Srisailam: శ్రీశైలం కుంభోత్సవంలో అమ్మవారికి కొబ్బరికాయల సమర్పణ…స్త్రీ వేషధారణలో కుంభహారతి..

ఈ సంవత్సరం ఏప్రిల్ 26న ఈ కుంభోత్సవం నిర్వహించబడుతుందని ఆలయ ఈఓ పెద్దిరాజు తెలిపారు. అమ్మవారికి సాత్వికబలి నిర్వహించేందుకు కొబ్బరికాయలు, గుమ్మడికాయలు, నిమ్మకాయలు, మొదలగునవి సమర్పించడం ద్వారా ఈ కుంభోత్సవం జరిపించడం ఆనవాయితి. కుంభోత్సవం రోజున స్త్రీ వేషంలో ఉన్న..

Srisailam: శ్రీశైలం కుంభోత్సవంలో అమ్మవారికి కొబ్బరికాయల సమర్పణ…స్త్రీ వేషధారణలో కుంభహారతి..
Kumbhotsavam
Follow us
J Y Nagi Reddy

| Edited By: Jyothi Gadda

Updated on: Mar 19, 2024 | 10:02 PM

నంద్యాల జిల్లా ప్రసిద్ధి చెందిన శ్రీశైలం మహాక్షేత్రంలో శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారికి వార్షిక కుంభోత్సవం నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఏప్రిల్ 26న సాత్వీకబలులను నిర్వహించేందుకు కొబ్బరికాయలు, నిమ్మకాయలు సిద్దం చేశారు. ముందుగా ఆలయంలో అర్చకులు వేదపండితులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈఓ పెద్దిరాజు, సిబ్బంది అమ్మవారికి కొబ్బరికాయలు పసుపు కుంకుమను శాస్త్రోక్తంగా సమర్పించారు. బాజా భజంత్రీల నడుమ ఇవన్నీ అమ్మవారి ఆలయానికి తీసుకువెళ్లగా అక్కడ ప్రత్యేకపూజలు, ప్రత్యేక హారతులిచ్చారు వేద పండితులు. అనంతరం అమ్మవారికి కొబ్బరికాయలు సమర్పించారు.

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిసిన అనంతరం ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం రోజులలో అమ్మవారికి కొబ్బరికాయలు సమర్పించడం ఆలయ సంప్రదాయం. అందులో బాగాంగా మంగళవారం శ్రీశైలం భ్రమరాంబాదేవి అమ్మవారికి కొబ్బరికాలు సమర్పించారు. చైత్రమాసంలో పౌర్ణమి తరువాత వచ్చే మంగళ లేదా శుక్రవారం రోజున అంటే, ఏ రోజు ముందుగా వస్తే ఆ రోజున శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారికి కుంభోత్సవం జరపడం సంప్రదాయం.

ఈ సంవత్సరం ఏప్రిల్ 26న ఈ కుంభోత్సవం నిర్వహించబడుతుందని ఆలయ ఈఓ పెద్దిరాజు తెలిపారు. అమ్మవారికి సాత్వికబలి నిర్వహించేందుకు కొబ్బరికాయలు, గుమ్మడికాయలు, నిమ్మకాయలు, మొదలగునవి సమర్పించడం ద్వారా ఈ కుంభోత్సవం జరిపించడం ఆనవాయితి. కుంభోత్సవం రోజున స్త్రీ వేషంలో ఉన్న పురుషుడు అమ్మవారికి కుంభహారతి సమర్పించడం ఇందులో ప్రధాన ఘట్టం. కాగా ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిసిన వెంటనే ప్రతి మంగళవారం, శుక్రవారం రోజులలో అమ్మవారికి కొబ్బరికాయలను సమర్పించడం జరుగుతుందని ఈఓ పెద్దిరాజు తెలిపారు…

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..