Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఒక చేతిలో స్టీరింగ్‌, మరో చేతిలో గొడుగు.. జోరువానలో డొక్కు బస్సుతో డ్రైవర్‌ సాహసం..

భారీ వర్షం కారణంగా ఓ బస్సు పైకప్పుకు చిల్లులు పడి నీరు కారడం మొదలైంది. దీంతో డ్రైవర్ తన తలపై గొడుకు పట్టుకుని బస్సును అతి వేగంతో నడపడం ప్రారంభించాడు. డ్రైవర్ ఒంటి చేత్తో బస్సును నడుపుతున్న తీరు చూస్తుంటే.. ఎక్కడ ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని అందరిలో ఆందోళన కలుగుతోంది. ఇలా రిస్క్ తీసుకుని బస్సు నడపడం వల్ల డ్రైవర్‌తో పాటు బస్సులోని ప్రయాణికులు, రోడ్డున వెళ్లేవారికి కూడా ప్రమాదమే అంటున్నారు పలువురు నెటిజన్లు.

Viral Video: ఒక చేతిలో స్టీరింగ్‌, మరో చేతిలో గొడుగు.. జోరువానలో డొక్కు బస్సుతో డ్రైవర్‌ సాహసం..
Msrtc Bus Drive
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 25, 2023 | 4:36 PM

వర్షంలో తడవకుండా ఉండేందుకు గొడుగు పట్టుకుని వెళ్లే వారిని చాలా మంది చూసి ఉంటారు. కానీ, గొడుగు పట్టుకుని బస్సు నడపడం ఎక్కడైనా చూసారా. ఈ వార్త వినడానికి మీకు వింతగా అనిపిస్తుంది కదూ..! కానీ ఇది జరిగింది. ఇక్కడో ఒక డ్రైవర్ వర్షం పడకుండా గొడుగు పట్టుకుని బస్సు నడుపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డ్రైవర్ ఓ చేత్తో గొడుగు పట్టుకుని మరో చేత్తో బస్సును నడుపుతున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. ఈ వీడియో వైరల్ అయిన తర్వాత వినియోగదారులు కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో మహారాష్ట్రలోని గడ్చిరోలికి చెందినదిగా తెలిసింది.

మహారాష్ట్రలో గత కొద్ది రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షం కారణంగా ఓ బస్సు పైకప్పుకు చిల్లులు పడి నీరు కారడం మొదలైంది. దీంతో డ్రైవర్ తన తలపై గొడుకు పట్టుకుని బస్సును అతి వేగంతో నడపడం ప్రారంభించాడు. డ్రైవర్ ఒంటి చేత్తో బస్సును నడుపుతున్న తీరు చూస్తుంటే.. ఎక్కడ ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని అందరిలో ఆందోళన కలుగుతోంది. ఇలా రిస్క్ తీసుకుని బస్సు నడపడం వల్ల డ్రైవర్‌తో పాటు బస్సులోని ప్రయాణికులు, రోడ్డున వెళ్లేవారికి కూడా ప్రమాదమే అంటున్నారు పలువురు నెటిజన్లు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో వైరల్ కావడంతో ఇప్పుడు దీనిపై రాజకీయాలు కూడా మొదలయ్యాయి. ఈ వీడియోను ట్వీట్ చేయడం ద్వారా ముంబై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుంది. అదే సమయంలో వినియోగదారులు కూడా ఈ వీడియోపై భిన్నమైన కామెంట్స్‌ చేస్తున్నారు. ఆ బస్సులోని ప్రయాణికులకు ఆ దేవుడే దిక్కు అంటున్నారు.

ఇకపోతే, మహారాష్ట్రలోని గడ్చిరోలిలో ఇలాంటి పైకప్పు విరిగిపోయి బస్సు ప్రజా రవాణా కోసం వినియోగిస్తున్నట్టుగా అర్థమవుతోంది. ఇది సోషల్ మీడియాలో విస్తృతంగా కనిపించింది. మహారాష్ట్ర స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (MSRTC) బస్సుగా గుర్తించారు. గడ్చిరోలి-అహేరి రహదారిపై ఇలాంటి టాప్‌లెస్‌ బస్సును నడుపుతున్నాడు డ్రైవర్. అయితే, వీడియో వైరల్‌ కావటంతో అధికారులు చర్యలు తీసుకున్నట్టుగా తెలిసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

ట్రావిస్ హెడ్‌ను తగులుకున్న స్టార్క్! 8 ఇన్నింగ్స్ లో 6 సార్లు..
ట్రావిస్ హెడ్‌ను తగులుకున్న స్టార్క్! 8 ఇన్నింగ్స్ లో 6 సార్లు..
సమ్మర్ వెకేషన్‌కి అద్భుతమైన ప్లేసెస్ ఇవే..
సమ్మర్ వెకేషన్‌కి అద్భుతమైన ప్లేసెస్ ఇవే..
భారీ విస్ఫోటనం.. గ్యాస్ పైప్‌లైన్ నుంచి ఎగిసిపడుతున్న మంటలు..
భారీ విస్ఫోటనం.. గ్యాస్ పైప్‌లైన్ నుంచి ఎగిసిపడుతున్న మంటలు..
మీరు వాడే టూత్ బ్రష్‌ ఎన్ని రోజులకు మారుస్తున్నారు?
మీరు వాడే టూత్ బ్రష్‌ ఎన్ని రోజులకు మారుస్తున్నారు?
మరోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్‌..
మరోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్‌..
హెల్త్ సూపర్ వైజర్ దారుణ హత్య.. మిరపతోటలో గొడ్డలితో నరికి చంపిన
హెల్త్ సూపర్ వైజర్ దారుణ హత్య.. మిరపతోటలో గొడ్డలితో నరికి చంపిన
పుచ్చకాయలోని తెల్లని భాగం పొరబాటున ఎప్పుడైనా తినేశారా?
పుచ్చకాయలోని తెల్లని భాగం పొరబాటున ఎప్పుడైనా తినేశారా?
ఓటీటీలోకి వచ్చేసిన వరలక్ష్మి క్రైమ్ థ్రిల్లర్..ఊహించని ట్విస్టులు
ఓటీటీలోకి వచ్చేసిన వరలక్ష్మి క్రైమ్ థ్రిల్లర్..ఊహించని ట్విస్టులు
ఓవైపు వివాదాలు.. మరోవైపు దిమ్మతిరిగే కలెక్షన్స్..
ఓవైపు వివాదాలు.. మరోవైపు దిమ్మతిరిగే కలెక్షన్స్..
అప్పుడు రజినీకాంత్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు బుల్లితెర
అప్పుడు రజినీకాంత్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు బుల్లితెర