AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sleep on The Floor : నేలపై పడుకుంటే ఇన్ని లాభాలా..? తెలిస్తే బెడ్‌కు గుడ్‌ బై చెప్పేస్తారు..!

వేసవిలో నేలపై పడుకోవడం వల్ల శరీరానికి కాస్త చల్లగా అనిపిస్తుంది. నేల చల్లదనానికి, శరీర ఉష్ణోగ్రత నెమ్మదిగా తగ్గిపోతుంది. దీనివల్ల మరింత గాఢంగా నిద్ర పోవచ్చు. అంతేకాదు, చాలా మంది ఆఫీసు, ఇంటి పనితో అలసిపోతుంటారు. బాడీ పెయిన్స్ తో బాధ పడుతుంటారు. ఆ పెయిన్స్ ఉన్న వారు బెడ్ కి గుడ్‌ బై చెప్పి నేల మీద పడుకోవడం అలవాటు చేసుకోండి. ఆ హాయిని మీరు ఆస్వాదిస్తారు.

Sleep on The Floor : నేలపై పడుకుంటే ఇన్ని లాభాలా..? తెలిస్తే బెడ్‌కు గుడ్‌ బై చెప్పేస్తారు..!
కాబట్టి మీకూ తిన్న వెంటనే నిద్రించే అలవాటు ఉంటే ఈ రోజు నుంచి మానుకోండి. లేదంటే మధుమేహం, ఊబకాయం వంటి వ్యాధులు కొద్ది రోజుల్లోనే వచ్చే ప్రమాదం ఉంది. గుండెల్లో మంట వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి. తిన్న వెంటనే నిద్రపోవడం వల్ల గుండెల్లో మంట, ఎసిడిటీ వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి.
Jyothi Gadda
|

Updated on: Mar 19, 2024 | 7:55 PM

Share

కాలం మారింది.. దాంతో పాటుగానే ప్రజల జీవన విధానాలు మారిపోతున్నాయి. సౌకర్యాల విషయానికి వస్తే చాలా మంది ప్రజలు లగ్జరీ లైఫ్‌ కోసం పరుగులు పెడుతున్నారు. కానీ నేటికీ నేలపై పడుకునే పాత సంప్రదాయం ఇప్పటికీ సరైనదని మరోసారి నిరూపించబడింది ఈ ఆధునిక యుగంలో అందరూ మంచాలు, సుతిమెత్తటి బెడ్‌లను వాడుతున్నారు. కానీ, అలాంటి మంచాన్ని వదిలి నేలపై పడుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసా..? ఆ లాభాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. నేలపై పడుకోవడం వల్ల కలిగే అసంఖ్యాక ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

నేల మీద పడుకోవడం వల్ల మానసిక ఆరోగ్యం:

మనస్తత్వవేత్తలు నేలపై పడుకోవడం వల్ల శరీరం రిలాక్సేషన్, నేలతో అనుబంధం ఏర్పడుతుందని అంటున్నారు. నేలపై పడుకోవడం వల్ల శరీర భంగిమ సరైన రీతిలో ఉంటుంది. అదే బెడ్‌పై పడుకున్నప్పుడు మనం నిద్రించే సమయంలో కుంగి ఉంటాయి. ఇది అసౌకర్యాన్ని కలిగిస్తుంది. నేలపై పడుకోవడం వల్ల వెన్నెముక నిటారుగా ఉంటుంది. మనం నేలపై పడుకున్నప్పుడు మన శరీరం పూర్తిగా రిలాక్స్‌ అవుతుంది. మనం పూర్తి విశ్రాంతి తీసుకుంటాము. ఇది వెన్నునొప్పిని తగ్గిస్తుంది. వెన్నెముకపై ఒత్తిడి తగ్గించుకునేందుకు పిల్లోను వాడుకోవచ్చు. నడుము భాగంలో పలుచని పిల్లోను పెట్టుకుని నిద్రించాలన్నది వైద్యుల సూచన.

ఇవి కూడా చదవండి

నేలపై పడుకోవడం వల్ల కలిగే ఆధ్యాత్మిక ప్రయోజనాలు:

నేలపై పడుకోవడం వల్ల మన శరీరానికి కావలసిన సహజమైన విశ్రాంతి లభిస్తుంది. ఇది మన వీపును నిటారుగా ఉంచుతుంది. కండరాలను రిలాక్స్ చేస్తుంది. మీరు ఫ్లాట్ ఫ్లోర్‌లో పడుకున్నప్పుడు, మీ మనస్సులోని ఆందోళనలు కూడా తగ్గుతాయి. నేటి బీజీ లైఫ్‌ అత్యధిక ఒత్తిడితో కూడిన యుగంలో నేలపై నిద్రపోవడం మనల్ని ప్రకృతికి దగ్గర చేస్తుంది. భూమితో అనుసంధానం చేయడం ద్వారా మనం మరింత సమతుల్యత, ప్రశాంతతను పొందవచ్చు. నేలపై పడుకోవడం వల్ల మంచి నిద్రపడుతుంది. అదే విధంగా నిద్రలో సహజ శరీర కదలిక ఉంటుంది. పరుపులు, దిండ్ల ఒత్తిడి ఉండదు. మంచి రక్త ప్రసరణ ఉంటుంది.

వేసవిలో నేలపై పడుకోవడం వల్ల శరీరానికి కాస్త చల్లగా అనిపిస్తుంది. నేల చల్లదనానికి, శరీర ఉష్ణోగ్రత నెమ్మదిగా తగ్గిపోతుంది. దీనివల్ల మరింత గాఢంగా నిద్ర పోవచ్చు. అంతేకాదు, చాలా మంది ఆఫీసు, ఇంటి పనితో అలసిపోతుంటారు. బాడీ పెయిన్స్ తో బాధ పడుతుంటారు. ఆ పెయిన్స్ ఉన్న వారు బెడ్ కి గుడ్‌ బై చెప్పి నేల మీద పడుకోవడం అలవాటు చేసుకోండి. ఆ హాయిని మీరు ఆస్వాదిస్తారు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..