానికి హెచ్ఆర్ఏ పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్ ఉత్తర్వులు జారీ చేశారు.
అయితే గత కొంత కాలంగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్ల సాధన కోసం పోరాటం చేస్తున్నాయి. పెండింగ్ ఉన్న తమ బకాయిలు చెల్లించాలని, వేతనాలు పెంచాలని, సీపీఎస్ రద్దు కోసం నిరసనలు వ్యక్తం చేశారు. ఉద్యోగుల సమస్యలపై పలు దఫాలుగా ప్రభుత్వంతో చర్చలు కూడా సాగుతోన్న విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న ఈ క్రమంలోనే ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇందులో భాగంగానే ఉద్యోగులకు హెచ్ఆర్ఏ పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం