Andhra Pradesh: ఆగిపోయిన ఆసరా, చేయూత, విద్యాదీవెన, సబ్సిడీలు.. బటన్ నొక్కనివ్వకుండా అడ్డు పడుతోంది ఎవరు?

బాబే అడ్డం. చంద్రబాబే అడ్డం. అంతా బాబే చేశారు. చంద్రబాబే చేశారు. జగన్‌ నేరుగా బటన్‌ నొక్కి సంక్షేమ పథకాల నిధులను ప్రజల ఖాతాల్లోకి వేయకుండా చంద్రబాబు అడ్డుకున్నారు. DBTకి ఈసీ బ్రేకులు వేయడం వెనుక చంద్రబాబే ఉన్నారు. అవ్వా తాతలు, అక్కచెల్లెమ్మలు, విద్యార్థులు, రైతులు వేయికళ్లతో ఎదురు చూస్తుంటే...వాళ్లకు జగన్‌ నిధులు వేయకుండా అడ్డుపడింది చంద్రబాబే అంటోంది ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైసీపీ.

Andhra Pradesh: ఆగిపోయిన ఆసరా, చేయూత, విద్యాదీవెన, సబ్సిడీలు.. బటన్ నొక్కనివ్వకుండా అడ్డు పడుతోంది ఎవరు?
Ap Cm Ys Jagan Mohan Reddy
Follow us

|

Updated on: May 04, 2024 | 9:47 AM

బాబే అడ్డం. చంద్రబాబే అడ్డం. అంతా బాబే చేశారు. చంద్రబాబే చేశారు. జగన్‌ నేరుగా బటన్‌ నొక్కి సంక్షేమ పథకాల నిధులను ప్రజల ఖాతాల్లోకి వేయకుండా చంద్రబాబు అడ్డుకున్నారు. DBTకి ఈసీ బ్రేకులు వేయడం వెనుక చంద్రబాబే ఉన్నారు. అవ్వా తాతలు, అక్కచెల్లెమ్మలు, విద్యార్థులు, రైతులు వేయికళ్లతో ఎదురు చూస్తుంటే…వాళ్లకు జగన్‌ నిధులు వేయకుండా అడ్డుపడింది చంద్రబాబే అంటోంది ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైసీపీ. జగన్‌ బటన్‌ నొక్కకుండా అడ్డుపడుతోంది చంద్రబాబు అనేది వైసీపీ చెబుతున్న మాట.

వాళ్లకు ఒకటో తారీఖు జీతం రాదు. అయినా బతుకు మీద భరోసా ఆగదు. ఎందుకంటే ఆసరా, చేయూత, ఇంకా వివిధ పథకాల పేరుతో…జగన్‌ వేసే నిధులతో అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, విద్యార్థులు, రైతుల కష్టాలు తీరుతున్నాయి. అయితే ఇప్పుడు ఆసరా పథకం కింద వచ్చే నిధులు ఆగిపోయి పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలు ఇబ్బందులు పడుతున్నారు. చేయూత పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు, ఓసీల్లోని మహిళలకు ఏటా అందించే రూ. 18,750 రూపాయల ఆర్థిక సాయం అర్ధంతరంగా ఆగిపోయింది. ఇక విద్యా దీవెన నిధులు రాక, కాలేజీ ఫీజులు కట్టలేక విద్యార్థులు, వాళ్ల పేరెంట్స్‌ అల్లాడిపోతున్నారు. జగన్‌ సర్కార్‌…ఏటా రెండుసార్లు అందించే ఇన్‌పుట్‌ సబ్సిడీ కోసం రైతన్నలు ఆశగా ఎదురు చూస్తున్నారు.

అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, రైతులు, విద్యార్థులు ఆశగా ఎదురు చూస్తున్నా ఈ నిధులేవి రావట్లేదు. జగన్‌ సర్కార్‌ వీటికోసం నిధులు రెడీగా ఉంచింది. DBT ద్వారా లబ్ధిదారుల అకౌంట్లలో వేయడానికి సిద్ధం అంటోంది. అయితే ఈసీ మాత్రం కోడ్‌ పేరుతో వీటన్నింటికి బ్రేకులు వేసింది. DBT నిధులు పేదల అకౌంట్లలో పడడానికి కోడ్‌ అడ్డం అంటోంది ఈసీ. అయితే ఈసీ కాదు…చంద్రబాబే అడ్డం అంటోంది వైసీపీ. లబ్ధిదారుల అకౌంట్లలో నిధులు పడకుండా చంద్రబాబు అడ్డుకుంటున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. ఈసీ మీద ఒత్తిడి తెచ్చి, పేదలకు నష్టం చేస్తోంది చంద్రబాబే అంటోంది వైసీపీ. నిధుల విడుదలను చంద్రబాబు అడ్డుకోవడం వల్లే మహిళలు, రైతులు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారంటోంది అధికార పక్షం.

