AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: అర్ధరాత్రి బాల్కనీలో కనిపించిన దెయ్యం.. భయంతో రాత్రంతా బిక్కుబిక్కుమంటూ.. తెల్లారాక వచ్చి చూస్తే.. !

ఒక రోజు రాత్రి తనకు నిద్ర పట్టక కాసేపు బాల్కనీలో గడపాలని బయటకు వెళ్లింది. హాయిగా చల్ల గాలిలో కాసేపు బాల్కనీలో కూర్చుందామని అనుకుంది. అయితే అక్కడ కనిపించిన దృశ్యం చూసి ఆమె భయంతో వణికిపోయింది. ఒక్కసారిగా ఆమెకు గుండె ఆగిపోయినంత పనైంది. భయంతో 10-15 సార్లు..హనుమాన్ చాలీసా చదువుకుంటూ ఇంట్లోకి వచ్చేసింది. వారి బాల్కనీకి ఎదురుగా ఉన్న చెట్టుపై ఆమెకు దెయ్యం కనిపించింది.

Viral Video: అర్ధరాత్రి బాల్కనీలో కనిపించిన దెయ్యం.. భయంతో రాత్రంతా బిక్కుబిక్కుమంటూ..  తెల్లారాక వచ్చి చూస్తే.. !
Ghost
Jyothi Gadda
|

Updated on: Aug 23, 2023 | 3:51 PM

Share

దెయ్యం సినిమాలు చూసేవాళ్లు రాత్రంతా నిద్రపోరు. పగలు, రాత్రి అద్దంలో చూసుకోవాలంటే కూడా భయపడేవారూ ఉన్నారు. రీల్‌తో పాటు రియల్‌లోనూ దెయ్యం కనిపిస్తే, ఇంకేమైనా ఉంటుందా..? రాత్రి పూట ఇంటి బాల్కనీ దగ్గర దెయ్యం కనిపిస్తే ఎలా ఉంటుంది.. దెబ్బకు ప్యాంటు తడిసిపోతుంది. కొందరైతే దేవుడి గుడిలోకో, లేదంటే పూజా మందిరంలోకి పరిగెడతారు. మరికొందరు నిద్రమానుకుని ఇంట్లోకి దెయ్యం వస్తుందేమోనని భయంతో ఎదురు చూస్తారు. మరికొందరు దుప్పటి నిండా కప్పుకుని బయటకు చూసే సాహసం చేయరు. గాయత్రీ మంత్రం, హనుమాన్ చాలీసా, అనేక ఇతర మంత్రాలు పటిస్తుంటారు. దెయ్యాన్ని చూశామనే భయంతో జ్వరం వచ్చి నాలుగైదు రోజులు మంచానికే పరిమతమయ్యేవారు కూడా ఉన్నారు. దెయ్యాల గురించి రాయడం చాలా సులభం. వాటిని చూస్తే భయం అనుభవించిన వారికే తెలుస్తుంది. ఇప్పుడు ఓ మహిళ తన పరిస్థితిని సోషల్ మీడియాలో వెల్లడించింది. ఆమె చెప్పేది వింటుంటే ఓ పక్క నవ్వుకుంటారు. మరోవైపు, రాత్రిపూట అలాంటి సీన్‌ ఎదురైతే ఏంటి పరిస్థితి అని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ వైరల్‌ వీడియోని అనిరుద్ధ జోషి అనే మహిళ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. దీంతో ఆమెకు ఆ రాత్రంత నిద్రకరువైందని చెప్పింది. ఇంతకు ఆమెకు ఎదురైన సమస్య ఏంటంటే… ఒక రోజు రాత్రి తనకు నిద్ర పట్టక కాసేపు బాల్కనీలో గడపాలని బయటకు వెళ్లింది. హాయిగా చల్ల గాలిలో కాసేపు బాల్కనీలో కూర్చుందామని అనుకుంది. అయితే అక్కడ కనిపించిన దృశ్యం చూసి ఆమె భయంతో వణికిపోయింది. ఒక్కసారిగా ఆమెకు గుండె ఆగిపోయినంత పనైంది. భయంతో  10-15 సార్లు..హనుమాన్ చాలీసా చదువుకుంటూ ఇంట్లోకి వచ్చేసింది. వారి బాల్కనీకి ఎదురుగా ఉన్న చెట్టుపై ఆమెకు దెయ్యం కనిపించింది. చెట్టుకు వేలాడుతూ.. అజ్ఞాత స్త్రీ రూపం ఆమె దృష్టిని ఆకర్షించింది. అర్థరాత్రుళ్లు చెట్లప దెయ్యాలు ఉంటాయనే కథలు ఆమెకు గుర్తుకు వచ్చాయి. అలాగే చింత చెట్టుతో సహా పెద్ద పెద్ద చెట్లకు దెయ్యాలు వేలాడుతుంటాయనే కథలు గుర్తుకు వచ్చాయి. దాంతో ఆ మహిళ తమ బాల్కనీ వద్దనున్న చెట్టుకు వేలాడుతుంది దెయ్యంగా భావించి ఆ రాత్రంత నిద్రపోలేదు. హనుమాన్ చాలీసా వింటూ ఆమె తన భయాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేసింది.

