Laddu Holi 2024: నేడు బర్సానాలో లడ్డులతో హొలీ వేడుకలు.. భారీ సంఖ్యలో మధురకు చేరుకున్న కన్నయ్య భక్తులు

. శ్రీ కృష్ణుడి నగరమైన మధురతో సహా బృందావనం, బర్సానాలో హోలీని ఉత్సాహంగా ఆడతారు. ఈ క్రమంలో ఈ రోజు లడ్డూలతో కొట్టుకునే హోలీ ఆడనున్నారు. రంగులకు బదులుగా లడ్డులను ఉపయోగించి అదే ఈ హొలీ వేడుకల్లో వేల సంఖ్యలో లడ్డూల వర్షం కురియనుంది.  హోలీ సందర్భంగా ఇహాన్ని వదిలి రాధా-కృష్ణుల భక్తిలో మునిగిపోతారు. హోలీ వేడుకను చూడటానికి దేశ విదేశాల నుంచి కన్నయ్య భక్తులు మధుర, బర్సానా చేరుకుని హోలీని ఆనందిస్తారు.

Laddu Holi 2024: నేడు బర్సానాలో లడ్డులతో హొలీ వేడుకలు.. భారీ సంఖ్యలో మధురకు చేరుకున్న కన్నయ్య భక్తులు
Laddu Holi 2024
Follow us
Surya Kala

|

Updated on: Mar 17, 2024 | 6:45 AM

ఈ నెల 25న హొలీ పర్వదినం జరుపుకోవడానికి పిల్లలు, పెద్దలు ఉత్సవంగా రెడీ అవుతున్నారు. అయితే నేటి నుంచి కన్నయ్య నడయాడిన నేల మధురలో హొలీ పండగ సంబరాలు ప్రారంభం కానున్నాయి.   మధుర హోలీ క్యాలెండర్ ప్రకారం.. నేడు (మార్చి 17 ఆదివారం) బర్సానాలో లడ్డు హోలీని చాలా ఉత్సాహంగా జరుపుకోనున్నారు. బర్సానాలో లడ్డూమార్ హోలీ సందర్భంగా ప్రజలు ఇప్పటికే హోలీ సంబరాల్లో మునిగిపోయారు. శ్రీ కృష్ణుడి నగరమైన మధురతో సహా బృందావనం, బర్సానాలో హోలీని ఉత్సాహంగా ఆడతారు. ఈ క్రమంలో ఈ రోజు లడ్డూలతో కొట్టుకునే హోలీ ఆడనున్నారు. రంగులకు బదులుగా లడ్డులను ఉపయోగించి అదే ఈ హొలీ వేడుకల్లో వేల సంఖ్యలో లడ్డూల వర్షం కురియనుంది.  హోలీ సందర్భంగా ఇహాన్ని వదిలి రాధా-కృష్ణుల భక్తిలో మునిగిపోతారు. హోలీ వేడుకను చూడటానికి దేశ విదేశాల నుంచి కన్నయ్య భక్తులు మధుర, బర్సానా చేరుకుని హోలీని ఆనందిస్తారు.

లడ్డూమార్ హోలీ రోజున బర్సానాలోని రాధ స్నేహితులు రంగులతో  కన్నయ్య ఇల్లు ఉన్న నంద గ్రామానికి వెళ్లి ఆహ్వానం పలకడం మధురలో ఒక సంప్రదాయం. రాధాదేవి హోలీ ఆడటానికి కన్నయ్యను ఆహ్వానిస్తుంది. ఈ సమయంలో లడ్డులతో హోలీ ఆడే ట్రెండ్ మొదలు అయింది. నందగ్రామంలో లత్మార్ హోలీ ఆహ్వానాన్ని అంగీకరించిన తర్వాత మాత్రమే..  కన్నయ్య ఆలయం బర్సానాలో లడ్డలతో హొలీ వేడుకలను నిర్వహిస్తారు.

