Andhra Pradesh: మా ఊరి చెరువులో దొంగలు పడ్డారు.. పోలీసులను ఆశ్రయించిన పంచాయతీ పెద్దలు.. విషయం ఏంటంటే..
Andhra Pradesh: పంచాయితీ ఆధీనంలో ఉన్న చెరువులోని చేపలు అమ్మగా వచ్చిన ఆదాయం పంచాయితీకే చెందాలని టిడిపి, తాము అధికారంలో ఉండి మేమే చేపలు వేసినందున వాటిపై మాకే హక్కుందని వైసిపి నేతలు మధ్య గొడవ జరిగినట్లుగా తెలుస్తుంది. ఈ క్రమంలో ఎవరికి వారే చేపలు పట్టే ప్రయత్నం చేసినట్లుగా తెలుస్తుంది. మొత్తం మీద రాజకీయ నాయకులు చివరికి చేపల చెరువును కూడా వదిలిపెట్టలేదని స్థానికులు చర్చించుకుంటున్నారు.
గుంటూరు, ఆగస్టు 25: చెరువులో దొంగలు పడటం ఏంటా అనుకుంటున్నారా… మీరు చదివింది కరెక్టే. చెరువులో దొంగలు పడి ఏంఎత్తుకెళ్లారనుకుంటున్నారా..? ఇంకేంముంటాయి చేపలే… మీరు అనుకున్నది కరెక్టే.. అయితే, ఆ చెరువు పంచాయితీది కావటంతో అధికారులు ఏకంగా పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. దీంతో ఇప్పుడు జిల్లాలో ఆ చెరువే హాట్ టాపిక్ గా మారింది. గుంటూరు జిల్లా వట్టి చెరుకూరు మండలం అనంతవరప్పాడులోని పంచాయితీ ఆధీనంలో చెరువు ఉంది. ఈచెరువలో చేపలను సాగు చేస్తుంటారు. అయితే ఊరి రాజకీయాలు చెరవులోకి దూరాయి. ఇక్కడ సర్పంచ్ గా టిడిపి బలపరిచిన దారా వెంకట రావు ఉన్నారు. ఆయనకు గ్రామంలోని వైసిపి నేతలకు మధ్య పొసగటం లేదు. ఈ క్రమంలో నిన్న అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు గ్రామంలోకి వచ్చారు. వచ్చిన వాళ్లు చెరవులోకి దిగి చేపలు పట్టడం మొదలు పెట్టారు. దీంతో ఆ చెరువు చుట్టు పక్కల వాళ్లకి ఈ విషయం తెలిసింది. ఎవరా అంటూ నిలదీసే సరికి మాఇష్టం అంటూ అక్కడి నుండి వెళ్లిపోయారు.
అయితే, అప్పటికే క్వింటా చేపలను పట్టుకొని అక్కడి నుండి తరలించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ విషయం తెల్లవారే సరికి ఊరంతా తెలిసింది. వెంటనే సర్పంచ్ వెంకట్రావు పంచాయితీ సిబ్బంది సమావేశమయ్యారు. పంచాయితీ ఆధీనంలో చెరువులో పంచాయితీ అధికారుల అనుమతి లేకుండా చేపలు పట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. వెంటనే పంచాయితీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అయితే, అసలు విషయం ఏంటా అని ఆరా తీస్తే వైసిపి, టిడిపి నాయకుల మధ్య విబేధాలే చేపలు పోవడానికి కారణమని గుర్తించారు. పంచాయితీ ఆధీనంలో ఉన్న చెరువులోని చేపలు అమ్మగా వచ్చిన ఆదాయం పంచాయితీకే చెందాలని టిడిపి, తాము అధికారంలో ఉండి మేమే చేపలు వేసినందున వాటిపై మాకే హక్కుందని వైసిపి నేతలు మధ్య గొడవ జరిగినట్లుగా తెలుస్తుంది. ఈ క్రమంలో ఎవరికి వారే చేపలు పట్టే ప్రయత్నం చేసినట్లుగా తెలుస్తుంది. మొత్తం మీద రాజకీయ నాయకులు చివరికి చేపల చెరువును కూడా వదిలిపెట్టలేదని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఇంకా విలువైన చేపలు ఉన్నాయని వాటినైనా అమ్మి పంచాయితీకి ఆదాయం వచ్చేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..