Guntur: ఓరి వీడి పాడుగాను.. చప్పుడు కాకుండా ప్రభుత్వ ఆస్పత్రిలోకి వచ్చి…
గవర్నమెంట్ ఆస్పత్రికి వెళ్లేదే పేదలు. అక్కడ తిని, తినక వైద్యం చేయించుకుంటూ ఏదో మూలన పడుకుంటూ నానా బాధలు పడుతూ ఉంటారు. అలాంటివారిని కూడా వదిలిపెట్టడం లేదు కేటుగాళ్లు. తాజాగా గుంటూరు పెద్ద ఆసుపత్రిలో ఓ ఘటన జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి....
ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చేదే పేదలు. ఆ పేదల ఫోన్లను చప్పుడు కాకుండా లేపేస్తున్నారు దొంగలు. ఫోన్లే కాదు.. డబ్బు, వస్తువులు ఏవి కనిపించినా ఇంతే సంగతి. ఈ వీడియో చూడండి. అందరూ పడుకుని ఉన్నప్పుడు వచ్చి.. పడుకున్న వ్యక్తి పక్కన కూర్చుని.. సైలెంట్‌గా ఫోన్ లేపేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ తంతు నిత్యకృత్యంగా మారింది. పేషెంట్ల బంధువులు.. దొంగలతో తాళలేకపోతున్నారు. జిజిహెచ్‌లో వరుసగా సెల్ ఫోన్ చోరీలు జరగుతున్నాయి. 92 సీసీ కెమెరాలు ఉన్నా ఉపయోగం లేకుండా పోయింది. ఇప్పటికే ఆస్పత్రి సిబ్బంది సైతం ఫోన్లు పోగొట్టుకున్నారు. రోగి సహాయకులను అధిక సంఖ్యలో ఆసుపత్రి లోపలకి అనుమతించడం వల్లే సమస్యలు ఎదురువుతున్నాయని కొందరు చెబుతున్నారు. పేషెంట్ అటెండెంట్ పేరుతో లోపలికి వచ్చి.. ఆస్పత్రి లోపల దొంగలు తమ పని కానిచ్చేస్తున్నారు. దీంతో రోగి అటెండెంట్స్ కోసం ప్రత్యేక పాసులు ఇవ్వాలని బాధితులు కోరుతున్నారు. కట్టుదిట్టమైన చర్యలు తీసుకోకపోతే రోగుల మరిన్ని విలువైన వస్తువులు పోయే అవకాశం ఉందంటున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

