AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Viral Video: ఏంటీ బ్రో.. ఈ ఆడళ్లు మరీ తయారయ్యారు..? మెట్రో రైల్లో మహిళల కుస్తీ.. ఎందుకు తెలిస్తే..!

'బిగ్ బాస్' కంటే మెట్రో ఇప్పుడు మరింత వినోదాత్మకంగా మారిందని సోషల్ మీడియా యూజర్లు చెప్పడం మొదలుపెట్టారు.  తాజా ఉదంతం ఏమిటంటే, మెట్రోలో కొంతమంది మహిళలు మరియు అమ్మాయిల మధ్య సీటు గురించి ఇంత చర్చ జరిగింది, అది గొడవకు దారితీసింది. ఓ ప్రయాణికుడు తన వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఇప్పుడు వైరల్ అవుతోంది.

Watch Viral Video: ఏంటీ బ్రో.. ఈ ఆడళ్లు మరీ తయారయ్యారు..? మెట్రో రైల్లో మహిళల కుస్తీ.. ఎందుకు తెలిస్తే..!
Delhi Metro
Jyothi Gadda
|

Updated on: Aug 23, 2023 | 9:12 PM

Share

మెట్రో అంటే. ఇప్పుడు అందరికీ టక్కున గుర్తొచ్చేది ఢిల్లీమెట్రోనే. చిత్ర విచిత్ర సంఘటనలు, రకరకాల స్టంట్స్‌కు ఢిల్లీ మెట్రో కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. ఎందుకంటే.. నిత్యం ఏదో ఒక భిన్నమైన చర్యతో ఢిల్లీ మెట్రో వార్తల్లో నిలుస్తుంది. మెట్రోలో రొమాన్స్, ఫన్నీ డ్యాన్సులు, ఫైటింగ్‌లు లాంటి వీడియోలు చేసి నెట్టింట పోస్ట్‌ చేస్తుంటారు. సోషల్ మీడియాలో వ్యూస్‌కోసం, లైకులు, షేర్ల కోసం చాలా మంది తమ టాలెంట్‌ను ప్రదర్శించటానికి ఢిల్లీ మెట్రోనే వేదికగా మార్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే కొన్ని అనుకోని సంఘటనలు కూడా ఢిల్లీ మెట్రోను వార్తల్లోకెక్కిలా చేస్తుంది. తాజాగా అలాంటిదే మరో వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.

సోషల్ మీడియా ప్రపంచంలో ఢిల్లీ మెట్రో ఒక విభిన్నమైన గుర్తింపుగా మారింది. ఇప్పుడు మెట్రో దాని హై స్పీడ్, AC కోచ్‌లు, గ్లామర్ కంటే దాని రీల్స్, ఫైట్లు, రొమాన్స్‌కు ప్రసిద్ధి చెందింది. అవును, ప్రతిరోజూ మెట్రో నుంచి వచ్చే ప్రయాణికుల వీడియోలు సోషల్ మీడియాలో అనేకం తెరపైకి వస్తున్నాయి. అదేలాగంటే.. ‘బిగ్ బాస్’ కంటే మెట్రో ఇప్పుడు మరింత వినోదాత్మకంగా మారిందని సోషల్ మీడియా యూజర్లు చెప్పడం మొదలుపెట్టారు.  తాజా ఉదంతం ఏమిటంటే, మెట్రోలో కొంతమంది మహిళలు మరియు అమ్మాయిల మధ్య సీటు గురించి ఇంత చర్చ జరిగింది, అది గొడవకు దారితీసింది. ఓ ప్రయాణికుడు తన వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోని X హ్యాండిల్ @gharkekalesh పోస్ట్ చేసారు. అతను క్యాప్షన్‌లో రాశాడు – సీటు విషయంలో కొంతమంది మహిళలు, అమ్మాయిల మధ్య గొడవ జరిగింది. ఇప్పటికే ఈ వీడియోని 90 వేలకు పైగా వీక్షించారు. వందల సంఖ్యలో నెటిజన్లు వీడియోపై స్పందించారు. లైక్‌లు, కామెంట్లతో హోరెత్తించారు. చాలా మంది వినియోగదారులు దీనిపై వ్యాఖ్యానించారు కూడా. ఢిల్లీ మెట్రో ‘బిగ్ బాస్’ కంటే ఎక్కువ వినోదాన్ని అందిస్తుందని ఒకరు వ్యాఖ్యనించగా, కొందరు యూజర్లు నాకు ఢిల్లీ మెట్రో అంటే చాలా ఇష్టమని… నా కారును అమ్మి మెట్రోలో ప్రయాణించాలని ఆలోచిస్తున్నానని చెప్పారు.

ఈ 15 సెకన్ల వీడియోలో కొందరు మహిళలు, యువతులు మెట్రో కోచ్‌లో గొడవ పడుతుండటం గమనించవచ్చు. ఒకరికొకరు బట్టలు, జుట్టు లాగుతూ కొట్టుకోవటం కనిపించింది. మరికొందరు ప్రయాణికులు ఇద్దరినీ విడదీసి గొడవ ఆపేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ ఒకరినొకరు వదులుకోవడం లేదు.. కుస్తీ పోటీలు పడినట్టుగా కొట్టుకున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us