AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: రేపటి భవిష్యత్తుకు వినూత్న ఆలోచన.. ఇదో వెరైటీ ఆహ్వాన పత్రిక.. ఎందుకో తెలుసా

ఆహ్వానం..! ఈ పేరు వినగానే మనకు ముందుగా గుర్తొచ్చేది శుభకార్యాలు. పెళ్లిళ్లు, ఓణీల వేడుకలు, పుట్టినరోజులు, బారసాలలు, అన్నప్రాసనలు ఇలా ఏ శుభకార్యాన్నైనా జరుపుకునే ముందు బంధుమిత్ర సపరివార సమేతంగా వేడుకకు హాజరు అవ్వాలని ఆహ్వాన పత్రికలు ప్రత్యేకంగా తయారు చేసి పంచుతాం. ఆహ్వానం అందినవారు తప్పకుండా ఆయా శుభకార్యాలకు హాజరై ఆహ్వానించిన వారిని ఆనందపరుస్తారు.

AP News: రేపటి భవిష్యత్తుకు వినూత్న ఆలోచన.. ఇదో వెరైటీ ఆహ్వాన పత్రిక.. ఎందుకో తెలుసా
Election Invitation
B Ravi Kumar
| Edited By: Srikar T|

Updated on: Mar 20, 2024 | 12:43 PM

Share

ఏలూరు, మార్చి 20: ఆహ్వానం..! ఈ పేరు వినగానే మనకు ముందుగా గుర్తొచ్చేది శుభకార్యాలు. పెళ్లిళ్లు, ఓణీల వేడుకలు, పుట్టినరోజులు, బారసాలలు, అన్నప్రాసనలు ఇలా ఏ శుభకార్యాన్నైనా జరుపుకునే ముందు బంధుమిత్ర సపరివార సమేతంగా వేడుకకు హాజరు అవ్వాలని ఆహ్వాన పత్రికలు ప్రత్యేకంగా తయారు చేసి పంచుతాం. ఆహ్వానం అందినవారు తప్పకుండా ఆయా శుభకార్యాలకు హాజరై ఆహ్వానించిన వారిని ఆనందపరుస్తారు. కనుకనే ఆహ్వాన పత్రికకు అంత ప్రత్యేకత ఉంది. అయితే ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు. ఇప్పుడెందుకు మనం ఆహ్వాన పత్రికల గురించి చర్చించుకుంటున్నాం అనేగా మీ డౌట్. ఇప్పటి వరకు ఎవరు చూడని చేయని ఆహ్వాన పత్రిక అది. ఓ ప్రభుత్వ అధికారి వినూత్న ఆహ్వాన పత్రికతో ప్రజలను ఆ కార్యక్రమానికి హాజరయ్యేలా అవగాహన కలిగించడమే ఆహ్వాన పత్రిక ముఖ్య ఉద్దేశం.

ప్రస్తుతం ఎన్నికల సీజన్ మొదలైంది. హోరాహోరీగా రాజకీయ పార్టీలు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నానా తంటాలు పడుకున్నారు. నాయకులు ఎంత ప్రలోబాలకు గురిచేసినా కొన్ని ప్రాంతాల్లో మాత్రం పోలింగ్ శాతం చాలా తక్కువగా నమోదు అవుతుంది. ఈ క్రమంలో ప్రతి పోలింగ్ కేంద్రంలో వీలైనంత ఎక్కువగా పోలింగ్ శాతం నమోదయ్యేలా ప్రజల్లో ఓటుపట్ల తమ బాధ్యతను తెలియజేసేలా అవగాహన కల్పించడానికి ఏలూరు జిల్లా డిపిఓ (డిస్ట్రిక్ట్ పంచాయతీరాజ్ ఆఫీసర్) తూతిక శ్రీనివాస్ విశ్వనాధ్ వినూత్న ఆలోచన చేశారు. శుభకార్యాలకు మనం ఏ విధంగా ఆహ్వాన పత్రికలు ముద్రించి కార్యక్రమానికి తప్పకుండా రావాలంటూ ఆహ్వానం పలుకుతామో అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతూ ఎన్నికల ఆహ్వాన పత్రికలు ముద్రించి గ్రామస్థాయిలో వాటిని ప్రతి ఒక్కరికి చేరవేస్తున్నారు.

ఆహ్వాన పత్రికలో పెళ్లికి ముహూర్తం ముద్రించినట్లుగా ఎన్నికలకు సంబంధించి పోలింగ్ తేది 2024 మే 13వ తేదీ బుధవారం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అని, ఓట్ల పండగకు అందరూ తప్పకుండా హాజరై తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని, వేదిక పోలింగ్ కేంద్రాన్ని సూచిస్తూ, పోలింగ్ శాతం పెరగాలి, ఎథికల్ ఓటింగ్ జరగాలని అంటూ కార్డులపై ముద్రించి ఆహ్వాన పత్రికల రూపంలో ప్రచారం చేస్తున్నారు. ఈ వినూత్న ప్రచారం ప్రజల్లోకి స్పీడుగా వెళుతుంది. ఏ విధంగా శుభకార్యాలకు ఆహ్వాన పత్రికలు అందుకొని వెళతారో అదే విధంగా ఈ వినూత్న పత్రికలు అందుకుని ఓటర్లు అధిక సంఖ్యలో పోలింగ్‎కు హాజరై పోలింగ్ శాతాన్ని పెంచుతారని అధికారులు భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…