Beauty Tips: దానిమ్మ ఫేస్ ప్యాక్..! ఎప్పుడైనా ట్రై చేశారా..? మీ ముఖం మెరిసిపోవాలంటే తప్పక వాడండి..

అందంగా కనిపించాలని అందరూ కోరుకుంటారు. అందుకోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. బ్యూటీ పార్లర్లకు వెళ్లి వేలకు వేలు ఖర్చు చేస్తుంటారు. మరికొందరు మార్కెట్లో లభించే బ్యూటీ ప్రొడక్ట్స్ ని వాడుతుంటారు. కెమికల్‌ ఆధారిత సౌందర్య ఉత్పత్తుల కారణంగా అందం సంగతి దేవుడేరుగు.. వాటితో కలిగే సైడ్‌ ఎఫెక్ట్స్‌ తో మరింత ఇబ్బందులకు గురవుతుంటాయి. అయితే, మంచి ఆరోగ్యానిచ్చే దానిమ్మతో అందమైన ముఖ సౌందర్యం కూడా పొందవచ్చునని మీకు తెలుసా..?

Beauty Tips: దానిమ్మ ఫేస్ ప్యాక్..! ఎప్పుడైనా ట్రై చేశారా..? మీ ముఖం మెరిసిపోవాలంటే తప్పక వాడండి..
Pomegranate Face Pack
Follow us
Jyothi Gadda

|

Updated on: Mar 19, 2024 | 9:41 PM

దానిమ్మ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది తినడానికి చాలా రుచిగా ఉంటుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ పండు ఆరోగ్యానికే కాదు చర్మానికి కూడా మేలు చేస్తుంది. మచ్చలను తొలగించి చర్మాన్ని మృదువుగా, అందంగా మార్చడంలో దానిమ్మ అద్భుతం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. దానిమ్మపండును సక్రమంగా ఉపయోగించడం వల్ల మెరిసే ముఖాన్ని పొందవచ్చు. కాబట్టి, ఇంట్లోనే సులభంగా దానిమ్మతో ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.

దానిమ్మ – పెరుగు: ఈ ఫేస్ ప్యాక్ చేయడానికి, ముందుగా ఒక గిన్నెలో కావాల్సినంత పెరుగు తీసుకోండి. దానికి దానిమ్మ రసం కలపండి. బాగా మిక్స్ చేసి ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 30 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తర్వాత శుభ్రమైన నీటితో మీ ముఖాన్ని కడగాలి. ఈ మాస్క్ మీ ముఖంలోని అన్ని మచ్చలను తొలగిస్తుంది.

దానిమ్మ – తేనె: దానిమ్మ, తేనె ఫేస్ ప్యాక్ ఉపయోగించవచ్చు. ఇందుకోసం దానిమ్మ రసంలో తేనె కలిపి ముఖానికి రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

దానిమ్మ స్క్రబ్: దానిమ్మను స్క్రబ్‌గా కూడా ఉపయోగించవచ్చునని తెలిస్తే ఆశ్చర్యపోతారు. దీని కోసం ఓట్ పౌడర్ ను ఒక గిన్నెలోకి తీసుకోవాలి. దానికి దానిమ్మ రసం కలపండి. ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. ఆ తర్వాత చేతులతో ముఖాన్ని నెమ్మదిగా మర్ధనా చేయాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై ఉన్న మృతకణాలు తొలగిపోతాయి.

దానిమ్మ – అలోవెరా: దానిమ్మ, కలబంద కలయిక టాన్ సమస్యను పరిష్కరించగలదు. ఎండ నుండి తిరిగి వచ్చిన తర్వాత, మీ ముఖానికి కలబంద మరియు దానిమ్మ ఫేస్ ప్యాక్ వేయండి. ఇలా చేస్తే ఎండ వల్ల మీ ముఖం నల్లబడటం పోతుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..