Chilkoor Balaji Temple Priest: ముస్లిం రైతుకు ఎద్దును బహుమతిగా ఇచ్చిన ఆలయ పూజారి.. ఎక్కడో కాదు.. మన నగరంలోనే..!
రైతులు ఆవు, ఎద్దు లేదా గేదెలను కుటుంబ సభ్యులుగా పరిగణిస్తున్నారని, పశువులు చనిపోవడంతో రైతు కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టబడుతున్నారని రంగరాజన్ స్వామి అన్నారు. రైతులను ఆదుకునేందుకు 'పశువును బహుమతిగా ఇచ్చే కార్యక్రమాల్లో ప్రతి ఒక్క మానవతావాదంతో పాల్గొనాలని ప్రధాన అర్చకులు రంగరాజన్ ప్రజలను కోరారు.
యావత్ ప్రజానీకం మత ప్రాతిపదికన విభేదిస్తున్న తరుణంలో హైదరాబాద్‌లోని ఓ ఆలయ పూజారి ఔదార్యం ప్రదర్శించారు. మానవ సేవే, మాధవ సేవ అన్న నానుడికి సరైన అర్థం చెప్పారు. ఆపదలో ఉన్న ముస్లిం కుటుంబానికి సహాయం చేసి దాతృత్వాన్ని చాటుకున్నారు. చిల్కూరు బాలాజీ దేవాలయం గురించి అందరికీ తెలిసిందే. ఇక్కడ కొలువైన శ్రీనివాసుడికి వీసాల వెంకటేశ్వరుడని పేరు. అలాగే, ఆపదలో ఉన్న రైతులను ఆదుకునే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ చిల్కూరు బాలాజీ ఆలయం ఇక్కడి ప్రజల్ని కష్టకాలంలో ఆదుకుంటుంది. ఈ క్రమంలోనే విద్యుదాఘాతంలో తన వ్యవసాయ ఎద్దును కోల్పోయిన చిల్కూరు గ్రామానికి చెందిన రైతు మొహమ్మద్ గౌస్‌కు ఎద్దును బహుమతిగా ఇచ్చారు చిల్కూరు ఆలయ పూజారి. మానవత్వం మతం, కులం, మతం చూడదు. తోటి మానవులకు సహాయం చేయడమే పరమాత్ముని సేవ అని చిల్కూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సిఎస్ రంగరాజన్ అన్నారు.
గత రెండేళ్లలో, విద్యుత్ షాక్ తగిలి , పిడుగుపాటు లేదా మరేదైనా ప్రమాదంలో పశువులు మరణించిన రైతుల దుస్థితిని చూసి చలించిపోయిన చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు సీఎస్ రంగరాజన్ స్వామి గోసేవ ఔత్సాహికుడు పవన్ కుమార్ సహాయంతో రాష్ట్రవ్యాప్తంగా అనేక మంది రైతులకు సహాయం చేశారు. గతంలో విద్యుత్ షాక్ తో పశువులను కోల్పోయిన సిద్దిపేటకు చెందిన రైతుకు చిలుకూరు బాలాజీ దేవాలయం ఆవును అందించింది. పక్క గ్రామాలకు చెందిన కొందరు రైతులు కూడా ఎద్దులను అందుకున్నారు. ఆపదలో ఉన్న రైతులను ఆదుకునేందుకు ప్రజలు కూడా అదేవిధంగా పాల్గొనాలని ప్రధాన అర్చకులు కోరారు.
రైతులు ఆవు, ఎద్దు లేదా గేదెలను కుటుంబ సభ్యులుగా పరిగణిస్తున్నారని, పశువులు చనిపోవడంతో రైతు కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టబడుతున్నారని రంగరాజన్ స్వామి అన్నారు. రైతులను ఆదుకునేందుకు ‘పశువును బహుమతిగా ఇచ్చే కార్యక్రమాల్లో ప్రతి ఒక్క మానవతావాదంతో పాల్గొనాలని చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు రంగరాజన్ ప్రజలను కోరారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..