Viverra (Punugu Pilli): అంతరించిపోతున్న జీవరాశుల్లో ఇదొకటి.. తిరుమల శ్రీవారికి అదే ఎందుకు అంత ప్రత్యేకం..!
అంతరించి పోతున్న జీవరాశులు.. అక్కడక్కడ కనిపిస్తూ కనువిందు చేస్తున్నాయి. తాజాగా శ్రీశైలం దేవస్థానంలో స్వామివారి, అమ్మవారి ఉచిత దర్శనానికి వెళ్లే క్యూలైన్ లో భక్తులకు పునుగు పిల్లి కనిపించింది. ఈ విషయాన్ని ఆలయ సిబ్బందికి తెలియజేశారు. అక్కడి చేరుకున్న సిబ్బంది పునుగు పిల్లిని అక్కడి నుంచి తరలించారు.
అంతరించి పోతున్న జీవరాశులు.. అక్కడక్కడ కనిపిస్తూ కనువిందు చేస్తున్నాయి. తాజాగా శ్రీశైలం దేవస్థానంలో స్వామివారి, అమ్మవారి ఉచిత దర్శనానికి వెళ్లే క్యూలైన్ లో భక్తులకు పునుగు పిల్లి కనిపించింది. ఈ విషయాన్ని ఆలయ సిబ్బందికి తెలియజేశారు. అక్కడి చేరుకున్న సిబ్బంది పునుగు పిల్లిని అక్కడి నుంచి తరలించారు. అయితే అరుదుగా కనిపించే పునుగు పిల్లిని తమ సెల్‌ఫోన్లతో చిత్రీకరించారు. అయితే కొద్దిసేపటి తర్వాత అది అక్కడి నుంచి వెళ్లిపోయింది. కాగా, క్యూలైన్ ఏర్పాటుకు ముందు గతంలో ఈ ప్రాంతంలో ఎక్కువగా పునుగు పిల్లుల సంచరిస్తుండేవని స్థానికులు తెలిపారు. భక్తుల రద్దీ పెరుగుతుండడంతో క్యూలైన్లను అభివృద్ధి చేశారని, దీంతో పునుగు పిల్లుల జాడ కనుమరుగై పోతూవస్తుందన్నారు.
వివేరిడే జంతు కుటుంబానికి చెందిన పునుగు పిల్లుల్లో 38 జాతులు ఉన్నాయి. ఆసియా రకానికి చెందిన పునుగు పిల్లుల్లో ప్రత్యేక విశిష్టత దాగి ఉంది. దీని శరీరం నుంచి జవాది, పునుగు అనే సుగంధ ద్రవ్యం లభిస్తుంది. వీటిని పవిత్రంగా భావించి దైవారాధనకు వినియోగిస్తారు. పునుగు పిల్లులు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా తిరుపతి సమీపంలోని శేషాచలం అడవుల్లో కనిపిస్తాయి. ఈ పిల్లి నుంచి తీసే తైలాన్ని తిరుమల శ్రీవారి మూల విరాట్టుకు అభిషేకిస్తారు. ప్రతీ పది రోజులకు ఓసారి ఈ పునుగుపిల్లి చర్మంపై బుడిపెల లాంటివి ఏర్పడుతాయి. వాటి నుంచి సువాసన వెదజల్లే తైలం వస్తుంది. అలాగే ఒళ్లు నొప్పులను తగ్గించడంలో ఈ తైలం ఎంతగానో ఉపయోగపడుతుందని నమ్మకం. ఎన్నో ఉపయోగాలున్న ఈ తైలానికి ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ కూడా ఉంది.
వీడియో చూడండి…
తిరుమల శ్రీవారికి అభిషేక సేవకు వినియోగించే సుగంధ ద్రవ్యాలను అందించే జీవి ఈ పునుగుపిల్లి. ఇవి కూడా చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. ఈ పునుగు పిల్లులు అంతరించిపోతుడంటంతో.. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేకంగా పునుగు పిల్లులను సంరక్షిస్తోంది. తిరుమలలోని గోశాలలో పెంచుతున్న సంగతి తెలిసిందే. ఈ పునుగు పిల్లి వన్యప్రాణి కాబట్టి.. గోశాలలో బంధించి పెంచడం తప్పని గతంలో అభ్యంతరాలు కూడా వచ్చాయి. 1972 వన్యప్రాణి సంరక్షణ చట్టంలోని క్లాజు ప్రకారం.. కానీ దైవ కార్యక్రమాలకు వన్యప్రాణుల సేవలను వినియోగించుకోవచ్చని ఉంది. ఈ చట్టం ప్రకారమే టీటీడీ పునుగు పిల్లులను పెంచుతోంది. ఈ పునుగు పిల్లి అంతరించిపోతున్న జీవ జాతుల్లో ఒకటి కావడంతో చాలా అరుదైన జంతువుగా భావిస్తారు. ఈ పునుగు పిల్లిని ఇంగ్లిష్‌లో సివెట్, టాడీ క్యాట్ అని పిలుస్తారు. పునుగుపిల్లి భారత్‌తో పాటూ సింగపూర్, మయన్మార్, భూటాన్, శ్రీలంకలలో మాత్రమే ఉంటుందట.
వేల ఏళ్ల క్రితం సాలిగ్రామ విగ్రహంగా కొలువైన వేంకటేశ్వర స్వామి వారు.. ఇప్పటికీ అంతటి దివ్య తేజస్సుతో ప్రకాశించడానికి కారణం పునుగుపిల్లి తైలమే. ప్రతి శుక్రవారం అభిషేకం తర్వాత.. తల నుంచి పాదాల దాకా పునుగుపిల్లి తైలం పులుముతారు. అనాదిగా కొనసాగుతోందీ ఆచారం. పునుగు పిల్లి తైలం వల్ల స్వామి వారి విగ్రహానికి పగుళ్లు రాకపోవడమే కాదు, ప్రకాశమూ తగ్గకుండా ఉంటోందట.
అంతటి విశిష్టమైన పునుగు పిల్లులు శేషాచల అడవుల్లో మాత్రమే ఉన్నాయి. అవి కూడా వేళ్లపై లెక్కించదగ్గ అతి తక్కువ సంఖ్యలో మాత్రమే. అందుకే.. అంతరించిపోతున్న అరుదైన జీవుల జాబితాలో ఉంది పునుగుపిల్లి. ప్రస్తుతం శ్రీవెంకటేశ్వర జూ పార్కులో పునుగు పిల్లులను సంరక్షిస్తున్నారు. స్వామి వారి అభిషేకానికి వాడే పునుగు పిల్లి తైలాన్ని టీటీడీ నిల్వ చేసి ఉంచుతుంది. పునుగు పిల్లి శరీరం.. గంధపు చెక్కకు రాజుకోవడం వల్ల పునుగు తైలం వస్తుంది.
పునుగుపిల్లి నుంచి తైలం తీస్తారు..?
ఈ పునుగుపిల్లి శరీరం నుంచి తైలం తీయడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. పునుగు పిల్లిని ఇనుప జల్లెడలో బంధిస్తారు. దానికి సమీపంలోనే చందనపు కర్రను నిలబెడతారు. అయితే పునుగు పిల్లి ప్రతి పది రోజులకు ఒకసారి శరీర గ్రంథుల ద్వారా చెమటను విసర్జిస్తుందట. ఇదంతా పునుగు శరీరంపై కొద్దిగా అట్టలా పేరుకుపోతుంది. దీంతో పిల్లి తన శరీరాన్ని ఇనుప జల్లెడలో నిలబెట్టిన చందనపు కర్రకు రుద్దుతుంది. ఆ కర్రకు శరీరంపై చెమట ద్వారా వచ్చినదంతా బంకలా అంటుకుపోతోంది. దానని తీసి తైలంగా ఉపయోగిస్తుంటారు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…