Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Election Counting fear: ఏపీలో ప్రధాన పార్టీలకు కౌంటింగ్‌ ఫియర్‌.. డీజీపీని కలిసి ఫిర్యాదు చేస్తున్న నేతలు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన పార్టీలన్నింటికి కౌంటింగ్‌ టెన్షన్‌ పట్టుకుంది. రిజల్ట్స్‌ డేకు టైమ్‌ దగ్గర పడుతున్న వేళ.. కీలక నేతలు కౌంటింగ్‌పై అనుమానాలు వ్యక్తం చేయడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అసలు కౌంటింగ్ రోజు ఏం జరగబోతోందన్న ఆందోళన అందరిలోనూ స్టార్ట్‌ అయ్యింది.

Election Counting fear: ఏపీలో ప్రధాన పార్టీలకు కౌంటింగ్‌ ఫియర్‌.. డీజీపీని కలిసి ఫిర్యాదు చేస్తున్న నేతలు
Counting Arrangements
Follow us
Balaraju Goud

|

Updated on: May 26, 2024 | 11:26 AM

ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన పార్టీలన్నింటికి కౌంటింగ్‌ టెన్షన్‌ పట్టుకుంది. రిజల్ట్స్‌ డేకు టైమ్‌ దగ్గర పడుతున్న వేళ.. కీలక నేతలు కౌంటింగ్‌పై అనుమానాలు వ్యక్తం చేయడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అసలు కౌంటింగ్ రోజు ఏం జరగబోతోందన్న ఆందోళన అందరిలోనూ స్టార్ట్‌ అయ్యింది.

ఏపీలో ప్రధాన పార్టీలన్నింటికి కౌంటింగ్‌ ఫియర్‌ మొదలైంది. కౌంటింగ్ వేళ అలర్ట్‌గా ఉండకపోతే ఫలితాలు తారుమారు చేస్తారన్న అనుమానాల్ని ప్రధాన పార్టీలు వ్యక్తం చేస్తున్నాయి. కౌంటింగ్‌ వేళ కూటమి నేతలు అలర్ట్‌గా ఉండాలంటూ మొన్న ఏపీ బీజేపీ చీఫ్‌ పురందేశ్వరి కామెంట్స్‌ చేయడం.. లేటెస్ట్‌గా ఇదే విషయంపై డీజీపీని వైసీపీ నేతలు కలిసి ఫిర్యాదు చేయడం రాష్ట్రవ్యాప్తంగా హాట్‌ టాపిక్‌గా మారింది.

జూన్ 4న కౌంటింగ్‌ సజావుగా జరుగుతుందన్న నమ్మకం లేదంటూ డీజీపీని కలిశారు వైసీపీ నేతలు. పలు నియోజకవర్గాల్లో పోలీసులు వైసీపీ కార్యకర్తలను కౌంటింగ్ ఏజెంట్లుగా ఉండొద్దంటూ భయబ్రాంతులకు గురిచేస్తున్నట్లు డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఇంట్లో మహిళలను భయపెట్టి, మగవాళ్లను కౌంటింగ్‌ ఏజెంట్లుగా తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మొన్నటికి మొన్న ఏపీ బీజేపీ చీఫ్‌ పురందేశ్వరి సైతం కౌంటింగ్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇన్నాళ్లు కలిసి పనిచేసిన కూటమి నేతలు, కార్యకర్తలంతా అప్రమత్తంగా ఉండాల్సిన టైమ్‌ వచ్చిందన్నారు. కౌంటింగ్ ఏజెంట్లపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని నేతలను కోరారు.

ఇక కౌంటింగ్‌పై కీలక నేతలే అనుమానాలు వ్యక్తం చేయడంతో… ప్రధాన పార్టీల నేతలందరూ అలర్ట్‌ అయ్యారు. పోలింగ్‌, కౌంటింగ్‌కు మధ్య దాదాపు మూడు వారాల గ్యాప్‌ రావడంతో కాస్త రిలాక్స్‌ మోడ్‌లోకి వెళ్లి నేతలు… ఇప్పుడు లైన్‌లోకొచ్చారు. అధిష్టానాల ఆదేశాలతో అప్రమత్తమయ్యారు. పోలింగ్ వేళ తాము అమలు చేయాలని భావించిన వ్యూహాలను, ఎంతమేర అమలు చేశామన్న దానిపై సమీక్షలు జరుపుతూ.. కౌంటింగ్ రోజు అనుసరించాల్సిన విధానాలు ఏమిటన్న దానిపై సుదీర్ఘం చర్చలు జరుపుతున్నారు. కౌంటింగ్ వేళ ఏజెంట్ల నియామకంపై చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కౌంటింగ్‌ టైమ్‌లో ఎలా ఉండాలి…? పరిస్థితులకు అనుగుణంగా ఎలా రియాక్టు కావాలి? అన్న దానిపై ఎత్తుగడలను సిద్దం చేసుకుంటున్నారు.

మొత్తంగా ఇంతకాలం పోలింగ్ టెన్షన్ లో ఉన్న నేతలు.. ఇప్పుడు కౌంటింగ్ అటెన్షన్ కు వచ్చేశారు. రిజల్ట్స్‌కు టైమ్‌ దగ్గర పడుతుండటం, అధిష్టానాల నుంచి కౌంటింగ్‌పై అనుమానాలు వ్యక్తమవ్వడంతో మరింత అప్రమత్తమయ్యారు.

ఏపీ ఎలక్షన్ కౌంటింగ్‌లో హింసాత్మక ఘటనలు జరగకుండా అన్ని జిల్లాలకు స్పెషల్‌ పోలీసు ఆఫీసర్లను నియమించారు. అత్యంత సమస్యాత్మక ప్రాంతంగా గుర్తించబడ్డ పల్నాడులో అత్యధికంగా 8 మంది పోలీస్‌ అధికారులను నియమించారు. కృష్ణా జిల్లాకు చిత్తూరు జిల్లా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఎస్పీగా పని చేస్తున్న లావణ్య లక్ష్మిని.. విజయవాడ పోలీస్ కమిషనరేట్‌కు సిఐడి డిఎస్పి సోమన్నను నియమించారు ఏపీ డీజీపీ.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…