AP News: పైకి చూస్తే అదొక ఏటీఎం వ్యాన్.. తీరా లోపలున్న పార్శిళ్లు తెరిచి చూడగా దిమ్మతిరిగింది.!

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి జోరుగా కొనసాగుతోంది. ఈ తరుణంలో సరైన బిల్లులు లేకుండా బంగారం, వెండి, నగదును అక్రమంగా తరలిస్తుంటే.. ఎస్ఓటీ అధికారులు వాటిని సీజ్ చేస్తున్నట్టు ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. ఈ కోవలోనే ఏపీలోని.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..

AP News: పైకి చూస్తే అదొక ఏటీఎం వ్యాన్.. తీరా లోపలున్న పార్శిళ్లు తెరిచి చూడగా దిమ్మతిరిగింది.!

|

Updated on: May 04, 2024 | 1:00 PM

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి జోరుగా కొనసాగుతోంది. ఈ తరుణంలో సరైన బిల్లులు లేకుండా బంగారం, వెండి, నగదును అక్రమంగా తరలిస్తుంటే.. ఎస్ఓటీ అధికారులు వాటిని సీజ్ చేస్తున్నట్టు ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. ఈ కోవలోనే ఏపీలోని పిఠాపురంలో సుమారు రూ. 17 కోట్ల విలువైన బంగారం, వెండి వస్తువులను గొల్లప్రోలు టోల్ ప్లాజా వద్ద అధికారులు తాజాగా పట్టుకున్నారు. వాటికి సరైన ఆధారాలు లేకపోవడంతో సీజ్ చేసి కాకినాడలోని జిల్లా ఖజానా కార్యాలయానికి తరలించారు. పట్టుబడిన వాహనం విశాఖపట్నం నుంచి కాకినాడ వెళ్తున్నట్టు తెలుస్తోంది. సరైన డాక్యుమెంట్స్, తరలించే వ్యక్తుల పేర్లూ పత్రాలు నమోదు చేయకపోవడంతో వాహనాన్ని సీజ్ చేసి పిఠాపురం తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. కాగా, పిఠాపురం అసెంబ్లీ స్థానంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండటంతో.. అక్కడ ఏం జరిగినా సంచలనంగా మారుతోంది.

Follow us
Latest Articles