AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Holi 2024 : హోళికా దహనంలో కొబ్బరి కాయలు కాల్చే ఆచారం..! ఇలా చేస్తే కోరిన కోర్కెలు తీరుతాయి..

Coconut Holika Dahan : భారతదేశంలోని అతిపెద్ద పండుగలలో ఒకటైన హోలీ పండగ వచ్చేసింది. రంగుల పండుగ హోలీని ఘనంగా జరుపుకోవడానికి దేశవ్యాప్తంగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సాంప్రదాయ పండుగ హోలీ ఉత్సాహం మార్కెట్లలో ఇప్పటికే ప్రారంభమైంది. హోలీని రంగులు, ఆనందం, ఉత్సాహ భరితమైన పండుగగా పిలుస్తారు. హోలీ పండుగ పరస్పర ప్రేమ, సోదరభావాన్ని పెంపొందించే వేడుకగా జరుపుకుంటారు. దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా హోలీని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. హోలీలో వినోదం, రంగులతో పాటు హోలికా […]

Holi 2024 : హోళికా దహనంలో కొబ్బరి కాయలు కాల్చే ఆచారం..! ఇలా చేస్తే కోరిన కోర్కెలు తీరుతాయి..
Coconut Holika Dahan
Jyothi Gadda
|

Updated on: Mar 19, 2024 | 7:33 PM

Share

Coconut Holika Dahan : భారతదేశంలోని అతిపెద్ద పండుగలలో ఒకటైన హోలీ పండగ వచ్చేసింది. రంగుల పండుగ హోలీని ఘనంగా జరుపుకోవడానికి దేశవ్యాప్తంగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సాంప్రదాయ పండుగ హోలీ ఉత్సాహం మార్కెట్లలో ఇప్పటికే ప్రారంభమైంది. హోలీని రంగులు, ఆనందం, ఉత్సాహ భరితమైన పండుగగా పిలుస్తారు. హోలీ పండుగ పరస్పర ప్రేమ, సోదరభావాన్ని పెంపొందించే వేడుకగా జరుపుకుంటారు. దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా హోలీని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. హోలీలో వినోదం, రంగులతో పాటు హోలికా దహన్ కూడా ప్రత్యేకంగా ఉంటుంది. ప్రతిచోటా, రంగుల హోలీకి ఒక రోజు ముందు మధ్యాహ్నం హోలికా పూజ, సాయంత్రం హోలికా దహనం చేస్తారు. హోలికను కాల్చడానికి కట్టెలు, ఆవు పేడను సేకరించి ప్రధాన కూడళ్ల వద్ద దహనం చేస్తారు. అయితే, ఒక చోట మాత్రం హోలికను కట్టేలతో కాకుండా కొబ్బరికాయలతో కాలుస్తారు. ఈ సంప్రదాయం వెనుక కొన్ని ప్రత్యేక కారణాలు ప్రచారంలో ఉన్నాయి. రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో ఇలాంటి విభిన్న శైలి కనిపిస్తుంది. పూర్తి వివరాల్లో వెళితే..

హోలీ పండుగను మన దేశంలోనే కాదు, విదేశాలలో కూడా అనేక చోట్ల జరుపుకుంటారు. హోలీ వేడుకలు వివిధ రూపాలలో వివిధ ప్రదేశాలలో జరుపుతారు. ఉదయ్‌పూర్‌లోని సెమరీలోని కర్కెలా ధామ్‌లో కొబ్బరి హోలీ చాలా కాలంగా ప్రజలను ఆకర్షిస్తోంది. కర్కెలా ధామ్‌లో కొబ్బరికాయతో హోలీ ఆడే సంప్రదాయం ఉంది. బాబోయ్‌ అని భయపడకండి.. కొబ్బరికాయలతో హోలీ అంటే.. ఒకరిపై ఒకరు కొబ్బరికాయలు కొట్టుకుని హోలీ ఆడరు. ఇక్కడి ప్రజలు హోలికాకు కొబ్బరికాయను సమర్పించి హోలీని జరుపుకుంటారు.