దెయ్యాల భయంతో రాత్రంతా గడిపిన మహిళ ఉదయం దెయ్యం ఉందో లేదో ఒక సారి చూడాలనుకుంది. ధైర్యం తెచ్చుకుని బాల్కనీకి వెళ్లింది. అయితే అక్కడ చూసిన దృశ్యం ఆమెకు నవ్వు తెప్పించింది. అక్కడ నైటీ ఆరేసి ఉండటం చూసి నివ్వెరపోయింది. కానీ, అంతకుముందు రాత్రి జరిగిన సంఘటన గుర్తొచ్చి ఆమెకు కోపం ఆగలేదు. ఎవరో నైటీని వింతగా ఆరేశారు. నైటీకి హ్యాంగర్ వేసి చెట్టుకు వేలాడదీశారు. రాత్రి సమయంలో మహిళ నైటీ మాత్రమే చూసింది. హ్యాంగర్ కనిపించలేదు. చూడలేదు. దాంతో ఆ మహిళ దెయ్యంగా భావించింది. రాత్రంతా తనను అంతలా భయపెట్టింది ఆరేసిన నైటీ అని తెలియక షాకయిపోయానంటూ మహిళ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసింది.. నైటీని ఎవరైనా ఇలా ఆరబెడతారా అని సదరు మహిళ ఆ వీడియోలో ప్రశ్నించింది.

వైరల్ వీడియోపై చాలా మంది స్పందించారు. ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియోను చాలా మంది చూశారు. ఇది 77 వేల కంటే ఎక్కువ వ్యూస్‌ సాధించింది. కెమెరా లేకుండా ఫ్రాంక్ చేయటం అంటే ఇదే అంటూ కొందరు వ్యాఖ్యానించగా, మీరు ఈ కథను బాగా అల్లారు.. ఇది నిజం కాదు, వీడియో కోసం ఇలా చేశారంటూ మరొకరు వ్యాఖ్యానించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

కేతు సంచారంతో ఈ రాశుల వారికి ఇక స్వర్ణయుగమే..! మీ రాశి ఉందా..?
కేతు సంచారంతో ఈ రాశుల వారికి ఇక స్వర్ణయుగమే..! మీ రాశి ఉందా..?
హైదరాబాద్‌లో ఆ సంస్థ విస్తరణకు కుదిరిన MOU.. భారీగా ఉద్యోగాలు
హైదరాబాద్‌లో ఆ సంస్థ విస్తరణకు కుదిరిన MOU.. భారీగా ఉద్యోగాలు
ప్లాస్టిక్ వస్తువులపై మరకలు పోవట్లేదా? ఇది బెస్ట్ సొల్యూషన్!
ప్లాస్టిక్ వస్తువులపై మరకలు పోవట్లేదా? ఇది బెస్ట్ సొల్యూషన్!
దేశం కంటే లీగ్ క్రికెట్టే ముఖ్యమంటూ స్టేట్ మెంట్.. కట్‌చేస్తే..
దేశం కంటే లీగ్ క్రికెట్టే ముఖ్యమంటూ స్టేట్ మెంట్.. కట్‌చేస్తే..
ఐన్‌స్టీన్ వీసా అంటే ఏమిటి.. దీనిని ఎవరికి ఇస్తారు.. ఎలా పొందాలి!
ఐన్‌స్టీన్ వీసా అంటే ఏమిటి.. దీనిని ఎవరికి ఇస్తారు.. ఎలా పొందాలి!
రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్ కింద ఒకేసారి రూ.4 వేలు
రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్ కింద ఒకేసారి రూ.4 వేలు
నల్లగా బొగ్గులా మారిన వెండి మళ్ళీ ప్రకాశిస్తుంది..
నల్లగా బొగ్గులా మారిన వెండి మళ్ళీ ప్రకాశిస్తుంది..
ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి..
ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి..
5 సిక్సర్లు, 12 ఫోర్లు.. 55 బంతుల్లో సెంచరీ.. వైభవ్ కన్నా డేంజరస్
5 సిక్సర్లు, 12 ఫోర్లు.. 55 బంతుల్లో సెంచరీ.. వైభవ్ కన్నా డేంజరస్
ప్రపంచంలో ఎత్తైన ప్రాంతంలో షూటింగ్ జరుపుకున్న తొలి భారతీయ సినిమా
ప్రపంచంలో ఎత్తైన ప్రాంతంలో షూటింగ్ జరుపుకున్న తొలి భారతీయ సినిమా