AP News: ఓట్ల లెక్కింపుకు పటిష్టమైన ఏర్పాట్లు.. ఈసీ కీలక ఆదేశాలు..

జూన్ 4న జరుగనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని అన్ని జిల్లాల ఎన్నికల రిటర్నింగ్ అధికారులను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పాటిస్తూ ఖచ్చితమైన ఫలితాలను త్వరితగిన ప్రకటించేలా అన్ని ముందస్తు ఏర్పాట్లు ప్రణాళికా బద్దంగా చేసుకోవాలని సూచించారు.

AP News: ఓట్ల లెక్కింపుకు పటిష్టమైన ఏర్పాట్లు.. ఈసీ కీలక ఆదేశాలు..
Cec Mukesh Kumar Meena
Follow us

| Edited By: Srikar T

Updated on: May 23, 2024 | 7:54 PM

జూన్ 4న జరుగనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని అన్ని జిల్లాల ఎన్నికల రిటర్నింగ్ అధికారులను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పాటిస్తూ ఖచ్చితమైన ఫలితాలను త్వరితగిన ప్రకటించేలా అన్ని ముందస్తు ఏర్పాట్లు ప్రణాళికా బద్దంగా చేసుకోవాలని సూచించారు. గురువారం రాష్ట్ర సచివాలయం నుండి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో ఆయన వీడియో కాన్ఫిరెన్స్ నిర్వహించారు. ఓట్ల లెక్కింపు కోసం చేస్తున్న ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. చెదురుమదురు సంఘటనలు మినహా అందరి సమీష్టి కృషితో మే 13న రాష్ట్రంలో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడం జరిగిందన్నారు. అదే స్పూర్తితో జూన్ 4న ఓట్ల లెక్కింపు ప్రక్రియ కూడా విజయవంతంగా నిర్వహించాలని కోరారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లను ముందుగానే చేసుకోవాలన్నారు. ఓట్ల లెక్కింపులో ఎటు వంటి వివాదాలకు తావులేకుండా సంబంధిత వివరాలను అందించాలన్నారు. పాత్రికేయులకు ప్రత్యేకంగా మీడియా సెంటర్లను ఏర్పాటు చేయాలన్నారు.

స్ట్రాంగ్ రూమ్‌ల నుంచి ఓట్ల లెక్కింపు కేంద్రాలకు ఈవీఎంలను తరలించే మార్గాలను వేరుగా.. అభ్యర్థులు, ఏజంట్లు వెళ్లడానికి మరో మార్గాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. ఎలాంటి సమస్యలు రాకుండా ఉండటానికి బారికేడ్లతో పాటు సూచికల బోర్డ్‎లను కూడా ఏర్పాటు చేసుకోవాలన్నారు. లెక్కింపు కేంద్రంలో పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు వేరు వేరుగా పోలింగ్ కేంద్రాల సంఖ్యను ఏర్పాటు చేయాలన్నారు. పోస్టల్ బ్యాలెట్‎ల లెక్కింపునకు ప్రత్యేక టేబుళ్లును ఏర్పాటు చేయాలని తెలిపారు. ముందుగా పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు చేపట్టాలని, ఆ తరువాత ఈవీఎంల వారీగా పోల్ అయిన ఓట్లను లెక్కించాలన్నారు.

ఓట్ల లెక్కింపుకు సుశిక్షితులైన సిబ్బందిని నియమించుకోవాలని, వారికి అవసరమైన శిక్షణ కార్యక్రమాలను ముందుగానే నిర్వహించాలన్నారు. అదే విధంగా హై స్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యంతో అవసరమైన కంప్యూటర్లు, ప్రింటర్స్‎ను కౌంటింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఎన్కోర్‎లో ఎప్పటికప్పుడు డాటా ఎంట్రీకి సుశిక్షితులైన సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలన్నారు. కౌంటింగ్ అధికారులు, సిబ్బంది వాహనాల పార్కింగ్‎కు ప్రత్యేక స్థలాలను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. కౌంటింగ్ అధికారులు, సిబ్బంది మొబైల్ ఫోన్స్ డిపాజిట్ కోసం ప్రత్యేకంగా కౌంటర్లను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. గుర్తింపు కార్డులు లేని వ్యక్తులను, అనధికార వ్యక్తులను, ఇతరుల వాహనాలను ఎట్టి పరిస్థితుల్లో ఓట్ల లెక్కింపు జరిగే ప్రాంగణాల్లోకి అనుమతికుంచకుండా పటిష్టమైన పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేసుకోవాలన్నారు.

