AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

King Cobra: బాబోయ్‌ భారీ కింగ్‌ కోబ్రా.. మంచంపైకెక్కి దిండు కింద దూరింది.. అంతలోనే పడుకుందామని వచ్చిన వ్యక్తికి..

ప్రస్తుతం వేడి, తేమ కారణంగా పాములు వాటి రంధ్రాల నుండి బయటకు వస్తున్నాయని స్నేక్ క్యాచర్ చెప్పారు. కొన్నిసార్లు ఇవి వేటను వెతుక్కుంటూ జనావాసాలకు వస్తుంటాయని చెప్పారు.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎందుకంటే కింగ్ కోబ్రా చాలా ప్రమాదకరమైన పాము. దీని కాటు నిమిషాల్లో వ్యక్తి మరణానికి దారి తీస్తుందని హెచ్చరించారు.

King Cobra: బాబోయ్‌ భారీ కింగ్‌ కోబ్రా.. మంచంపైకెక్కి దిండు కింద దూరింది.. అంతలోనే పడుకుందామని వచ్చిన వ్యక్తికి..
King Cobra
Jyothi Gadda
|

Updated on: Aug 25, 2023 | 5:43 PM

Share

రాజస్థాన్‌లోని కోటాలో ఒక షాకింగ్‌ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇది విని ప్రజలు ఆశ్చర్యపోయారు. ఒక వ్యక్తి నిద్రోతున్న దిండు కింద ఒక భారీ కింగ్ కోబ్రా దాక్కుని ఉంది. ఆ వ్యక్తి దిండును తొలగించిన వెంటనే ఆ భారీ కింగ్‌ కోబ్రా ఒక్కసారిగా పైకి లేచింది. దీంతో ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పాము పొడవు 5 అడుగుల కంటే ఎక్కువగా ఉంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సంఘటన అంతా కోటాలో ఉన్న భామాషా మండికి చెందినదిగా తెలిసింది. ఒక పాము అక్కడ ఇంట్లోకి ప్రవేశించి మంచం మీద వేసివున్న దిండు కింద దాక్కుంది. అక్కడి స్థానికులు నిద్రించేందుకు వెళ్లి చూడగా దిండు కింద పాము ఉండడం చూసి షాక్‌కు గురయ్యారు. భయంతో అక్కడి నుంచి పారిపోయారు.

పడుకుందామని దిండును కాస్త పక్కకు తీయగానే భయంకర పాము పడగ విప్పి పైకి లేచి నిలబడిందని అక్కడ స్థానికంగా పనిచేస్తున్న ఒక కార్మికుడు చెప్పాడు. పామును చూడగానే ఒక్కసారిగా ఊపిరి ఆగిపోయినంత పనైందని ఆ వ్యక్తి భయపడుతూ చెప్పాడు. ఎలాంటి ప్రమాదం జరగకపోవటంతో పీల్చుకున్నామని చెప్పారు. వెంటనే అక్కడి నుంచి బయలుదేరి బయటకు వచ్చి పాము పట్టే వ్యక్తికి ఫోన్ చేశారు.. ఫారెస్ట్ ఆఫీసర్ సహాయంతో పామును పట్టుకుని సురక్షితంగా అడవిలో వదిలేశారు.

ప్రస్తుతం వేడి, తేమ కారణంగా పాములు వాటి రంధ్రాల నుండి బయటకు వస్తున్నాయని స్నేక్ క్యాచర్ చెప్పారు. కొన్నిసార్లు ఇవి వేటను వెతుక్కుంటూ జనావాసాలకు వస్తుంటాయని చెప్పారు.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎందుకంటే కింగ్ కోబ్రా చాలా ప్రమాదకరమైన పాము. దీని కాటు నిమిషాల్లో వ్యక్తి మరణానికి దారి తీస్తుందని హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి

వైరల్ వీడియోలో పాము మంచం మీద సరదాగా దొర్లుతోంది. చుట్టూ చాలా మంది ఉన్నారు. కొంతసేపటికి ఒక స్నేక్‌ క్యాచర్‌ వచ్చాడు. చకచక్యంగా పామును బంధించి గోనె సంచులో వేసుకుని తీసుకెళ్లాడు. పాము ఎవరికీ హాని చేయకపోవడంతో అక్కడి స్థానికులంతా హమ్మాయ్యా అనుకున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఆటోగ్రాఫ్ అడిగితే ఫోన్ నంబర్.. లెక్కల మాస్టారి లవ్ స్టోరి
ఆటోగ్రాఫ్ అడిగితే ఫోన్ నంబర్.. లెక్కల మాస్టారి లవ్ స్టోరి
బంగ్లాదేశ్‌లో ఇద్దరు హిందువుల హత్య.. భారత్‌ మాస్ వార్నింగ్‌!
బంగ్లాదేశ్‌లో ఇద్దరు హిందువుల హత్య.. భారత్‌ మాస్ వార్నింగ్‌!
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
ఎందుకు విక్రమ్ ఇలా చేశావ్.. బెట్టింగ్‌కు అలవాటు పడి..
ఎందుకు విక్రమ్ ఇలా చేశావ్.. బెట్టింగ్‌కు అలవాటు పడి..
ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో