AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Viral video: నెమలిని ఒడిలో పెట్టుకుని విమానంలో ప్రయాణించిన మహిళ.. షాక్‌లో తోటి ప్రయాణికులు, సిబ్బంది..

నెమలిని ఒడిలో పెట్టుకుని విమానంలో ప్రయాణిస్తున్న మహిళను చూసిన తోటి ప్రయాణికులు నెవ్వెరపోయారు. ఇదేలా సాధ్యం అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సహజంగానే ఈ వీడియో నెటిజన్లను ఉలిక్కిపడేలా చేసింది. ఈ దృశ్యాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియో ట్విటర్‌లో షేర్ చేయగా, ఇప్పుడు విపరీతమైన వ్యూస్‌ని సొంతం చేసుకుంది.

Watch Viral video: నెమలిని ఒడిలో పెట్టుకుని విమానంలో ప్రయాణించిన మహిళ.. షాక్‌లో తోటి ప్రయాణికులు, సిబ్బంది..
Woman Carries A Peacock On
Jyothi Gadda
|

Updated on: Aug 25, 2023 | 5:02 PM

Share

పెంపుడు జంతువులను ఎంతో ప్రేమగా చూసుకునే వారు అసంఖ్యాకంగా ఉన్నారు. కొందరైతే పెంపుడు జంతువులను ఇంట్లోనే కాకుండా ప్రయాణాల్లోనూ వెంట తీసుకువెళతారు. ఇలా కుక్కలు, పిల్లులు, కొన్నిసార్లు చిలుకలను తమ వెంట తీసుకెళ్లే వ్యక్తులను చూసినప్పుడు మనకు ఆశ్చర్యం కలగకమానదు. కానీ, ఎప్పుడైనా ఎవరైనా నెమలితో ప్రయాణించడం ఎప్పుడైనా చూసారా…? అది కూడా విమానంలోనే…! బహుశా ఈ దృశ్యం చాలా మందికి కొత్త విషయమే. అయితే ఇప్పుడు అలాంటి వీడియో వైరల్ అవుతోంది. నెమలిని ఒడిలో పెట్టుకుని విమానంలో ప్రయాణిస్తున్న మహిళకు సంబంధించిన వీడియో ఇంటర్‌నెట్‌లో వైరల్‌ అవుతోంది.

ఈ షాకింగ్ దృశ్యాన్ని ట్విట్టర్‌లో పంచుకున్నారు. వైరల్‌ వీడియోలో ఒక పెద్ద నెమలిని ప్రేమగా ఎత్తుకుని విమానంలోకి ప్రవేశించే దృశ్యంతో ప్రారంభమవుతుంది. దీని తర్వాత ఆమె ఆ నెమలిని తన ఒడిలోకి తీసుకుంటుంది. ఈ దృశ్యాన్ని విమానంలోని తోటి ప్రయాణికులు తీశారు. ఆ నెమలి కూడా అంతే ప్రేమతో చిన్నపిల్లలా ఆమె ఒడిలో కూర్చుంటుంది. 9 సెకన్ల నిడివి గల ఈ వీడియోను ‘వైల్డ్ కంటెంట్’ అనే ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.

ఇవి కూడా చదవండి

ఇకపోతే, ఈ వీడియో ఎక్కడిది అనేది స్పష్టంగా తెలియరాలేదు. అయితే, ఈ వీడియో 2022లోనే ఇంటర్నెట్‌లో కనిపించింది. ఇప్పుడు ఈ వీడియో మళ్లీ సోషల్ మీడియాలో తెరపైకి వచ్చింది. సహజంగానే ఈ వీడియో నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. అయితే ఈ దృశ్యాన్ని చూసిన పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేయగా, మరికొందరు వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఇది విమానయాన సంస్థల నిర్లక్ష్యమేనని పలువురు అంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
కళ్లజోడు పెట్టుకునే పిల్లలకి ఈ కూర పెడితే.. కంటిచూపు సమస్యలు..
కళ్లజోడు పెట్టుకునే పిల్లలకి ఈ కూర పెడితే.. కంటిచూపు సమస్యలు..
ఈసారి 10 కాదు 14 జట్లు.. 2027 వన్డే వరల్డ్ కప్ డేట్స్ వచ్చేశాయ్
ఈసారి 10 కాదు 14 జట్లు.. 2027 వన్డే వరల్డ్ కప్ డేట్స్ వచ్చేశాయ్
భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఒక్కరోజే ఎంతంటే..?
భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఒక్కరోజే ఎంతంటే..?
ఏసీ కూలింగ్ ఎక్కువ రావడం లేదా.. ఈ చిన్న వాటర్ ట్రిక్ ట్రై చేయండి
ఏసీ కూలింగ్ ఎక్కువ రావడం లేదా.. ఈ చిన్న వాటర్ ట్రిక్ ట్రై చేయండి
కెమికల్స్ కలిపిన టమాటాలను ఇంట్లోనే ఎలా గుర్తించాలో తెలుసా..?
కెమికల్స్ కలిపిన టమాటాలను ఇంట్లోనే ఎలా గుర్తించాలో తెలుసా..?
9 సీట్ల వాహనంలో 40 మంది ప్రయాణం.. షాకైన జనాలు..నెట్టింట్లో వైరల్‌
9 సీట్ల వాహనంలో 40 మంది ప్రయాణం.. షాకైన జనాలు..నెట్టింట్లో వైరల్‌
ఆరోగ్య ప్రదాయిని పీతల చారు.. ఆ సమస్యలన్నీ తరిమికొట్టే పవర్‌ఫుల్!
ఆరోగ్య ప్రదాయిని పీతల చారు.. ఆ సమస్యలన్నీ తరిమికొట్టే పవర్‌ఫుల్!
ఒక్కసారి ఇన్వెస్ట్‌ చేస్తే చాలు.. మీ చేతికి నెలకు రూ.21,000..!
ఒక్కసారి ఇన్వెస్ట్‌ చేస్తే చాలు.. మీ చేతికి నెలకు రూ.21,000..!
తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్‌కు బిగ్ షాక్..
తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్‌కు బిగ్ షాక్..
ఈ వెరైటీ పాము గురించి మీకు తెలుసా..?
ఈ వెరైటీ పాము గురించి మీకు తెలుసా..?