ఇవి కూడా చదవండి

ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూముల వద్ద కేంద్ర, రాష్ట్ర పోలీసు బలగాలతో పటిష్టమైన మూడు అంచెల భద్రత కొనసాగుతున్నదని, అయితే స్ట్రాంగ్ రూమ్‌లకు సీలు వేసిన తలుపులు, సెక్యూరిటీ కారిడార్లను కవర్‌ చేసేలా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును, కంట్రోల్‌ రూమ్‌కు అనుసంధానం చేసిన సీసీ కెమెరాల పనితీరును నిరంతరం అధికారులు పర్యవేక్షిస్తుండాలన్నారు. భద్రత పర్యవేక్షణపై పోలీసు అధికారులు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
చల్లచల్లని ఐస్‌క్రీమ్‌.. చిల్‌ అవుతూ లాగించేస్తున్నారా..
చల్లచల్లని ఐస్‌క్రీమ్‌.. చిల్‌ అవుతూ లాగించేస్తున్నారా..
ప్రపంచ స్కేటింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో మెరిసిన తెలుగు తేజం
ప్రపంచ స్కేటింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో మెరిసిన తెలుగు తేజం
ఓటీటీలోకి వచ్చేసిన ఇలియానా బోల్డ్ రొమాంటిక్ మూవీ..
ఓటీటీలోకి వచ్చేసిన ఇలియానా బోల్డ్ రొమాంటిక్ మూవీ..
రిజర్వేషన్‌ చేసుకున్న సీటులో వేరేవాళ్లు కూర్చున్నారా? ఇలా చేయండి
రిజర్వేషన్‌ చేసుకున్న సీటులో వేరేవాళ్లు కూర్చున్నారా? ఇలా చేయండి
హైదరాబాద్‌లో ధార్ గ్యాంగ్ దోపిడీ.! అప్రమత్తంగా ఉండాలని పోలీసులు..
హైదరాబాద్‌లో ధార్ గ్యాంగ్ దోపిడీ.! అప్రమత్తంగా ఉండాలని పోలీసులు..
ఎడ్యుకేషన్ లోన్ లేకుండానే విదేశాల్లో చదువుకోవచ్చు.. ఇది చదవండి..
ఎడ్యుకేషన్ లోన్ లేకుండానే విదేశాల్లో చదువుకోవచ్చు.. ఇది చదవండి..
ఏంటి.. ఈమె మన సమంతా నేనా.? ఇంతలా మారిపోయింది! రీఎంట్రీ లేనట్టేనా?
ఏంటి.. ఈమె మన సమంతా నేనా.? ఇంతలా మారిపోయింది! రీఎంట్రీ లేనట్టేనా?
భారీగా పెరిగిన కూరగాయల ధరలు.. అల్లాడుతున్న సామాన్య ప్రజలు..
భారీగా పెరిగిన కూరగాయల ధరలు.. అల్లాడుతున్న సామాన్య ప్రజలు..
వంటింట్లో వస్తువుల విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా..?
వంటింట్లో వస్తువుల విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా..?
గ్రూప్ ఆఫ్ డెత్‌లో డేంజరస్ జట్లు.. హోరాహోరీకి సిద్ధమైన 4 జట్లు
గ్రూప్ ఆఫ్ డెత్‌లో డేంజరస్ జట్లు.. హోరాహోరీకి సిద్ధమైన 4 జట్లు
హైదరాబాద్‌లో ధార్ గ్యాంగ్ దోపిడీ.! అప్రమత్తంగా ఉండాలని పోలీసులు..
హైదరాబాద్‌లో ధార్ గ్యాంగ్ దోపిడీ.! అప్రమత్తంగా ఉండాలని పోలీసులు..
జొమాటో డెలివరీ పార్ట్‌నర్స్‌ సీపీఆర్‌ కూడా చేస్తారు.!
జొమాటో డెలివరీ పార్ట్‌నర్స్‌ సీపీఆర్‌ కూడా చేస్తారు.!
ఇండియాలో యూఎస్‌ స్టూడెంట్ వీసా ప్రక్రియ ప్రారంభం.!
ఇండియాలో యూఎస్‌ స్టూడెంట్ వీసా ప్రక్రియ ప్రారంభం.!
ఏనుగుపై కేసు నమోదు.. ఏం చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
ఏనుగుపై కేసు నమోదు.. ఏం చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
మనుషుల మధ్యే గ్రహాంతరవాసులు.. హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధన.
మనుషుల మధ్యే గ్రహాంతరవాసులు.. హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధన.
రగులుతోంది మొగలి పొద.. నడి వీధిలో నాగుపాముల సయ్యాట.
రగులుతోంది మొగలి పొద.. నడి వీధిలో నాగుపాముల సయ్యాట.
వీళ్లద్దరి సింక్ బాగుందబ్బా.! | జనసేనానికి వదినమ్మ స్పెషల్ గిఫ్ట్
వీళ్లద్దరి సింక్ బాగుందబ్బా.! | జనసేనానికి వదినమ్మ స్పెషల్ గిఫ్ట్
నామినేటెడ్ పోస్టులపై టీడీపీ ముఖ్యనేతలతో సీఎం చంద్రబాబు సమావేశం..
నామినేటెడ్ పోస్టులపై టీడీపీ ముఖ్యనేతలతో సీఎం చంద్రబాబు సమావేశం..
కువైట్ మృతుల కుటుంబాలకు 7 లక్షల సాయం.. మృతుల్లో ముగ్గురు ఆంధ్రులు
కువైట్ మృతుల కుటుంబాలకు 7 లక్షల సాయం.. మృతుల్లో ముగ్గురు ఆంధ్రులు
పిఠాపురానికి అప్పుడే వెళతా.! కానీ.. ఒక షరతు.. : పవన్ కళ్యాణ్.
పిఠాపురానికి అప్పుడే వెళతా.! కానీ.. ఒక షరతు.. : పవన్ కళ్యాణ్.