జగన్‌ అందించే సాయం ఆగిపోయింది. కష్టాలు బాధల గాయం సలుపుతోంది. మరి DBT నిధులు అందేదెలా? లబ్ధిదారులకు నిధులు అందించడానికి ఈసీకి విజ్ఞప్తులు చేస్తూనే ఉంది వైసీపీ. జస్ట్‌ బటన్‌ నొక్కితే చాలు…లక్షలాదిమంది లబ్ధిదారుల అకౌంట్లలోకి నిధుల వరద పారుతుంది. వైఎస్సార్ ఆసరా, చేయూత, విద్యా దీవెన, ఇన్‌పుట్‌ సబ్సిడీలు అందుతాయి. కానీ చంద్రబాబు బటన్‌ నొక్కనివ్వడం లేదు. ఈసీని అడ్డం పెట్టుకుని పేదల గొంతును చంద్రబాబు నొక్కుతున్నారని మండిపడుతోంది వైసీపీ. జమ చేసిన నిధులు కూడా విడుదల కాకుండా పెండింగ్‌లో పెట్టడం దారుణం అంటూ వాపోతోంది. జగన్‌ ఇప్పటికే విడుదల చేసిన నిధులు కూడా లబ్ధిదారులకు చేరకుండా ఆగిపోయాయి. కాదు కాదు చంద్రబాబు ఆపేశారు. పేదల నోటి కాడి ముద్దను లాక్కుంటారా అంటూ చంద్రబాబుపై వైసీపీ మండిపడుతోంది.

రెండు నెలల నుంచి DBT నిధుల విడుదల పెండింగ్‌లో పడింది. చివరిదశ చెల్లింపుల కోసం ఈసీని అనుమతి కోరింది జగన్‌ సర్కార్‌. ఇప్పటికే రెండుమూడు సార్లు లేఖలు కూడా రాసింది. ఐదేళ్లుగా కొనసాగుతున్న పథకాలకు కోడ్ అడ్డురాదని వైసీపీ చెబుతోంది. అయితే పర్మిషన్‌ రాకుండా ఈసీపై టీడీపీ ఒత్తిడి చేస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది. పెన్షన్ల తరహాలోనే ఇతర పథకాలనూ చంద్రబాబు అడ్డుకుంటున్నారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. బీజేపీతో పొత్తు తర్వాత పర్మిషన్ల విషయంలో పరిస్థితులు మారాయంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే DBT నిధుల విడుదలపై ఈసీ స్పష్టత ఇవ్వడం లేదు. దీనంతటికి చంద్రబాబే కారణం అంటున్నారు వైఎస్‌ భారతి. మీరు పేదల మీద కక్ష కట్టారు. మహిళల మీద పగ తీర్చుకుంటున్నారు. ఈసీని అడ్డం పెట్టుకుని ఇలా చేసి…. కక్ష తీర్చుకుంటున్నారంటూ చంద్రబాబు మీద వైసీపీ నేత వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు.

DBT నిధులు ఆగిపోయి పేదవాడికి ఎంత కష్టం…ఎంత నష్టం. మహిళలకు ఎన్ని ఇబ్బందులు. విద్యార్థులకు, రైతులకు ఎన్ని సమస్యలు వచ్చిపడ్డాయి. వీటన్నింటికి చంద్రబాబే కారణం అంటోంది వైసీపీ.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Latest Articles
ఇంట్లో గుట్టలుగా నోట్ల కట్టలు.. ఆ మంత్రిపై ఈడీ సంచలన ఆరోపణలు..
ఇంట్లో గుట్టలుగా నోట్ల కట్టలు.. ఆ మంత్రిపై ఈడీ సంచలన ఆరోపణలు..
బంగారం ప్రియులకు కాస్త ఊరట.. తులం బంగారం ఎంతో తెలుసా.?
బంగారం ప్రియులకు కాస్త ఊరట.. తులం బంగారం ఎంతో తెలుసా.?
మెడికల్ షాపులు, క్లినిక్‎లపై అధికారుల కొరడా.. డ్రగ్స్ రాకెట్‎పై..
మెడికల్ షాపులు, క్లినిక్‎లపై అధికారుల కొరడా.. డ్రగ్స్ రాకెట్‎పై..
Horoscope Today: డబ్బు వ్యవహారాల్లో ఆ రాశి వారు జాగ్రత్త..
Horoscope Today: డబ్బు వ్యవహారాల్లో ఆ రాశి వారు జాగ్రత్త..
రోహిత్, నమన్‌ల పోరాటం వృథా.. లక్నో చేతిలో ముంబైకు తప్పని ఓటమి
రోహిత్, నమన్‌ల పోరాటం వృథా.. లక్నో చేతిలో ముంబైకు తప్పని ఓటమి
'పవిత్ర నన్ను పిలుస్తోంది'.. 'త్రినయని' సీరియల్ నటుడు చందు సూసైడ్
'పవిత్ర నన్ను పిలుస్తోంది'.. 'త్రినయని' సీరియల్ నటుడు చందు సూసైడ్
'మీ ప్రేమాభిమానాలకు కృతజ్ఞుడిని' .. ముంబై పర్యటనపై మోడీ ట్వీట్
'మీ ప్రేమాభిమానాలకు కృతజ్ఞుడిని' .. ముంబై పర్యటనపై మోడీ ట్వీట్
చామదుంపలో ఉండే ఈ గుణం గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది..!
చామదుంపలో ఉండే ఈ గుణం గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది..!
నికోలస్ పూరన్ విధ్వంసకర బ్యాటింగ్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
నికోలస్ పూరన్ విధ్వంసకర బ్యాటింగ్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
పుష్పరాజ్‌ కోసం వెయిట్‌ చేస్తున్నసెలబ్రిటీలు.!
పుష్పరాజ్‌ కోసం వెయిట్‌ చేస్తున్నసెలబ్రిటీలు.!