స్నేహితులతో కలిసి ఆదుకునేందుకు వెళ్లగా తీవ్ర విషాదం..
విశాఖ జిల్లా పద్మనాభం మండలం తునిపొలం గెడ్డలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తండ్రికి సాయం చేసేందుకు వెళ్లిన కూతురు గల్లంతు అయ్యింది. కాలుజారి ప్రమాదవశాత్తు గడ్డలో జారీపడిన బాలిక ధనుశ్రీ మునిగిపోయింది. రంగంలోకి దిగిన పోలీసులు రెవిన్యూ సిబ్బంది సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. ధనుశ్రీ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

విశాఖ జిల్లా పద్మనాభం మండలం తునిపొలం గెడ్డలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. స్నేహితులతో కలిసి గడ్డ దగ్గరకు వెళ్లిన బాలిక.. ప్రమాదవశాత్తు కాలుజారి గడ్డలోకి వెళ్లి గల్లంతు అయింది. కాలుజారి ప్రమాదవశాత్తు గడ్డలో జారీపడిన బాలిక ధనుశ్రీ మునిగిపోయింది. రంగంలోకి దిగిన పోలీసులు రెవిన్యూ సిబ్బంది సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. ధనుశ్రీ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటన ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది.
విశాఖ జిల్లా పద్మనాభం మండలం తునిపొలం గ్రామంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదవశాత్తు గెడ్డలో జారిపడిన 13 ఏళ్ల బాలిక గల్లంతైన ఘటన గురువారం (అక్టోబర్ 30) చోటు చేసుకుంది. శ్రీను, గౌరీకి ఇద్దరు కూతుర్లు. పెద్ద కూతురు గౌరీతో కలిసి తల్లి శుభకార్యానికి వెళ్లగా.. చిన్న కూతురు ధనశ్రీ(13) ఇంట్లోనే ఉంది. ఆపై స్నేహితులు రాగా.. వాళ్లతో కలిసి గడ్డ దగ్గరికి వెళ్ళింది.. ప్రమాదవశాత్తు కాలుజారి గడ్డలోకి వెళ్లి గల్లంతయింది. దీంతో ధనుశ్రీ ఆచూకీ కోసం గ్రామస్తులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు గెడ్డలో గాలింపు చర్యలు చేపట్టారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
