Delhi Airport: ఒకే రన్‌వేపై 2 విమానాలు.. పైలట్ అప్రమత్తతో తృటిలో త‌ప్పిన పెను ప్ర‌మాదం

పశ్చిమ బెంగాల్‌లోని బాగ్‌దోరాకు వెళ్లే UK725 నంబర్‌కు చెందిన విమానాన్ని బుధవారం ఉదయం ఢిల్లీ విమానాశ్రయంలో ఇటీవల ప్రారంభించిన రన్‌వేపై టేకాఫ్ చేయడానికి అనుమతించారు. ఈ సమయంలో అహ్మదాబాద్‌ నుంచి ఢిల్లీ వెళ్లే విస్తారా విమానం ల్యాండ్ కానుంది. విమానం టేకాఫ్ అవుతుండగా అకస్మాత్తుగా విమానాన్ని ఆపమని ఏటీసీకి ఆదేశాలు అందాయి.

Delhi Airport: ఒకే రన్‌వేపై 2 విమానాలు..  పైలట్ అప్రమత్తతో తృటిలో త‌ప్పిన పెను ప్ర‌మాదం
Vistara Flight
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 23, 2023 | 5:14 PM

ఢిల్లీ విమానాశ్రయంలో బుధవారం పెను ప్రమాదం తప్పింది. ఇక్కడ రెండు వేర్వేరు విమానాలు ఒకే సమయంలో ల్యాండింగ్, టేకాఫ్ చేయడానికి అనుమతించబడ్డాయి. అయితే, వెంటనే అప్రమత్తమైన ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ (ATC) అధికారులు సమయ స్ఫూర్తితో వ్యవహరించి పెను ప్రమాదం జరగకుండా ఆపారు. ముందుగానే ఓ విమానాన్ని అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. విస్తారా ఎయిర్‌లైన్స్ విమానానికి టేకాఫ్‌కు అనుమతి ఇవ్వగా, మరొకటి ల్యాండ్ కావడంతో తృటిలో ప్రమాదం తప్పింది. టాక్సీవేలో ఉన్న విమానం పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC)కి సమాచారం అందించాడు. దాంతో వెంటనే టేకాఫ్ నిలిపివేసినట్టుగా సీనియర్ విమానాశ్రయ అధికారి తెలిపారు.

పశ్చిమ బెంగాల్‌లోని బాగ్‌దోరాకు వెళ్లే UK725 నంబర్‌కు చెందిన విమానాన్ని బుధవారం ఉదయం ఢిల్లీ విమానాశ్రయంలో ఇటీవల ప్రారంభించిన రన్‌వేపై టేకాఫ్ చేయడానికి అనుమతించారు. ఈ సమయంలో అహ్మదాబాద్‌ నుంచి ఢిల్లీ వెళ్లే విస్తారా విమానం ల్యాండ్ కానుంది. విమానం టేకాఫ్ అవుతుండగా అకస్మాత్తుగా విమానాన్ని ఆపమని ఏటీసీకి ఆదేశాలు అందాయి. సూచనలు అందిన వెంటనే విమానం ఆగిపోయి నిమిషాల వ్యవధిలోనే అహ్మదాబాద్ నుంచి వచ్చిన విమానం ల్యాండ్ అయింది.

ఇవి కూడా చదవండి

రెండు విమానాలకు ఒకేసారి అనుమతి ఇవ్వబడింది. కానీ ATC దానిపై కంట్రోల్‌ తీసుకుంది. ఈ విషయం తెలిసిన ఓ అధికారి ఏటీసీ అధికారి వెంటనే టేకాఫ్ విమానాలను నిలిపివేసినట్లు తెలిపారు. టేకాఫ్‌ను నిలిపివేసిన వెంటనే ఢిల్లీ బాగ్‌దోర వెళ్తున్న విమానాన్ని రన్‌వే నుంచి తొలగించి పార్కింగ్‌కు తరలించారు. రెండు విమానాలు సేఫ్‌గా ల్యాండ్‌కావడంతో ఏటీసీ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. సాధారణంగా ఒక రన్‌వేపై విమానం టేకాఫ్‌ అవుతుండగా, పక్కనే ఉన్న మరో రన్‌వేపై కూడా విమానం ల్యాండింగ్‌కు అనుమతించరు.

ఇదిలా ఉంటే, గతంలో ఢిల్లీ నుంచి పూణే వెళ్లే విస్తారా విమానంలో బాంబు ఉన్నట్టుగా జీఎంఆర్ కాల్ సెంటర్‌కు హెచ్చరిక కాల్‌ వచ్చింది. దీంతో ఢిల్లీ విమానాశ్రయంలోని ఐసోలేషన్ బేలో విమానాన్ని ఉంచి బాంబు డిస్పోజల్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహించారు. ప్రయాణికులందరినీ, వారి లగేజీని సురక్షితంగా విమానం నుంచి కిందకు దింపారు. బాంబు బెదిరింపు కాల్ వచ్చినపుడు విమానంలో 100 మంది ప్రయాణికులున్నారని తెలిసింది. బాంబు బెదిరింపు కాల్‌ నేపథ్యంలో ఆగస్టు 18న ఢిల్లీ నుంచి పూణెకు వెళ్లాల్సిన విమానం యూకే971 ఆలస్యమైందని విస్తారా సిబ్బంది తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..