లడ్డులతో హొలీ విదేశాల్లో సైతం గుర్తింపు

బర్సానాలో లడ్డులతో ఆడే హొలీని చూడటానికి బ్రజ్ గ్రామస్తులే కాదు దేశం నలుమూలల నుంచి విదేశాల నుంచి కూడా భక్తులు మథురకు చేరుకుంటారు. లడ్డూమార్ హోలీలో వేల సంఖ్యలో లడ్డూలు వేసినా అందరికీ లడ్డూలు లభించవని, ఎవరికైతే మొత్తం లడ్డు దక్కుతుందో వారికి రాధారాణి ఆశీస్సులు లభిస్తాయని.. జీవితంలో సుఖసంతోషాలు నెలకొంటాయని ఒక నమ్మకం.

పౌరాణిక కథ ఏమిటంటే

లడ్డులతో హొలీ వేడుకల ఆనవాయితీ చాలా ఏళ్లుగా కొనసాగుతోంది. పురాణాల ప్రకారం ద్వాపర యుగంలో హోలీకి రాధా దేవి తండ్రి పంపిన ఆహ్వానాన్ని నంద గోపాలుడు అంగీకరించారు, ఆ తర్వాత కన్నయ్య  అంగీకార పత్రాన్ని పూజారులకు పంపాడు. అప్పుడు పూజారులు కన్నయ్యకు స్వాగతం పలుకుతూ లడ్డూలు కూడా తినడానికి ఇచ్చారు.  బర్సానాలోని గోపికలు రంగులను వేయడం ప్రారంభించినప్పుడు.. పూజారులు తమ చేతిలోని లడ్డూలను కురిపించారు. అప్పటి నుంచి హొలీకి ముందు నందగ్రామానికి ఆహ్వానం పంపించి.. కన్నయ్యకు స్వాగతం చెబుతూ లడ్డులతో హొలీ ఆడే సంప్రదాయం ప్రారంభమైంది. నేటికీ  బర్సానా, నంద గ్రామాల్లో ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రజలు ఇప్పటికీ లడ్డులతో హొలీ వేడుకలను ఆడుతున్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు

డొనాల్డ్ ట్రంప్ జీవిత విశేషాలతో అద్భుత కళాఖండం..!
డొనాల్డ్ ట్రంప్ జీవిత విశేషాలతో అద్భుత కళాఖండం..!
టెన్త్‌ అర్హతతో తెలంగాణ హైకోర్టులో 1673 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
టెన్త్‌ అర్హతతో తెలంగాణ హైకోర్టులో 1673 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
ఇందిరా గాంధీగా కంగనా రనౌత్.. ఎమర్జెన్సీ రిలీజ్ ట్రైలర్ చూశారా?
ఇందిరా గాంధీగా కంగనా రనౌత్.. ఎమర్జెన్సీ రిలీజ్ ట్రైలర్ చూశారా?
మరో భార్య భాదితుడు బలి.. కన్నీరు పెట్టిస్తోన్న ఆఖరి మాటలు..
మరో భార్య భాదితుడు బలి.. కన్నీరు పెట్టిస్తోన్న ఆఖరి మాటలు..
అక్కినేని ముగ్గురు హీరోలను ఈ ఒక్క హీరోయిన్ కవర్ చేసిందా.!
అక్కినేని ముగ్గురు హీరోలను ఈ ఒక్క హీరోయిన్ కవర్ చేసిందా.!
ఈ లావాదేవీలకు ఆదాయపు పన్ను శాఖ నోటీసు పంపుతుందా?
ఈ లావాదేవీలకు ఆదాయపు పన్ను శాఖ నోటీసు పంపుతుందా?
హైకోర్టులో క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల
హైకోర్టులో క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల
సికింద్రాబాద్ ​నుంచి కుంభమేళాకు IRCTC ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే
సికింద్రాబాద్ ​నుంచి కుంభమేళాకు IRCTC ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే
ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి
దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి