Andhra Pradesh: నర్సాపూర్–యశ్వంత్‌పూర్ మధ్య నడవనున్న ప్రత్యేక రైళ్లు
ఏపీలోని విజయవాడ రైల్వే డివిజన్ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. వేసవిలో ప్రయాణికుల డిమాండ్ మేరకు నర్సాపూర్-యశ్వంత్‌పూర్ మధ్య 6 వారంతపు సర్వీసులు నడపనున్నట్లు ప్రకటించారు. నర్సాపూర్–యశ్వంత్‌పూర్ రైలు (07687) ఈనెల 14,21,28 తేదీల్లో ప్రతి ఆదివారం మధ్యాహ్నం 3.10 PM గంటలకు నర్సాపూర్‌లో బయలుదేరి 7.20 PM గంటలకు విజయవాడ చేరుకుంటుంది.
ఏపీలోని విజయవాడ రైల్వే డివిజన్ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. వేసవిలో ప్రయాణికుల డిమాండ్ మేరకు నర్సాపూర్-యశ్వంత్‌పూర్ మధ్య 6 వారంతపు సర్వీసులు నడపనున్నట్లు ప్రకటించారు. నర్సాపూర్–యశ్వంత్‌పూర్ రైలు (07687) ఈనెల 14,21,28 తేదీల్లో ప్రతి ఆదివారం మధ్యాహ్నం 3.10 PM గంటలకు నర్సాపూర్‌లో బయలుదేరి 7.20 PM గంటలకు విజయవాడ చేరుకుంటుంది. అక్కడ బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.50 గంటలకు యశ్వంత్‌పూర్ చేరుకుంటుంది.
తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07688) ఈ నెల 15, 22, 29 తేదీలలో ప్రతి సోమవారం మధ్యాహ్నం 3.50 గంటలకు యశ్వంత్‌పూర్‌లో బయలుదేరుతుంది. అలాగే మరుసటి రోజు తెల్లవారు జామున 4.50 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. అక్కడ నుంచి బయలుదేరి ఉదయం 8.30 గంటలకు నర్సాపూర్ చేరుకుంటుంది.
ఇవి కూడా చదవండి
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం