Andhra Pradesh: ఈవీఎంల ధ్వంసంపై మాటలయుద్ధం.. టీడీపీ నేతల ఆగడాలు చూడండంటూ వైసీపీ వీడియో విడుదల..

పోలింగ్ రోజు పల్నాడుజిల్లా మాచర్లలో ఈవీఎంల ధ్వంసంపై వైసీపీ-టీడీపీ నేతల మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది.. పాల్వాయి గేట్‌లో MLA పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేశారనే దానిపై ఓ వైపు దర్యాప్తు కొనసాగుతుండగా... మరోవైపు పోలింగ్‌ బూత్‌లో టీడీపీ నేతల ఆగడాలు చూడండి అంటూ వైసీపీ కూడా వీడియోను రిలీజ్‌ చేయడంతో ఏపీలో రాజకీయాలు మరింత హీటెక్కించాయి.

Andhra Pradesh: ఈవీఎంల ధ్వంసంపై మాటలయుద్ధం.. టీడీపీ నేతల ఆగడాలు చూడండంటూ వైసీపీ వీడియో విడుదల..
Ap Politics
Follow us

|

Updated on: May 23, 2024 | 3:58 PM

పోలింగ్ రోజు పల్నాడుజిల్లా మాచర్లలో ఈవీఎంల ధ్వంసంపై వైసీపీ-టీడీపీ నేతల మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది.. పాల్వాయి గేట్‌లో MLA పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేశారనే దానిపై ఓ వైపు దర్యాప్తు కొనసాగుతుండగా… మరోవైపు పోలింగ్‌ బూత్‌లో టీడీపీ నేతల ఆగడాలు చూడండి అంటూ వైసీపీ కూడా వీడియోను రిలీజ్‌ చేయడంతో ఏపీలో రాజకీయాలు మరింత హీటెక్కించాయి. తుమ్మురుకోటలో టీడీపీ బీభత్సం చేసిన మొత్తం వీడియోలు విడుదల చేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. పోలింగ్‌ రోజు పాల్వాయి గేట్‌లో జరిగిన మొత్తం వీడియో ఫుటేజ్‌ను ఈసీ అధికారులు పరిశీలించాలని ట్వీట్‌ చేశారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి..

మరోవైపు ఎన్నికల పోలింగ్‌పై మంత్రి అంబటి రాంబాబు వేసిన పిటిషన్‌పై విచారణ ముగిసింది. పోలింగ్ రోజు ఫిర్యాదు చేసినా ఈసీ పట్టించుకోలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు అంబటి. పల్నాడు జిల్లా నార్నేపాడులోని 236, 237.. దమ్మలపాడులోని 253, 254 పొలింగ్ కేంద్రాల్లో టీడీపీ రిగ్గింగ్ చేసిందని ఆరోపించారు. వెబ్ క్యాస్టింగ్‌ పరిశీలించి రీ పొలింగ్‌కు ఆదేశించాలని అంబటి తరపున అడ్వకేట్ వాదనలు వినిపించారు. మరోవైపు ఎన్నికలు ముగియడంతో ఎలక్షన్ ట్రిబ్యునల్‌కి వెళ్లాలని ఈసీ వాదనలు వినిపించింది. న్యాయస్థానం ఎలాంటి ఆదేశాలు ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

వైసీపీ వీడుదల చేసిన వీడియో..

వీడియోను మేం విడుదల చేయలేదు..

ఇక.. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసానికి సంబంధించిన వీడియోపై సీఈవో మీనా సంచలన ప్రకటన చేశారు. ఆ వీడియో ఎలక్షన్ కమిషన్ నుంచి విడుదల కాలేదని క్లారిటీ ఇచ్చారు. అయితే వీడియో ఎలా బయటకు వెళ్లిందో దర్యాప్తు కొనసాగుతుందన్నారు. ఈ ఎపిసోడ్‌లో పాల్పాయిగేటు పీవో, ఏపీవోలను సస్పెండ్ చేశామన్నారు మీనా.

మాచర్లలో ఇప్పుడిప్పుడే పరిస్థితి అదుపులోకి వచ్చిందని.. ఈ సమయంలో టీడీపీ నేతలు అక్కడికి వెళ్లడం సరికాదన్నారు సీఈవో మీనా. ఒకవేళ టీడీపీ నేతలు అక్కడికి వెళ్తే మళ్లీ పరిస్థితి అదుపుతప్పే అవకాశం ఉందన్నారు. టీడీపీ నేతలు మాత్రమే కాదూ.. బయటి వ్యక్తులెవరూ పరామర్శకు మాచర్లకు వెళ్లొదన్నారు.

పిన్నెల్లి ఎప్పుడైనా లొంగిపోయే ఛాన్స్..

నర్సరావుపేట కోర్టులో ఏ క్షణమైనా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లొంగిపోయే ఛాన్స్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.. ఈమేరకు కోర్టు దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు.. కోర్టు పరిసర ప్రాంతాల్లోకి ఎవరూ రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కాగా.. పిన్నెల్లి కోసం ఇప్పటికే పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేసి వెతుకుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
ఆ స్టార్ హీరో సినిమాలో ప్రభాస్ గెస్ట్ రోల్ చేశాడా..? అప్పుడే..
ఆ స్టార్ హీరో సినిమాలో ప్రభాస్ గెస్ట్ రోల్ చేశాడా..? అప్పుడే..
శత్రువులను ఓడించడానికి చాణక్యుడి చెప్పిన విషయాలు పాటించి చూడండి..
శత్రువులను ఓడించడానికి చాణక్యుడి చెప్పిన విషయాలు పాటించి చూడండి..
తలపొగరోడు అందించిన క్యాచ్.. మిస్ చేసిన పంత్.. రోహిత్ కోపం చూశారా?
తలపొగరోడు అందించిన క్యాచ్.. మిస్ చేసిన పంత్.. రోహిత్ కోపం చూశారా?
ఎమ్మెల్యేలు, నేతలు చేజారకుండా బీఆర్ఎస్ పక్కా ఫ్లాన్..!
ఎమ్మెల్యేలు, నేతలు చేజారకుండా బీఆర్ఎస్ పక్కా ఫ్లాన్..!
బీర్‌ తాగితే కొలెస్ట్రాల్ మైనంలా కరిగిపోతుందట..!
బీర్‌ తాగితే కొలెస్ట్రాల్ మైనంలా కరిగిపోతుందట..!
కాంగ్రెస్ - బీఆర్ఎస్ నేతల చిచ్చు రాజేసిన బూడిద..!
కాంగ్రెస్ - బీఆర్ఎస్ నేతల చిచ్చు రాజేసిన బూడిద..!
బంగ్లాపై థ్రిల్లింగ్ విక్టరీ.. సెమీస్ చేరిన ఆఫ్గాన్..
బంగ్లాపై థ్రిల్లింగ్ విక్టరీ.. సెమీస్ చేరిన ఆఫ్గాన్..
రాజస్థాన్‌లో జలపాతాలు.. వర్షాకాలంలో వీటి అందాలు కనులకు విందు
రాజస్థాన్‌లో జలపాతాలు.. వర్షాకాలంలో వీటి అందాలు కనులకు విందు
ఏంటీ.. ఈ అమ్మాయి జై బోలే తెలంగాణ మూవీ హీరోయినా..? గుర్తుపట్టలేం బ
ఏంటీ.. ఈ అమ్మాయి జై బోలే తెలంగాణ మూవీ హీరోయినా..? గుర్తుపట్టలేం బ
నీళ్లలో ఈదుతూ నదిని దాటుతున్న ఏనుగుల గుంపు.. అద్భుతమైన దృశ్యం
నీళ్లలో ఈదుతూ నదిని దాటుతున్న ఏనుగుల గుంపు.. అద్భుతమైన దృశ్యం