ల్యాండ్ టైటలింగ్‎పై టీడీపీ అసత్య ప్రచారం.. చంద్రబాబుకు సజ్జల రామకృష్ణా రెడ్డి కౌంటర్..

సజ్జల రామకృష్ణా రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి ల్యాండ్ టైటలింగ్‎పై టీడీపీ అసత్య ప్రచారం చేస్తోందన్నారు వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి. తాడేపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో టీడీపీ టీడీపీ ఆరోపణల్ని తిప్పి కొట్టారు. వ్యవస్థల మీద నమ్మకం పోయేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారన్నారు. ప్రభుత్వాధినేత భూములు మింగేస్తారు అని చెప్పడం దేనికి సంకేతం అని ప్రశ్నించారు. అధికారంలోకి రావాలి అనుకున్నప్పుడు చేయాల్సిన విమర్శలు ఇవేనా అని నిలదీశారు.14 ఏళ్లు సీఎంగా పని చేసిన వ్యక్తి మాట్లాడాల్సిన మాటలు ఇవేనా అని విమర్శించారు.

ల్యాండ్ టైటలింగ్‎పై టీడీపీ అసత్య ప్రచారం.. చంద్రబాబుకు సజ్జల రామకృష్ణా రెడ్డి కౌంటర్..
Sajjala Rama Krishna Reddy
Follow us

|

Updated on: May 04, 2024 | 7:32 PM

సజ్జల రామకృష్ణా రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి ల్యాండ్ టైటలింగ్‎పై టీడీపీ అసత్య ప్రచారం చేస్తోందన్నారు వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి. తాడేపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో టీడీపీ టీడీపీ ఆరోపణల్ని తిప్పి కొట్టారు. వ్యవస్థల మీద నమ్మకం పోయేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారన్నారు. ప్రభుత్వాధినేత భూములు మింగేస్తారు అని చెప్పడం దేనికి సంకేతం అని ప్రశ్నించారు. అధికారంలోకి రావాలి అనుకున్నప్పుడు చేయాల్సిన విమర్శలు ఇవేనా అని నిలదీశారు.14 ఏళ్లు సీఎంగా పని చేసిన వ్యక్తి మాట్లాడాల్సిన మాటలు ఇవేనా అని విమర్శించారు. అక్రమాలకు చెక్ పెట్టేందుకు ఈ చట్టం తెచ్చారని వివరించారు. ఇంకా గెజిట్ అవ్వలేదు.. చట్టం అమలు కాలేదు.. విధి విధానాలు ఖరారు చేయలేదు అప్పుడే అసత్య ప్రచారానికి తెరలేపినట్లు తెలిపారు. ఎన్నికల కోసం ఈ రకంగా ప్రచారం చేస్తారా అని నిలదీశారు. భూ అక్రమాలకు చెక్ పెట్టడమే ఈ చట్టం ఉద్దేశం అని స్పష్టం చేశారు. చట్టం తేవడం ఒక విప్లవాత్మక మార్పు అన్నారు. ల్యాండ్ గ్రాబింగ్ చేసింది టీడీపీ అని విమర్శించారు.

టీడీపీ ప్రభుత్వంలో వెబ్ ల్యాండ్ పేరుతో చంద్రబాబు భూముల అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. వెబ్ ల్యాండ్ పోర్టల్‎లో మార్పులు చేసి ఎంతో మంది భూములను ఇబ్బందులోకి నెట్టారన్నారు. CRDA పరిధిలోని భూములను డీమ్డ్ మ్యూటేషన్ పేరుతో చంద్రబాబు అక్రమాలకు పాల్పడ్డారన్నారు. అసైన్డ్ భూములను బలవంతంగా లాక్కున్నారన్నారు. అరాచకానికి అడ్డుకట్ట వేసేందుకు జగన్ అడుగులు వేస్తున్నారని తెలిపారు. భూములను లీజులకు తీసుకోవడం వాటిని కొల్లగొట్టడం చంద్రబాబుకు పరిపాటిగా మారిందని విమర్శించారు. 190 దేశాల్లో భూముల వివాదాలపై సర్వే చేస్తే మనం 154 స్థానంలో ఉన్నామన్నారు. కన్నాలు వేసే వాళ్ళకి ఇటువంటి చర్యలు నచ్చవని పేర్కొన్నారు. భూ సంస్కరణలు అమలు చేస్తుంటే చంద్రబాబు జీర్ణించుకోలేక పోతున్నారన్నారు. 6వేల గ్రామాల్లో భూముల రీ సర్వే పూర్తి అయ్యిందని తెలిపారు. రిజిస్ట్రేషన్ వ్యవస్థలో మార్పు తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తే దానికి అడ్డుపడుతున్నారని ధ్వజమెత్తారు.చంద్రబాబు హయాంలో స్టాంప్స్ కుంభకోణాలకు పాల్పడ్డారని ఆరోపించారు. పాస్ పుస్తకాలను డిజిటలైజ్ చేశామని.. పుస్తకాలపై సీఎం జగన్ మోహన్ రెడ్డి ఫోటో వస్తే మీకు వచ్చిన నష్టం ఎంటని ప్రశ్నించారు.రాష్ట్ర ప్రజలకు లేని సమస్య చంద్రబాబుకు మాత్రమే వచ్చిందా అని ప్రశ్నించారు సజ్జల రామకృష్ణా రెడ్డి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..