ఉదయపూర్‌లోని సెమ్రీ పట్టణంలోని ధంకవాడ గ్రామ పంచాయతీ నుండి సుమారు ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న కర్కెలా ధామ్ గిరిజనుల పవిత్రమైన ప్రదేశంగా పిలుస్తారు. ఇక్కడి గిరిజనులు హోలికను తమ కూతురు అని నమ్ముతున్నారు. అందుకే హోలీని ముందుగా కర్కెలా ధామ్‌లో మాత్రమే జరుపుకోవాలని ఒక నమ్మకం. ఆదివాసీల పవిత్ర ప్రదేశం కర్కెలా ధామ్‌లో హోలీకాను మొదట వెలిగిస్తారు. ఇక్కడ ప్రజలు హోలీ దహన్ తర్వాత ఎగసిపడుతున్న మంటలను చూసిన తర్వాతే చుట్టు పక్కల హోలీకాను కాలుస్తారు. కర్కెలా ధామ్ ఎత్తైన కొండపై ఉన్నందున, హోలికా దహన్ దూరం నుండే కనిపిస్తుంది. ఆ తర్వాత మాత్రమే పరిసర ప్రాంతాల్లో హోలీని జరుపుకుంటారు.

ఇవి కూడా చదవండి

పర్వతం మీద ఉన్న కర్కేలా ధామ్ దగ్గర హోలిక ప్రహ్లాదుని ఒడిలో పెట్టుకుని మంటల్లో కూర్చున్నదని గిరిజనులు నమ్ముతారని ఇక్కడి స్థానికులు చెబుతారు. అప్పుడు శ్రీమహావిష్ణువు తన భక్తుడైన ప్రహ్లాదుని రక్షించడానికి ఒక అద్భుతం చేశాడని, దాంతో హోలిక మంటల్లో కాలిపోయి ప్రహ్లాదుడు రక్షించబడ్డాడు ఇక్కడి గిరిజనులు నమ్ముతారు. ఈ కారణంగానే హోలికాకు వీడ్కోలు చెప్పడానికి కొబ్బరికాయను అగ్నికి సమర్పించుకుంటారు. హోళికకు కొబ్బరికాయను కానుకగా ఇస్తే తమ కోర్కెలు నెరవేరుతాయని విశ్వసిస్తారు. దీనికోసం ప్రతీ యేటా ఇక్కడ లక్షలకొద్దీ కొబ్బరికాయలతో హోళిక తయారు చేస్తారు. కొబ్బరికాయలతో పాటు ఎండిన ఆవు పేడ పిడకలు కూడా ఉపయోగిస్తారు.

హోలికా దహనం సందర్భంగా కాన్పూర్‌తో పాటు, సమీప నగరాల నుండి కూడా ప్రజలు ఇక్కడికి వస్తుంటారు. కొబ్బరికాయను తలపై పెట్టుకుని హోలీలో వేస్తారు. తలపై కొబ్బరికాయను మోసుకొచ్చి ఇక్కడి అగ్నిలో వేస్తారో వారికి జీవితంలో అన్ని కష్టాలు, బాధలు హోలిక అగ్నిలో కొబ్బరికాయతో పాటు కాలిపోతాయని, వారి జీవితం ఆనందంగా మారుతుందని నమ్ముతారు. అంతేకాదు. హోలీ రోజు కొబ్బరికాయను కాల్చడం వెనుక ఒక శాస్త్రీయ కారణం కూడా ఉందని చెబుతారు. అది పర్యావరణాన్ని శుద్ధి చేస్తుంది. ఎందుకంటే కొబ్బరి పొగ ఎంత వరకు చేరుతుందో ఆ ప్రాంతంలోని వ్యాధులు నయమై పర్యావరణం శుద్ధి అవుతుంది. దీని వల్ల మనుషులతో పాటు జంతువులు, పక్షులు ఆరోగ్యంగా ఉంటాయి.