Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చంద్రయాన్ – 3 లో రాజంపేటకు చెందిన యువ శాస్త్రవేత్త.. సంబరాల్లో కడప వాసులు

ఎంటెక్ పూర్తి అయ్యాక క్వాల్ కం కంపెనీ తమ కంపెనీ లో ఉద్యోగం ఇచ్చేందుకు రాజేంద్రప్రసాద్ రెడ్డికి 43 లక్షల ప్యాకేజీతో ఆఫర్ ఇచ్చింది. అయితే రాజేంద్ర ప్రసాద్ రెడ్డి తన మేధస్సును దేశానికి ఉపయోగించాలన్న ఆశయంతో ఆ ఉద్యోగాన్ని తిరస్కరించి సైంటిస్ట్ అయ్యారు. సైంటిస్ట్ అయ్యాక తాను భాగస్వామ్యం అయిన తొలి ప్రయోగం చంద్రయాన్ - 3 విజయవంతం కావడం పట్ల రాజేంద్ర ప్రసాద్ రెడ్డి ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

చంద్రయాన్ – 3 లో రాజంపేటకు చెందిన యువ శాస్త్రవేత్త.. సంబరాల్లో కడప వాసులు
Andhra Pradesh Scientist
Follow us
Sudhir Chappidi

| Edited By: Jyothi Gadda

Updated on: Aug 25, 2023 | 3:22 PM

భారత్ చంద్రున్ని ముద్దాడింది… జాబిల్లి పై కాలుమోపి చరిత్ర సృష్టించింది… ప్రతి భారతీయుడు సగౌరవంగా తలెత్తుకునేటట్లు చేసింది ఇస్రో. ఈ విషయంలో రాజంపేటకు చెందిన యువ శాస్త్రవేత్త పట్ల రాజంపేట ప్రాంతంలో హర్షాతిరేఖాలు వ్యక్తం అవుతున్నాయి. చంద్రయాన్ – 3 విజయవంతం కావడంతో భారతీయులంతా అనందభరితమైన క్షణాలను ఆస్వాదిస్తున్నారు. ప్రతి భారతీయుడు శాస్త్రవేత్తల మేధస్సును కొనియాడుతున్నారు. మన శాస్త్రవేత్తల మేధస్సు కారణంగా ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూస్తున్నాయి. శాస్త్రవేత్తల వల్ల యావత్ భారత దేశం సగర్వంగా కాలర్ ఎగరెస్తుంది. చంద్రయాన్ – 3ని విజయవంతం చేసిన శాస్త్రవేత్తల బృందంలో మన రాజంపేటకు చెందిన ఏర్రబాలు రాజేంద్ర ప్రసాద్ రెడ్డి ఉన్నారంటంటే నిజంగా ఇది రాజంపేట వాసులకే కాదు జిల్లా ప్రజలకు గర్వకారణం అని చెప్పాలి.

రాజంపేట మండలం దిగువబసినాయుడుగారిపల్లె ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న వై.సుబ్రమణ్యం రెడ్డి, చంద్రకళ దంపతుల తనయుడు రాజేంద్ర ప్రసాద్ రెడ్డి బెంగళూరు ఇస్రో లో సైంటిస్ట్ గా పనిచేస్తూ చంద్రయాన్ – 3 మిషన్ (ప్రయోగం) లో పాల్గొన్నారు. చంద్రయాన్ – 3 విజయవంతం కావడం, ఆ ప్రయోగ బృందంలో రాజేంద్ర ప్రసాద్ రెడ్డి పాల్గొనడం పట్ల ఆయన స్నేహితులు, బంధువులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ రెడ్డి తల్లిదండ్రులను పలువురు అభినందిస్తున్నారు.

ఎంటెక్ పూర్తి అయ్యాక క్వాల్ కం కంపెనీ తమ కంపెనీ లో ఉద్యోగం ఇచ్చేందుకు రాజేంద్రప్రసాద్ రెడ్డికి 43 లక్షల ప్యాకేజీతో ఆఫర్ ఇచ్చింది. అయితే రాజేంద్ర ప్రసాద్ రెడ్డి తన మేధస్సును దేశానికి ఉపయోగించాలన్న ఆశయంతో ఆ ఉద్యోగాన్ని తిరస్కరించి సైంటిస్ట్ అయ్యారు. సైంటిస్ట్ అయ్యాక తాను భాగస్వామ్యం అయిన తొలి ప్రయోగం చంద్రయాన్ – 3 విజయవంతం కావడం పట్ల రాజేంద్ర ప్రసాద్ రెడ్డి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి భారతీయుడు లాగే తాను తన మాటల్లో వర్ణించ లేని ఆనందాన్ని ఆస్వాదిస్తున్నట్లు ఆయన చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు నుంచి బంగారు లాకెట్ల పంపిణీ
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు నుంచి బంగారు లాకెట్ల పంపిణీ
చిన్నారిని ఎత్తుకెళ్లి అఘాయిత్యం.. నిందితుడు ఎన్‌కౌంటర్..
చిన్నారిని ఎత్తుకెళ్లి అఘాయిత్యం.. నిందితుడు ఎన్‌కౌంటర్..
Video: సిగ్గుందా అసలు.. సెంచరీ చేసినోడికి ఇదేం చెత్త అవార్డ్..
Video: సిగ్గుందా అసలు.. సెంచరీ చేసినోడికి ఇదేం చెత్త అవార్డ్..
IPL 2025: ఐపీఎల్ హిస్టరీలో చెత్త ఓపెనర్‌.. ఇకపై కొనడం కష్టమే?
IPL 2025: ఐపీఎల్ హిస్టరీలో చెత్త ఓపెనర్‌.. ఇకపై కొనడం కష్టమే?
శివుడికి ఈ పరిహారాలు చేయండి.. ఆర్ధిక ఇబ్బందుల నుంచి ఉపశమనం ..
శివుడికి ఈ పరిహారాలు చేయండి.. ఆర్ధిక ఇబ్బందుల నుంచి ఉపశమనం ..
ఆ రాశుల వారికి శుభ యోగాలు పట్టే అవకాశం.. 12 రాశుల వారికి దినఫలాలు
ఆ రాశుల వారికి శుభ యోగాలు పట్టే అవకాశం.. 12 రాశుల వారికి దినఫలాలు
తగ్గిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతుందంటే..
తగ్గిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతుందంటే..
యువతకు భలే ఛాన్స్.. SBI యూత్‌ ఫెలోషిప్‌ 2025కు దరఖాస్తుల ఆహ్వానం!
యువతకు భలే ఛాన్స్.. SBI యూత్‌ ఫెలోషిప్‌ 2025కు దరఖాస్తుల ఆహ్వానం!
వేసవిలో తప్పక తినాల్సిన ఆరోగ్యకరమైన పండ్లు ఇవే..!
వేసవిలో తప్పక తినాల్సిన ఆరోగ్యకరమైన పండ్లు ఇవే..!
W,W,W.. 3 బంతుల్లో మారిన ముంబై ఫేట్..
W,W,W.. 3 బంతుల్లో మారిన ముంబై ఫేట్..