AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

pre wedding photoshoot: పిచ్చి పీక్స్.. కాస్తుంటే కాటికే వెళ్లేది.. వెడ్డింగ్‌ ఫోటోషూట్‌ కోసం నీళ్లలో దూకి..

43 సెకన్ల నిడివి గల ఈ క్లిప్‌లో ఓడ డెక్‌పై నిలబడి ఉన్న ఓ మహిళ నీటిలోకి దూకేసింది. దూరంగా ఉన్న మరో మహిళ ఆమెను ఫోటోలు తీయడం ప్రారంభించింది. కానీ ఇంతలోనే అక్కడున్న వారంతా గట్టి గట్టిగా కేకలు మొదలుపెట్టారు..ఫోటో షూట్‌కోసం నీళ్లలో దూకిన పెళ్లికూతురు మునిగిపోయిందని చూస్తున్న వారికి అర్థమైంది. అప్పటికే నీటిలో ఉన్న వరుడు ఆమెను పైకి లాగే ప్రయత్నం చేశాడు.. కానీ, లాభం లేకపోయింది.

pre wedding photoshoot: పిచ్చి పీక్స్.. కాస్తుంటే కాటికే వెళ్లేది.. వెడ్డింగ్‌ ఫోటోషూట్‌ కోసం నీళ్లలో దూకి..
Karthik Marriage 5
Jyothi Gadda
|

Updated on: Aug 23, 2023 | 7:00 PM

Share

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలోనూ అత్యంత కీలకమైన ఘట్టం. అలాంటి వివాహ వేడుకను కలకాలం గుర్తుండిపోయేలా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ ఆరాటపడుతుంటారు. పెళ్లికి మూహూర్తం పెట్టింది.. మొదలు బ్యాచిలర్‌ పార్టీ.. పసుపు దంచటం, మోహిందీ కార్యక్రమం, పెళ్లి కొడుకు లేదా పెళ్లి కూతుర్ని చేయటం వంటివి అన్ని హడావుడిగానే ఉంటాయి. ఇకపోతే, ముఖ్యంగా అమ్మాయిలు వీటిపై ఎక్కువ ఆసక్తి చూపుతారు. ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ ప్రస్తుతం బాగా ట్రెండ్‌ అవుతోంది. దీని కోసం ప్రజలు చాలా డబ్బు ఖర్చు చేస్తారు. ప్రీ వెడ్డింగ్‌ ఫోటో షూట్‌ కోసం ప్రత్యేకంగా చేయడానికి కొన్నిసార్లు పొరపాట్లు కూడా చేస్తారు. కొందరు ప్రాణాల మీదకు కూడా తెచ్చుకుంటారు. అలాంటిదే ఈ సంఘటన కూడా. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూశారంటే మీ శ్వాస ఆగిపోయేంత పనవుతుంది.

క్రేజీ క్లిప్స్ (@crazyclipsonly) అనే ఖాతా ద్వారా వైరల్ వీడియో ట్విట్టర్‌లో పోస్ట్ చేయబడింది. దీనికి క్యాప్షన్‌లో వివాహ వేడుక సందర్భంగా ఫోటో షూట్‌ కోసం నీళ్లలో స్విమ్మింగ్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్న మహిళ ప్రమాదంలో పడింది. ఆగస్టు 21న షేర్ చేసిన ఈ క్లిప్‌కు 7 మిలియన్ల వీక్షణలు వచ్చాయి. అదే సమయంలో 70 వేల మందికి పైగా లైక్ చేసారు. ఈ అద్భుతమైన వీడియో మీకు గూస్‌బంప్స్‌ తెప్పిస్తుంది.

