పాము నుండి ఎలా తప్పించుకోవాలో తెలుసా..? ఈ చిట్కాలు పాటిస్తే ప్రమాదం నుండి బయటపడొచ్చు..
పాము.. ఈ పేరు వింటేనే చాలా మంది భయంతో వణికిపోతారు. అక్కడెక్కడో పాము ఉందనే విషయం తెలిస్తేనే భయంతో పరుగులు తీస్తారు. ఇక పామును దగ్గర చూస్తే భయంతో పై ప్రాణాలు పైకే పోయినంత పనవుతుంది. పాము అంటే భయపడని వారు ఉండరు. పామును చూసి అందరూ భయాందోళనలతో ఏదో చేసి ఇరుక్కుపోతుంటారు. ప్రమాదాల బారినపడుతుంటారు. ఈ పోస్ట్‌లో విషపూరిత పాము కాటుకు గురైతే ఏం చేయాలి? ఎలా తప్పించుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం..

భయపడవద్దు:
పామును చూసి మొదట భయపడకూడదు. పాము వస్తున్న దిశలో ఎలాంటి కదలికలు చేయకూడదు. పాము ఉన్న దిశలో పరుగెత్తకూడదు. లేదా పాముపై ఏదైనా విసిరేందుకు ప్రయత్నించవద్దు. చాలా పాములు మీ దగ్గరికి రావడానికి ఇష్టపడవు, ఎందుకంటే అవి కూడా భయపడతాయి. మీరు వాటిని ఇబ్బంది పెట్టకుంటే వాటంతట అవే వెళ్లిపోతాయి. ఒక్క కట్లపాము మినహా మిగిలిన పాములన్నీ కాటు వేసే ముందు హెచ్చరిస్తాయని నిపుణులు చెప్తున్నారు.
పాము ఉన్న గదిలో నిశ్శబ్దంగా ఉండేలా చూసుకోండి:
మీ పాము ఉన్నట్లు మీరు గ్రహించినప్పుడు మీరు ప్రశాంతంగా ఉండాలి. మీ పిల్లలు, పెంపుడు జంతువులు, పాము దగ్గరగా దేనినీ అనుమతించవద్దు. అరవకండి. మీరు లైట్ ఆఫ్ చేయడం ద్వారా ప్రమాదాన్ని తగ్గించవచ్చు. అయితే పాముపై ఓ కన్నేసి ఉంచాలి. పాముని భయపెట్టే పని చేయవద్దు. పాము ఉన్న దిశ నుండి వేరే దిశలో వెళ్ళండి. వెంటనే సహాయం కోసం ఎవరినైనా పిలవండి.
పామును పరుగెత్తనివ్వండి:
ఒక పొడవాటి కర్రను తీసుకుని, పాము మీ వైపు రాకుండా ఉండేందుకు దాన్ని వెనక్కి నెట్టేప్రయత్నం చేయండి. పాముకి చెవులు లేవు కాబట్టి, అది కంపనం లేని ప్రదేశం వైపు పరుగెత్తుతుంది. కర్రలను అడ్డుపెట్టడం, దాన్ని నెడుతూ ఉండటం వల్ల అది ప్రత్యామ్నాయ దిశలో పరిగెడుతుంది. అది అది వెళ్లిపోతే మంచిది. లేదా, అది మరో గదిలోకి వెళితే ఆ రూమ్ తలుపులు మూసివేసి, సహాయం కోసం స్నేక్ క్యాచర్‌కు కాల్ చేయండి.
టెన్షన్ పడకుండా ఉండాలి:
ప్రమాదవశాత్తు పాము కాటుకు గురైన వ్యక్తి టెన్షన్ పడకుండా ఉండాలి. శరీరాన్ని అటూ ఇటూ కదపకూడదు. పరిగెత్తకూడదు. పరిగెడితే గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. అప్పుడు విషం వేగంగా శరీరమంతా విస్తరిస్తుంది. అందుకే టెన్షన్ పడకుండా ధైర్యంగా ఉండాలి. పాము కాటేసిన చోట గాయాన్ని కోసి.. విషాన్ని బయటకు తీసే ప్రయత్నం చేయొద్దు. గాయం చుట్టూ టేపు లాంటిది కూడా కట్టకూడదని నిపుణులు చెబుతున్నారు. సాధ్యమైనంత త్వరగా దగ్గర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి లేదా వైద్యుడి దగ్గరకు వెళ్లాలి.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..