AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jupiter Transit: 12 ఏళ్ల తర్వాత వృషభరాశిలో అడుగు పెట్టనున్న గురుడు.. ఈ 4 రాశులకు లక్కే లక్కు..

త్వరలో గురుడు మేషరాశి నుంచి వృషభరాశిలోకి అడుగు పెట్టనున్నాడు. దాదాపు 12 ఏళ్ల తర్వాత బృహస్పతి మే 1వ తేదీన వృషభరాశిలో అడుగు పెట్టనున్నాడు. బృహస్పతి తన రాశిని మార్చుకోనున్న నేపథ్యంలో కొన్ని రాశులకు చెందిన వ్యక్తులకు అదృష్టాన్ని తీసుకుని రానున్నాడు. ముఖ్యంగా నాలుగు రాశులకు లక్కీని తీసుకుని రానుంది ఈ రాశి మార్పు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఆ అదృష్ట రాశులు ఏమిటో తెలుసుకుందాం..

Jupiter Transit: 12 ఏళ్ల తర్వాత వృషభరాశిలో అడుగు పెట్టనున్న గురుడు.. ఈ 4 రాశులకు లక్కే లక్కు..
Jupiter Transit In Taurus
Surya Kala
|

Updated on: Mar 17, 2024 | 7:22 AM

Share

వేద జ్యోతిష్య శాస్త్రంలో మనిషి జాతకం రాశులు, నక్షత్రాలు, గ్రహాలపై ఆధారపడి ఉందని పేర్కొంది. నవ గ్రహాలు తమ నిర్దిష్ట సమయం ముగిసిన తర్వాత ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తాయి. ప్రస్తుతం మేషరాశిలో సంచరిస్తున్నాడు దేవ గురువు బృహస్పతి. అయితే త్వరలో గురుడు మేషరాశి నుంచి వృషభరాశిలోకి అడుగు పెట్టనున్నాడు. దాదాపు 12 ఏళ్ల తర్వాత బృహస్పతి మే 1వ తేదీన వృషభరాశిలో అడుగు పెట్టనున్నాడు. బృహస్పతి తన రాశిని మార్చుకోనున్న నేపథ్యంలో కొన్ని రాశులకు చెందిన వ్యక్తులకు అదృష్టాన్ని తీసుకుని రానున్నాడు. ముఖ్యంగా నాలుగు రాశులకు లక్కీని తీసుకుని రానుంది ఈ రాశి మార్పు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఆ అదృష్ట రాశులు ఏమిటో తెలుసుకుందాం..

సింహ రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తుల జీవితంలో వృషభ రాశిలో బృహస్పతి సంచారం శుభ ఫలితాలను ఇస్తుంది. ఆర్ధికంగా లాభాలను తెస్తుంది. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి గురువు సంచారంతో శుభ వార్తలు వింటారు. ఉద్యోగులకు ప్రమోషన్ లభిస్తుంది. వ్యాపారస్తులు గతంలో ఎన్నడూ చూడని లాభాలను చూస్తారు. చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారి ప్రయత్నాలు ఫలించి  జాబ్ వస్తుంది. ఆర్థిక కష్టాలు తొలగి సంతోషంగా ఉంటారు.

కన్య రాశి: దేవ గురువు బృహస్పతి రాశి మార్పు కారణంగా ఈ రాశికి చెందిన వ్యక్తుల జీవితాల్లో వెలుగులు వస్తాయి. అదృష్టం కలిసి వచ్చి పట్టిందల్లా బంగారమే అనిపిస్తుంది. డబ్బుల కొరత తీరుతుంది. దంపతులు సుఖ సంతోషాలతో జీవిస్తారు. కెరీర్ లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఎప్పటి నుంచో తీరని సమస్యలు తీరతాయి.

ఇవి కూడా చదవండి

మేష రాశి: బృహస్పతి రాశి మార్చుకుని వృషభరాశిలోకి అడుగు పెట్టడం వలన మేష రాశి వారికి అద్భుతంగా ఉండనుంది. ఉద్యోగస్తుల జీతం పెరిగే అవకాశం ఉంది. అంతేకాదు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న న ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. వ్యాపారస్తులు పెట్టిన పెట్టుబడులతో లాభాలు పొందతారు.  జీవితంలో ఎదురయ్యే సమస్యలు దూరమవుతాయి.

కర్కాటక రాశి: బృహస్పతి రాశి మార్పుతో ఈ రాశికి చెందిన వారి ఆర్ధిక ఇబ్బందులు తీరతాయి. సంపద వృద్ధి చెందుతుంది. కెరీర్ లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఉద్యోగస్తుల జీతం పెరుగుతుంది. తోటి ఉద్యోగస్తుల సహకారం లభిస్తుంది. చేసిన పనులతో ప్రశంసలను అందుకుంటారు. కోరికలు తీరి సంతోషముగా జీవిస్తారు. తీసుకున్న అప్పులు తీర్చే ప్రయత్నం ఫలించి ఋణం నుంచి విముక్తి అవుతారు.   నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు

Follow Us
ఆలయంలో ఎదురుపడ్డ నాగుపాము,పిల్లి.. ఆ తర్వాత జరిగిందిదే..
ఆలయంలో ఎదురుపడ్డ నాగుపాము,పిల్లి.. ఆ తర్వాత జరిగిందిదే..
గర్భవతినని బాస్‌కి మెసేజ్ చేసిన మహిళ.. 3 గంటల్లోనే ఉద్యోగం ఊస్ట్‌
గర్భవతినని బాస్‌కి మెసేజ్ చేసిన మహిళ.. 3 గంటల్లోనే ఉద్యోగం ఊస్ట్‌
తెలంగాణ విద్యార్థులకు అలెర్ట్.. జూలై 24న విద్యాసంస్థల బంద్‌..!
తెలంగాణ విద్యార్థులకు అలెర్ట్.. జూలై 24న విద్యాసంస్థల బంద్‌..!
మీపేరు మీద వేరేవాళ్ళు SIM వాడుతున్నారా? గుర్తించడం ఎలా?
మీపేరు మీద వేరేవాళ్ళు SIM వాడుతున్నారా? గుర్తించడం ఎలా?
మేక పిల్లల కోసం దారుణం.. మాజీ సర్పంచ్ దాడిలో పశువుల కాపరి బలి!
మేక పిల్లల కోసం దారుణం.. మాజీ సర్పంచ్ దాడిలో పశువుల కాపరి బలి!
చూసేందుకు కంటిలో నలుసంత.. కానీ దగ్గు, ఆస్తమాకు చెక్ పెట్టేస్తుంది
చూసేందుకు కంటిలో నలుసంత.. కానీ దగ్గు, ఆస్తమాకు చెక్ పెట్టేస్తుంది
గురు పూర్ణిమ నుంచి మహర్దశ.. ఇక ఈ రాశుల వారికి తిరుగుండదు!
గురు పూర్ణిమ నుంచి మహర్దశ.. ఇక ఈ రాశుల వారికి తిరుగుండదు!
పేపర్ లీక్‌లపై కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్..!
పేపర్ లీక్‌లపై కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్..!
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?