AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Holi History: రంగుల కేళి.. హోలీ పండుగ ఎలా వచ్చిందో తెలుసా? అందుకే అక్కడ 5 రోజుల సంబరాలు

మన దేశంలో హోలీ పండుగను అనాదిగా జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. ప్రతీయేట ఫాల్గుణ పౌర్ణమి నాడు ఆనందార్ణవంగా ఈ పండుగను జరుపుకుంటారని లింగపురాణం చెబుతోంది. ఇక హోలీ పండుగను కేవలం మన దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా జరుపుకునే సంప్రదాయం ఉంది. ప్రకృతిలో వ్యక్తమయ్యే నవచైతన్యానికి ప్రతీకగా ఈ పండుగను జరుపుకుంటారు. ముఖ్యంగా హోలీతో ముడిపడిన ప్రధాన గాథ కామదహనం..

Holi History: రంగుల కేళి.. హోలీ పండుగ ఎలా వచ్చిందో తెలుసా? అందుకే అక్కడ 5 రోజుల సంబరాలు
Holi
Srilakshmi C
|

Updated on: Mar 19, 2024 | 1:31 PM

Share

మన దేశంలో హోలీ పండుగను అనాదిగా జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. ప్రతీయేట ఫాల్గుణ పౌర్ణమి నాడు ఆనందార్ణవంగా ఈ పండుగను జరుపుకుంటారని లింగపురాణం చెబుతోంది. ఇక హోలీ పండుగను కేవలం మన దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా జరుపుకునే సంప్రదాయం ఉంది. ప్రకృతిలో వ్యక్తమయ్యే నవచైతన్యానికి ప్రతీకగా ఈ పండుగను జరుపుకుంటారు. ముఖ్యంగా హోలీతో ముడిపడిన ప్రధాన గాథ కామదహనం. తన తపస్సును భగ్నం చేసిన మన్మథుణ్ని ముక్కంటి నాథుడు మూడోకన్ను తెరచి భస్మం చేసింది ఫాల్గుణ పౌర్ణమినాడేనని శివమహా పురాణం చెబుతోంది.

మన దేశంలో హోలీ సంబరాలు ఝాన్సీ ప్రధాన కార్యాలయానికి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎరిచ్ సిటీలో తొలుత ప్రారంభమైనట్లు చెబుతారు. దీనిని ఇక్కడ ఫాగ్ అని పిలుస్తారు. ఈ సిటీలో ఒక పురాతన నరసింహ దేవాలయం ఉంది. ఇందులో నరసింహ స్వామి విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ పురాతన రాజభవనాలు, పురాతన భవనాలు ఎన్నో ఉన్నాయి. దీనిని హిరణ్యకశ్యపు రాజభవనంగా స్థానికులు చెబుతుంటారు. హిరణ్యకశ్యపుని కాలంలో ఎర్చ్ రాజధానిగా ఉండేది. ఈ రాజభవనం సమీపంలో అగ్ని సైతం దహించలేని హిరణ్యకశ్యపుని సోదరి హోలిక తన ఒడిలో విష్ణు భక్తుడైన ప్రహ్లాదునితో కలిసి అగ్నిలో కూర్చుని ఆహుతైనట్లు స్థానిక కథలు చెబుతారు. ప్రహ్లాదుని స్పర్శతో ఆమె ఆగ్నికి ఆహుతైన తర్వాత ప్రహ్లాదుడు అగ్ని నుంచి క్షేమంగా బయటికి వచినట్లు పురాణం. అలా, హోలిక దగ్ధం అయినా ఫాల్గుణ పౌర్ణమినే ప్రహ్లాద పౌర్ణమి అంటారు. ఇక ఇక్కడి పురాతన ఆలయాలను చూసేందుకు ఏటా లక్షలాది మంది ప్రజలు ఇక్కడికి వస్తుంటారు. నేటికీ ఇక్కడ హోలీ పండుగను ఘనంగా జరుపుకుంటారు.

పురావస్తు త్రవ్వకాల్లో లభించిన ఆధారాల ఆధారంగా, ఎరిచ్ ఒక చారిత్రక నగరం. పట్టణానికి సమీపంలో బెత్వా నది ఒడ్డున ఉన్న డికోలి గ్రామం చారిత్రాత్మక దేకంచల్ పర్వతం ఒడ్డున ఉన్న గ్రామంగా చెబుతారు. భక్తుడు ప్రహ్లాదుడిని దేకాంచల్ పర్వతం నుంచి నదిలోకి విసిరినట్లు నమ్ముతారు. భక్తుడు ప్రహ్లాదుని విసిరిన ప్రదేశాన్ని ప్రస్తుతం ప్రహ్లాద్ కుండ్ అని పిలుస్తారు. పురావస్తు పరిశోధనలలో ఇటువంటి అనేక సాక్ష్యాలు కనుగొన్నారు. ఇక్కడ ఒకప్పుడు అభివృద్ధి చెందిన నాగరికత విలసిల్లినట్లు చారిత్రక ఆధారాలు నిర్ధారిస్తున్నాయి. హిరణ్యకశ్యపుని రాజధానిగా పరిగణించబడే ఈ ప్రదేశంలో ఇటువంటి అనేక అవశేషాలు ఉన్నాయి. ఝాన్సీ జిల్లాలోని ఈ ఎరుచ్ పట్టణం నుంచి హోలీ పండుగ ప్రారంభమైందని విశ్వసిస్తారు. ఎరిచ్ పట్టణం జిల్లా కేంద్రానికి 80 కిలోమీటర్ల దూరంలో ఉంది.

ఇవి కూడా చదవండి

మూడున్నర వేల సంవత్సరాల క్రితం ఎరుచు ప్రధాన వాణిజ్య కేంద్రంగా ఉన్నట్లు విశ్రాంత ప్రాంతీయ పురావస్తు అధికారి డా.సురేష్ కుమార్ దూబే తెలిపారు. ఝాన్సీ జిల్లా ఎరుచ్ పట్టణం ఎరుచ్‌లో పురావస్తు శాఖ జరిపిన తవ్వకాల్లో లభించిన ఆధారాల ప్రకారం సుమారు మూడు వేల రెండు వందల సంవత్సరాల కాలం నాటి కొంతమంది రాజుల పేర్లు కూడా దొరికాయి. ఇక్కడ లభించిన ఓడరేవు ఆధారాలను బట్టి ఇక్కడ పెద్ద వాణిజ్య కేంద్రం ఉండేదని భావించవచ్చు. గ్రంధాల ఆధారంగా ఎరుచ్‌ హిరణ్యకశ్యపుని రాజధానిగా కూడా చెప్పబడింది.

హిమాలయాల కంటే పురాతనమైన బుందేల్‌ఖండ్ చరిత్ర

హిమాలయాల కంటే బుందేల్‌ఖండ్ చరిత్ర పురాతనమైనదని చరిత్ర నిపుణుడు ముకుంద్ మెహ్రోత్రా చెబుతున్నారు. గ్రంధాల ప్రకారం.. భక్త ప్రహ్లాదుని అగ్నిలో కాల్చే ప్రయత్నం, హిరణ్యకశ్యపుని చంపడం, విష్ణువు నరసింహ అవతారమనే నమ్మకం.. బుందేల్‌ఖండ్ నుంచి దక్షిణ భారతదేశానికి వలస వచ్చిన ప్రజలు నరసింహ భగవానుని ఆలయాలను స్థాపించడం ద్వారా బలపడింది. హిరణ్యకశ్యపుని చంపిన తర్వాత ఇక్కడ దేవతలు, రాక్షసుల పంచాయితీ జరిగిందని, ఇందులో రెండు పార్టీలు ఒకరికొకరు రంగులు వేసుకోవడం ద్వారా శత్రుత్వాన్ని అంతం చేయాలనే సందేశాన్ని ఇచ్చారని.. ఆ విధంగా అప్పటి నుంచి హోలీ ప్రారంభమైందని నమ్ముతారు.

మార్చి 21 నుంచి ఎరుచ్‌లో హోలీ మహోత్సవం

మార్చి 21 నుంచి 25 వరకు ఎరుచ్ పట్టణంలో ఐదు రోజుల పాటు హోలీ మహోత్సవం నిర్వహించనున్నారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో భక్త ప్రహ్లాద్ జన్ కళ్యాణ్ సంస్థాన్‌తో కలిసి నిర్వహించే హోలీ మహోత్సవ్‌కు ప్రభుత్వం పది లక్షల రూపాయలను అందజేస్తుంది. మార్చి 21న భక్త ప్రహ్లాదుని ఊరేగింపుతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. 22న బేబీ ఇమ్రాన్ బృందంచే బుందేలి రాయ్ నృత్యం, రాత్రి కవి సమ్మేళనం, 23న రంగోలీ పోటీలు, రాత్రి సితార్‌ వాద్యకారుడు సర్జూ శరణ్‌ పాఠక్‌చే శాస్త్రీయ సంగీతం, భజనల ప్రదర్శన, 24న జానపద గేయాలు, ఆలాపన ఉంటాయి. సంజో బాఘేల్‌చే అల్హా భజన్, 25న రాత్రి అఖిలేష్ అలఖ్, రాధికా ప్రజాపతిచే జానపద పాటలు, రాయ్ నృత్యంతో భక్త ప్రహ్లాద్ నాటక ప్రదర్శన ఉంటుంది.

మరిన్ని జాతీయ కథనాల కోసం క్లిక్‌ చేయండి.