AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘చంద్రబాబుది ఊసరవెల్లి రాజకీయం’.. సింహపురి ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్..

నెల్లూరులో సీఎం జగన్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మరో 9 రోజుల్లో కురుక్షేత్రం యుద్దం జరగబోతోందన్నారు సీఎం జగన్. ఇవి పేదల భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు అన్నారు. తనకు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగిస్తానన్నారు. పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపే అన్నారు. చంద్రబాబును నమ్మడమంటే కొండచిలువ నోట్లో తలపెట్టడమే అని విమర్శించారు. విలువలు, విశ్వసనీయతకు మరోసారి ఓటేయడానికి సిద్ధమా అని ప్రజలను అడిగారు. చంద్రబాబు హయాంలో చెప్పుకోవడానికి ఒక్క పథకమైనా ఉందా అని ప్రశ్నించారు.

'చంద్రబాబుది ఊసరవెల్లి రాజకీయం'.. సింహపురి ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్..
Cm Jagan
Srikar T
|

Updated on: May 06, 2024 | 9:59 AM

Share

నెల్లూరులో సీఎం జగన్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మరో 9 రోజుల్లో కురుక్షేత్రం యుద్దం జరగబోతోందన్నారు సీఎం జగన్. ఇవి పేదల భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు అన్నారు. తనకు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగిస్తానన్నారు. పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపే అన్నారు. చంద్రబాబును నమ్మడమంటే కొండచిలువ నోట్లో తలపెట్టడమే అని విమర్శించారు. విలువలు, విశ్వసనీయతకు మరోసారి ఓటేయడానికి సిద్ధమా అని ప్రజలను అడిగారు. చంద్రబాబు హయాంలో చెప్పుకోవడానికి ఒక్క పథకమైనా ఉందా అని ప్రశ్నించారు. చంద్రబాబు పేరు చెబితే ఒక్క మంచి పని గుర్తొస్తుందా అని ప్రచారంలో కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబుది ఊసరవెల్లి రాజకీయమని సెటైర్లు వేశారు. ముస్లీం రిజర్వేషన్లు రద్దు చేస్తామన్న పార్టీతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారని చెప్పారు. తాము ముస్లీంలకు మతప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వలేదని చెప్పారు. పేదరికం, వెనుకబాటు తనం అధారంగానే 4శాతం రిజర్వేషన్లు కల్పించినట్లు చెప్పారు.NRC, CAA అంశాల్లో కూడా ముస్లీం సామాజిక వర్గానికి మద్దతుగా నిలిచామన్నారు.

చంద్రబాబు ఓ వైపు ఎన్డీయేలో కొనసాగుతూ ముస్లీంలపైన ప్రేమ కురిపిస్తున్నారని విమర్శించారు. ఆరు నూరైనా ముస్లీంలకు రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందే అన్నారు సీఎం జగన్. తాము అధికారంలోకి వస్తే వాటిని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. చంద్రబాబు హామీలను బీజేపీ నమ్మడం లేదని, అందుకే మేనిఫెస్టోలో వెనుకకు తగ్గిందన్నారు. గతంలో ఎన్నడూ చూడని విధంగా ఆసరా, వైఎస్సార్‌ చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, ఇళ్ల పట్టాలు.. అవ్వాతాతలకు ఇంటికే పెన్షన్‌ కానుక, రైతు భరోసా, ఉచిత బీమా, ఇన్‌ఫుట్‌ సబ్సిడీ, పగటి పూట 9గం. ఉచిత కరెంట్‌.. ఇవన్నీ గతంలో ఎప్పుడైనా జరిగాయా? అని అడిగారు. వాహన మిత్ర, నేతన్నలకు నేస్తం, చేదోడు, లాయర్లకు లా నేస్తం, ఫ్యామిలీ క్లినిక్‌, విలేజ్‌ డాక్టర్‌, ఇంటికే సురక్ష, వలంటీర్‌ వ్యవస్థ, ఆర్బీకే, విలేజ్‌ క్లినిక్‌, మహిళా పోలీస్ ఇలాంటి ఎప్పుడైనా చూశారా అన్నారు. కేవలం 59 నెలల పాలనలో ఇచ్చిన హామీలన్నీ 99 శాతం అమలు చేసి ఎన్నికల ప్రచారంలో మరోసారి ఆశీర్వదించమని కోరుతున్నానన్నారు. తన పాలనలో సంక్షేమ పథకం ద్వారా ఏ కుటుంబానికైనా లబ్ధి చేకూరింటే తిరిగి మరోసారి ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకోమని విజ్ఙప్తి చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..