ఇవి కూడా చదవండి

43 సెకన్ల నిడివి గల ఈ క్లిప్‌లో ఓడ డెక్‌పై నిలబడి ఉన్న ఓ మహిళ నీటిలోకి దూకేసింది. దూరంగా ఉన్న మరో మహిళ ఆమెను ఫోటోలు తీయడం ప్రారంభించింది. కానీ ఇంతలోనే అక్కడున్న వారంతా గట్టి గట్టిగా కేకలు మొదలుపెట్టారు..ఫోటో షూట్‌కోసం నీళ్లలో దూకిన పెళ్లికూతురు మునిగిపోయిందని చూస్తున్న వారికి అర్థమైంది. అప్పటికే నీటిలో ఉన్న వరుడు ఆమెను పైకి లాగే ప్రయత్నం చేశాడు.. కానీ, లాభం లేకపోయింది. ఆమె ధరించిన గౌను మాత్రం పైకి తేలింది. వధువు కనిపించటం లేదు. దీంతో ఒకరి తర్వాత మరోకరు.. ముగ్గురు నలుగురు నీళ్లలోకి దూకారు. ఆమెను సురక్షితంగా పైకి లేపారు. ఎలాంటి ప్రమాదం లేకుండా వధువు పైకి రావటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్‌ చేయటంతో అది కాస్త వైరల్‌గా మారింది.

దీనిపై ప్రజలు రకరకాలుగా కామెంట్లు చేస్తూ తమ స్పందనలను తెలియజేస్తున్నారు. ఒకరు ఇది నిజంగానే మరపురాని రోజు అంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

మెగాస్టార్‌ నయా సెంటిమెంట్‌ రివీల్‌.. ఇక దుమ్ము దుమారమే
మెగాస్టార్‌ నయా సెంటిమెంట్‌ రివీల్‌.. ఇక దుమ్ము దుమారమే
ఆ రాశులవారు కాస్త జాగ్రత్త..! అధికారం, ఆదాయం తగ్గే ఛాన్స్
ఆ రాశులవారు కాస్త జాగ్రత్త..! అధికారం, ఆదాయం తగ్గే ఛాన్స్
ఓటర్ ఐడీ లేకున్నా.. ఓటు హక్కు వినియోగించుకోవచ్చు.. ఎలా అంటే?
ఓటర్ ఐడీ లేకున్నా.. ఓటు హక్కు వినియోగించుకోవచ్చు.. ఎలా అంటే?
పాకిస్తాన్ పాలిట ముగ్గురు విలన్లు.. 2 ఏళ్ల ఓటమి రుచి మరోసారి..?
పాకిస్తాన్ పాలిట ముగ్గురు విలన్లు.. 2 ఏళ్ల ఓటమి రుచి మరోసారి..?
మహాలక్ష్మీ రాజయోగం అంటే ఏమిటి? జాతకంలో ఇది ఎప్పుడు ఏర్పడుతుంది?
మహాలక్ష్మీ రాజయోగం అంటే ఏమిటి? జాతకంలో ఇది ఎప్పుడు ఏర్పడుతుంది?
హ్యాట్రిక్‌ ట్రయల్స్.. విక్టరీ హీరోకి వర్కవుట్‌ అవుతుందా
హ్యాట్రిక్‌ ట్రయల్స్.. విక్టరీ హీరోకి వర్కవుట్‌ అవుతుందా
ప్యాన్‌ ఇండియా అంటే హింసేనా !! విజయానికి అదే మార్గమా
ప్యాన్‌ ఇండియా అంటే హింసేనా !! విజయానికి అదే మార్గమా
నమ్మకానికి అమ్మ వంటిది టాలీవుడ్.. అంటున్న నార్త్ భామలు
నమ్మకానికి అమ్మ వంటిది టాలీవుడ్.. అంటున్న నార్త్ భామలు
ప్రేమికుల కోసమే ఈ ఫోక్ సాంగ్.. రాము రాథోడ్ అదరగొట్టేశాడు..
ప్రేమికుల కోసమే ఈ ఫోక్ సాంగ్.. రాము రాథోడ్ అదరగొట్టేశాడు..
అత్తమామలకు విద్యుత్ షాక్ పెట్టిన అల్లుడు.. చివరకు..
అత్తమామలకు విద్యుత్ షాక్ పెట్టిన అల్లుడు.. చివరకు..