Shravana Masam 2023: పూల మార్కెట్‌కు శ్రావణ శోభ.. జోరందుకున్న అమ్మకాలు.. కిలో ఏకంగా రూ.1100

ఆషాడం, అధిక శ్రావణమాసాలతో పూల రైతులు, వ్యాపారులు గత కొన్ని రోజులుగా అమ్మకాలు లేక నిరుత్సాహంతో ఉన్నారు. అయితే శ్రావణమాసం రావడంతో వివాహాది శుభకార్యాలు,పూజలు,వ్రతాలు అధికమవ్వడంతో ఈ పూల అమ్మకాలు జోరు అందుకున్నాయి. ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక అంతరాష్ట్ర పూల మార్కెట్లో..

Shravana Masam 2023: పూల మార్కెట్‌కు శ్రావణ శోభ.. జోరందుకున్న అమ్మకాలు.. కిలో ఏకంగా రూ.1100
Flower Market
Follow us
Pvv Satyanarayana

| Edited By: Srilakshmi C

Updated on: Aug 25, 2023 | 2:36 PM

అమరావతి, ఆగస్టు 25: ఆషాడం, అధిక శ్రావణమాసాలతో పూల రైతులు, వ్యాపారులు గత కొన్ని రోజులుగా అమ్మకాలు లేక నిరుత్సాహంతో ఉన్నారు. అయితే శ్రావణమాసం రావడంతో వివాహాది శుభకార్యాలు,పూజలు,వ్రతాలు అధికమవ్వడంతో ఈ పూల అమ్మకాలు జోరు అందుకున్నాయి. ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక అంతరాష్ట్ర పూల మార్కెట్లో పెద్ద ఎత్తున అమ్మకాలు జరుగుతున్నాయి. వరలక్ష్మి వ్రతం సందర్భంగా మార్కెట్‌కు దూరప్రాంతాల నుంచి పూల కొనుగోలుదారులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.

అందుకు అనుగుణంగా ప్రస్తుతం ఇక్కడ పూలదిగుబడులు అంతగా లేనందున తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి టన్నుల కొలది బంతి, చామంతి, గులాబీ వంటి పూలను దిగుమతి చేసుకుంటున్నారు. ఉభయగోదావరి జిల్లాలతో పాటు విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, ఒరిస్సా రాష్ట్రంలోని రాయగడ, తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా నుంచి కొనుగోలుదారులు తరలివచ్చి కావలసిన పూలను కొనుగోలు చేసి తీసుకెళ్లారు.

ఇతర రాష్ట్రాల నుంచి పూల దిగుమతులు చేసుకోవడం వల్ల ధరలు కూడా విపరీతంగా పెరిగాయని చెప్పాలి. ఇటీవల వచ్చిన వరదలకు లంక గ్రామాల్లో కొన్ని పూల తోటలు పాడైపోయాయి. కడియం మండలంతో పాటు కోనసీమ జిల్లాలో ఆలమూరు, ఆత్రేయపురం మండలాల్లో ఈ పూల సాగు అధికంగా ఉంటుంది. ఈ మూడు మండలాల్లోనే సుమారు 2,500 నుంచి 3 వేల ఎకరాల్లో వివిధ రకాల పూలను సాగు చేస్తున్నారు. ప్రస్తుతం లిల్లీ, మల్లి, జాజులు, కనకాంబరాలు, దేశవాళీ గులాబీలు మాత్రమే ఈ ప్రాంతాల్లో దిగుబడులు ఉన్నాయి. మిగిలిన పువ్వులు ఇతర రాష్ట్రాలు నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. కడియపులంక మార్కెట్ కేంద్రంగానే కొనుగోలు అమ్మకాలు జరుగుతుంటాయి.

ఇవి కూడా చదవండి

వరలక్ష్మి వ్రతం సందర్భంగా కడియం పూల మార్కెట్లో పూల ధరలు కిలో ధర ఈ విధంగా ఉన్నాయి..

  • చామంతి పూలు కిలో రూ.300 నుంచి రూ.400
  • పసుపు బంతి పూలు కిలో రూ.50 నుంచి రూ.60
  • ఆరంజ్ బంతి పూలు కిలో రూ.60 నుంచి రూ.70
  • లిల్లీ పూలు కిలో రూ.250 నుంచి రూ.300
  • మల్లి పూలు కిలో రూ.1000 నుంచి రూ.1100
  • జాజులు పూలు కిలో రూ.700 నుంచి రూ.750
  • కాగడాలు పూలు కిలో రూ.700 నుంచి రూ.750
  • స్టార్ గులాబీ పూలు కిలో రూ.350 నుంచి రూ.400
  • కనకాంబరాల పూలు కిలో రూ.200 నుంచి రూ.250

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!