AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: ఆ టాయిలెట్‌తో సెల్ఫీ కోసం ఎగబడుతున్న జనాలు.. అసలు స్టోరీ తెలిస్తే అవాక్కవుతారు..!

Thailand Royal Washroom Video: ప్రయాణ మార్గంలో టాయిలెట్ వస్తే ఏం చేస్తాం.. ఎక్కడైన టాయిలెట్స్ ఉన్నాయో చూసుకుని, అక్కడికి వెళతాం. కానీ, పబ్లిక్ టాయిలెట్స్ ఎంత విసుగు పుట్టిస్తాయో మన అందరికీ తెలిసిందే. వాటి నిర్వహణ లోపం కారణంగా ముక్కు పుటాలు పగిలిపోతాయి. కానీ, ఇప్పుడు మనం చెప్పుకోబోయే.. కాదు కాదు.. చూడబోయే బాత్రూమ్ గురించి తెలిస్తే మాత్రం నోరెళ్లబెట్టి.. అదేదో సెలబ్రిటీతో సెల్ఫీ దిగినట్లుగా ఫోటోలు వరుబెట్టి దిగుతారు. అంతేకాదు.. స్వీట్ మెమరీగా దాని వీడియోలు కూడా తీసి దాచిపెట్టుకుంటారు. బాత్రూమ్‌తో సెల్ఫీలేంటి? వీడియోలు తీసుకుని దాచిపెట్టుకోవడం ఏంటి? అని ఆశ్చర్యపోతున్నారా? అవును మరి. అది అట్టాంటి ఇట్టాంటి బాత్రూమ్ కాదండోయ్..

Watch Video: ఆ టాయిలెట్‌తో సెల్ఫీ కోసం ఎగబడుతున్న జనాలు.. అసలు స్టోరీ తెలిస్తే అవాక్కవుతారు..!
Thailand Golden Toilet
Shiva Prajapati
|

Updated on: Aug 25, 2023 | 11:53 PM

Share

Thailand Royal Washroom Video: ప్రయాణ మార్గంలో టాయిలెట్ వస్తే ఏం చేస్తాం.. ఎక్కడైన టాయిలెట్స్ ఉన్నాయో చూసుకుని, అక్కడికి వెళతాం. కానీ, పబ్లిక్ టాయిలెట్స్ ఎంత విసుగు పుట్టిస్తాయో మన అందరికీ తెలిసిందే. వాటి నిర్వహణ లోపం కారణంగా ముక్కు పుటాలు పగిలిపోతాయి. కానీ, ఇప్పుడు మనం చెప్పుకోబోయే.. కాదు కాదు.. చూడబోయే బాత్రూమ్ గురించి తెలిస్తే మాత్రం నోరెళ్లబెట్టి.. అదేదో సెలబ్రిటీతో సెల్ఫీ దిగినట్లుగా ఫోటోలు వరుబెట్టి దిగుతారు. అంతేకాదు.. స్వీట్ మెమరీగా దాని వీడియోలు కూడా తీసి దాచిపెట్టుకుంటారు. బాత్రూమ్‌తో సెల్ఫీలేంటి? వీడియోలు తీసుకుని దాచిపెట్టుకోవడం ఏంటి? అని ఆశ్చర్యపోతున్నారా? అవును మరి. అది అట్టాంటి ఇట్టాంటి బాత్రూమ్ కాదండోయ్.. గోల్డెన్ టాయిలెట్. ఆ టాయిలెట్ అందానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే మరి. లోపలికి వెళ్లడానికన్నా ముందు దాని ఎంట్రీ ఒక రాజ భవన ప్రవేశ ద్వారంలా కనిపిస్తుంది. లోపలికి వెళితే కానీ, అది బాత్రూమ్ అన్నసంగతి తెలియదు. అలా ఉంటుంది మరి ఆ టాయిలెట్. ఈ టాయిలెట్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ రాయల్ వాష్‌రూమ్ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

View this post on Instagram

A post shared by 𝘒𝘳𝘪𝘴𝘩𝘢𝘯𝘨𝘪 || 𝘛𝘖𝘐𝘔𝘖𝘐 𝘛𝘈𝘓𝘌𝘚 (@krishangiisaikia)

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..