AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YS Bharati: పులివెందుల జోరుగా ప్రచారం.. గడప గడపకు వెళ్తున్న జగన్ సతీమణి వైఎస్ భారతి

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ పొలిటికల్ పార్టీలు దూకుడు పెంచాయి. అన్ని పార్టీల నేతలు సుడిగాలి పర్యటనలతో జనాన్ని ఆకర్షిస్తున్నారు. నేతలకు తోడు వారి కుటుంబసభ్యులు సైతం మండుటెండలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే పులివెందులలో జోరుగా ప్రచారం చేస్తున్నారు ఏపీ సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతి.

YS Bharati: పులివెందుల జోరుగా ప్రచారం.. గడప గడపకు వెళ్తున్న జగన్ సతీమణి వైఎస్ భారతి
Ys Bharathi Reddy
Balaraju Goud
|

Updated on: May 04, 2024 | 11:54 AM

Share

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ పొలిటికల్ పార్టీలు దూకుడు పెంచాయి. అన్ని పార్టీల నేతలు సుడిగాలి పర్యటనలతో జనాన్ని ఆకర్షిస్తున్నారు. నేతలకు తోడు వారి కుటుంబసభ్యులు సైతం మండుటెండలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే పులివెందులలో జోరుగా ప్రచారం చేస్తున్నారు ఏపీ సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతి. ఆమె ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తుంది. ఇంటింటికీ వెళ్తూ ప్రతి ఒక్కరినీ ఆత్మీయంగా పలకరిస్తూ ముందుకెళ్తున్నారు.

ప్రచారంలో భాగంగా పులివెందులలోని ఇస్లాంపురం వీధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్తూ ప్రతి ఒక్కరినీ ఆత్మీయంగా పలకరిస్తూ ముందుకెళ్తున్నారు. ఫ్యాన్‌ గుర్తుకు రెండు ఓట్లు వేసి పులివెందుల అసెంబ్లీ అభ్యర్థిగా వైఎస్‌ జగన్‌ను, కడప ఎంపీ అభ్యర్థిగా అవినాష్‌ రెడ్డిని గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. గ్రామంలో గడపగడపకు వెళ్లి ప్రచారం చేశారు. ప్రజల సమస్యలను వింటూ ప్రచారం నిర్వహించారు వైఎస్‌ భారతి.

ఎన్నికల ప్రచారంలో వైఎస్‌ భారతిరెడ్డికి ఘనస్వాగతం పలికుతున్నారు గ్రామస్తులు. అయా గ్రామంలోని సమస్యలను భారతి దృష్టికి తీసుకెళ్లారు. కొందరు వ్యక్తిగత సమస్యల్ని భారతికి చెప్పుకున్నారు. ప్రజల సమస్యలను వింటూ… గ్రామంలో ప్రచారం నిర్వహించారు వైఎస్‌ భారతి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…