ల్యాండ్ టైటిలింగ్ వ్యవహారంలో టీడీపీపై ఈసీ సీరియస్.. సీఐడీ విచారణకు ఆదేశం..

సీఎం జగన్‎పై దుష్ప్రచారం చేస్తున్న టీడీపీపై చర్యలు తీసుకోవాలని ఈసీ, సీఐడీకి ఆదేశాలు జారీ చేసింది. సీఎం జగన్ భూములు లాక్కుంటారని అబద్ధాలు చెబుతున్నారంటూ వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డితో పాటు విజయవాడ సెంట్రల్ సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఈసీకి ఫిర్యాదు చేశారు. దీనిపై ఈసీ స్పందించన ఈసీ టీడీపీపై చర్యలు తీసుకునేందుకు ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్‎లో ఎన్నికల ప్రచారం రోజు రోజుకు పుంజుకుంటోంది. ఒక వైపు అధికార వైసీపీ తాను చేసిన సంక్షేమం, అభివృద్దిని చూసి ఓటు వేయమని చెబుతోంది.

ల్యాండ్ టైటిలింగ్ వ్యవహారంలో టీడీపీపై ఈసీ సీరియస్.. సీఐడీ విచారణకు ఆదేశం..
Land Titling Act
Follow us

|

Updated on: May 04, 2024 | 7:01 PM

అమరావతి, మే 4: సీఎం జగన్‎పై దుష్ప్రచారం చేస్తున్న టీడీపీపై చర్యలు తీసుకోవాలని ఈసీ, సీఐడీకి ఆదేశాలు జారీ చేసింది. సీఎం జగన్ భూములు లాక్కుంటారని అబద్ధాలు చెబుతున్నారంటూ వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డితో పాటు విజయవాడ సెంట్రల్ సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఈసీకి ఫిర్యాదు చేశారు. దీనిపై ఈసీ స్పందించన ఈసీ టీడీపీపై చర్యలు తీసుకునేందుకు ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్‎లో ఎన్నికల ప్రచారం రోజు రోజుకు పుంజుకుంటోంది. ఒక వైపు అధికార వైసీపీ తాను చేసిన సంక్షేమం, అభివృద్దిని చూసి ఓటు వేయమని చెబుతోంది. అలాగే ప్రతి పక్ష నేతపై కూడా పదునైన పదజాలం ఉపయోగించకుండా తన 14 ఏళ్ల పాలనలో ఎప్పుడైనా ఇలాంటి హామీలు అమలు చేశారా అని ప్రశ్నిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు సీఎం జగన్. అయితే టీడీపీ కూడా ఇంతే ధీటుగా ప్రచారాన్ని నిర్వహిస్తోంది. సీఎం జగన్ మేనిఫెస్టో మొత్తం మోసం అని చెబుతున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు.

వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో పేదల భూములు లాక్కుంటారని విష ప్రచారం చేస్తున్నారని.. ఐవీఆర్ ఎస్ కాల్స్ ద్వారా త‌ప్పుడు ప్రచారం చేస్తున్నార‌ని ఈసీకి ఫిర్యాదు చేశారు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్‎తో తయారు చేసి అన్ని రాష్ట్రాలకు పంపిందని, దేశంలోఉన్న భూ విబేధాలు తగ్గించాలని కేంద్రం నిర్ణయించిందని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ ముందు భూ సర్వే జరపాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు కూడా ఈ ఫిర్యాదులో పొందుపరిచారు. సరిహద్దు తగాదాలు వల్ల ఇబ్బందులు వస్తున్నాయని వాటిని పరిష్కరించేందుకు కేంద్ర ఈ కొత్త చట్టాన్ని తీసుకొచ్చినట్లు తెలిపారు. డిజిటలైజేషన్ పద్ధతిలో రికార్డులు కూడా ఇచ్చారు. సమగ్ర భూ సర్వే పూర్తి అయిన తర్వాత మాత్రమే ఇంప్లిమెంట్ చేస్తాం అని ప్రభుత్వం చెబుతోందని వెల్లడించారు. కానీ ప్రతిపక్షాలు ఇవన్నీ పట్టనట్లు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‎పై చేస్తున్న విష ప్రచారాన్ని ఆధారాల‌తో స‌హా ఈసీకి ఫిర్యాదు చేశారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నిక‌ల కోడ్‎కు విరుద్దంగా టీడీపీ ప్రచారం చేస్తున్నట్లు గుర్తించిన ఈసీ.. వైసీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుపై చ‌ర్యలు తీసుకోవాల్సిందిగా సీఐడీకి ఆదేశాలు జారీ చేశారు అడిష‌న‌ల్ సీఈవో హ‌రేంధిర ప్రసాద్.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..