AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Viral Video: హెయిర్‌ కట్టింగ్‌ కోసం ప్రత్యేక రోబోట్‌.. ఇక మనుషులతో పనిలేదోచ్‌..! వీడియో చూస్తే అవాక్కే..

వీడియోలో ఒక వ్యక్తి రోబోతో జుట్టు కత్తిరించుకున్నాడు. వీడియో చూసిన జనాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం స్టఫ్ మేడ్ హెయిర్ అనే యూట్యూబ్ ఛానెల్‌లో డిస్‌రప్ట్ ద్వారా ఈ వీడియోను మొదట పోస్ట్ చేశారు. ఇప్పుడీ వీడియోలోని కొంత భాగం రెడ్డిట్‌లో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన జనాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Watch Viral Video: హెయిర్‌ కట్టింగ్‌ కోసం ప్రత్యేక రోబోట్‌.. ఇక మనుషులతో పనిలేదోచ్‌..! వీడియో చూస్తే అవాక్కే..
A Robot That Gives Haircuts
Jyothi Gadda
|

Updated on: Aug 23, 2023 | 7:42 PM

Share

పెరిగిపోయిన సాంకేతిక అభివృద్ధిని ఉపయోగించి మనిషి తన వ్యక్తిగత సౌలభ్యాన్ని మరింత సులువు చేసుకుంటున్నారు. ఇంటిపని, బయట పని అన్నింటినీ సాంకేతిక పరిజ్ఞానంతో పూర్తి చేసుకుంటున్నాడు. అందుకోసం విభిన్నమైన రోబోట్‌లను తయారు చేసుకుంటున్నాడు. ఆటోమేటెడ్ ఫ్లోర్ క్లీనర్ల నుండి ఇంట్లో పనిచేసే వారి వరకు అవకాశాల శ్రేణి అనంతం. అలాంటి సందర్భానికి చక్కటి ఉదాహరణ ఈ వీడియో.. ఇంటర్నెట్‌లో విపరీతంగా చక్కర్లు కొడుతుంది. వీడియోలో ఒక వ్యక్తి రోబోతో జుట్టు కత్తిరించుకున్నాడు. వీడియో చూసిన జనాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం స్టఫ్ మేడ్ హెయిర్ అనే యూట్యూబ్ ఛానెల్‌లో డిస్‌రప్ట్ ద్వారా ఈ వీడియోను మొదట పోస్ట్ చేశారు. ఇప్పుడీ వీడియోలోని కొంత భాగం రెడ్డిట్‌లో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన జనాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Getting a robot to cut your hair by u/MrJasonMason in Damnthatsinteresting

ఇవి కూడా చదవండి

ఈ వైరల్ వీడియో అమెరికాకు చెందినదిగా తెలిసింది. అమెరికాకు చెందిన ఇంజనీర్ షేన్ డిస్‌ప్రప్ట్ తన హెయిర్‌కట్‌ను అతను స్వయంగా తయారు చేసిన ప్రత్యేక రోబోట్‌తో చేయించుకుంటున్నాడు. అయితే, సోషల్ మీడియాలో వీడియో వైరల్‌ కావటంతో నెటిజన్లు భిన్నమైన అభిప్రాయలు వ్యక్తం చేస్తున్నారు. యూట్యూబ్ వీడియోను పోస్ట్ చేస్తూ, ఇటువంటి యంత్రం అవకాశాలు అంతులేనివని చెప్పారు. అత్యంత ఆసక్తికరమైన విషయం జుట్టు కత్తిరించడం, ఇది మనిషికి చాలా కష్టం. మీ తలపై ఒక వైపు నుండి మరొక వైపుకు ఖచ్చితమైన లెక్కప్రకారం హెయిర్‌ కట్‌ చేయటం గురించి ఆలోచించండి. ట్రిమ్మర్‌తో కట్టింగ్‌ కూడా కష్టంగానే ఉంటుంది.

అతను ఇంకా ఇలా వ్రాశాడు.. ‘నేను దీనిని మొదటి తరం యంత్రంగా భావిస్తున్నాను, జుట్టు కత్తిరించుకోవటం కోసం కొన్ని ప్రత్యేకమైన స్టైల్స్‌ని ఎంపిక చేయటం కోసం మరోక యంత్రాన్ని తయారు చేయాలనుకుంటున్నాను అని…నేను దీన్ని నిజంగా ‘ఎంజాయ్’ చేస్తున్నాను అని చెప్పారు. అయితే, ఈ వీడియో పాతదే అయినప్పటికీ ఈ వీడియో రెడ్డిట్‌లో మళ్లీ షేర్ చేయబడింది. దీంతో మరోమారు వీడియో వైరల్‌ అవుతోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..