AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Revanth Reddy: 14 స్థానాలు పక్కా అంటున్న కాంగ్రెస్.. రేవంత్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా?

లోక్ సభ ఎన్నికలకు కాంగ్రెస్ సిద్దమైంది. 14 సీట్లు గెలవడమే లక్ష్యంగా పావులు కదులుతున్న కాంగ్రెస్ గెలవడానికి కావాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. పక్కా వ్యూహంతో అసెంబ్లీ ఎన్నికల టార్గెట్ రీచ్ అయిన తెలంగాణ కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల్లోనూ అదే స్ట్రాటజీ అమలు పరచాలని భావిస్తోంది.

Revanth Reddy: 14 స్థానాలు పక్కా అంటున్న కాంగ్రెస్.. రేవంత్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా?
Revanth Reddy Target
Ashok Bheemanapalli
| Edited By: Balaraju Goud|

Updated on: Mar 19, 2024 | 8:54 PM

Share

లోక్ సభ ఎన్నికలకు కాంగ్రెస్ సిద్దమైంది. 14 సీట్లు గెలవడమే లక్ష్యంగా పావులు కదులుతున్న కాంగ్రెస్ గెలవడానికి కావాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. పక్కా వ్యూహంతో అసెంబ్లీ ఎన్నికల టార్గెట్ రీచ్ అయిన తెలంగాణ కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల్లోనూ అదే స్ట్రాటజీ అమలు పరచాలని భావిస్తోంది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్ మొదలు పెట్టిందనే చెప్పాలి. ఫిబ్రవరి 2 న జరిగిన ఇంద్రవెల్లి బహిరంగ సభలో రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల శంఖారావం మోగించారు. ఇక ఆ తర్వాత జరిగిన కొస్గి సభలో పార్లమెంట్ ఎన్నికల టార్గెట్‌ను రేవంత్ రెడ్డి ప్రకటించారు.

లోక్‌సభ ఎన్నికల విషయంలో అన్ని పార్టీల కంటే స్పీడ్‌గా హస్తం పార్టీ ఉంది. ఆశావహుల నుండి అప్లికేషన్లు స్వీకరించిన కాంగ్రెస్ వాటిని వడబోసే పనిలో ఉంది. అభ్యర్థుల ఎంపిక బాధ్యత పూర్తిగా రేవంత్ పై పెట్టిన అధిష్ఠానం గెలుపు గుర్రాలను సెలెక్ట్ చేయమని ఆదేశించింది. ఇప్పటికే మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థిని ప్రకటించిన రేవంత్ మరో 16 మందిని కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ ప్రకటించడానికి కసరత్తు చేస్తోంది. సీట్ల ఎంపికలో గెలుపు గుర్రాలకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకోవాలని రేవంత్ భావిస్తున్నారు. దానిలో భాగంగా బీసీలకు నాలుగు టికెట్లు ఇచ్చే ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్టు తెలుస్తోంది

రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ నుండి పోటీ కోసం భారీ డిమాండ్ ఏర్పడింది. టికెట్ల కోసం అధిష్ఠానం చుట్టూ ఆశావాహులు చక్కర్లు కొడుతున్నట్లు తెలుస్తోంది. పక్క పార్టీల నేతలు సైతం హస్తం పార్టీ నుండి పోటీ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. పలు పార్టీల కీలక నేతలు ఏఐసీసీ నేతలతో చర్చలు జరుపుతూ తాము ఆశించిన టికెట్ ఇస్తే కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి సిద్దమని చెబుతున్నట్లు సమాచారం. మరోవైపు ఇండియా కూటమిలో భాగంగా ఉన్న తమకు ఒక్కో సీటు ఇవ్వాలని సీపీఐ, సీపీఏం అడుగుతున్నట్లు సమాచారం.

ఇదిలావుంటే, కాంగ్రెస్ పార్టీలో చేరికల జోష్ కొనసాగుతోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నుండి కీలక నేతలు వరుసగా కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి సతీమణి ప్రస్తుత వికారాబాద్ జెడ్పీ చైర్ పర్సన్ సునీత మహేందర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ తీగల అనితా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణా రెడ్డి, GHMC డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, కార్పొరేటర్ బాబా ఫసియోద్దిన్, బొంతు శ్రీదేవి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, దానం నాగేందర్, రంజిత్ రెడ్డి,తదితరులు కాంగ్రెస్ గూటికి చేరారు. పలు పార్టీల చాలా మంది కీలక నేతలు ఏఐసీసీ నేతలతో టచ్ లో ఉన్నారని పార్లమెంట్ ఎన్నికలలోపే వారంతా కాంగ్రెస్ పార్టీలో చేరుతారని సమాచారం. ఇక ఈ చేరికలు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఎంతగానో ఉపయోగపడతాయని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.

తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జీగా దీప్ దాస్ మున్షీ , ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఎదుర్కోనున్న తొలి ఎన్నికలు కావడంతో ఈ ఎన్నికలను ఆ ఇద్దరు నేతలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఇక 14 స్థానాలు పక్కా అంటున్న కాంగ్రెస్ నేతల ప్లాన్ వర్కవుట్ అవుతుందో లేదో చూడాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..