AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandrababu: టీడీపీ అభ్యర్థుల తొలిజాబితా ప్రకటనపై ఈ నియోజకవర్గంలో భగ్గుమన్న విభేదాలు

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో టిడిపి విభేదాలు తారాస్థాయికి చేరిన సందర్భంలో జిల్లా టిడిపి అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు ఆజ్యం పోశాయి. పార్టీ అనుమతి లేకుండా కార్యక్రమాలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని బహిరంగంగా మాట్లాడటంతో ఒక వర్గాన్ని టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తోంది. దీంతో విభేదాలు రోడ్డున పడ్డాయి. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు టిడిపి టికెట్‎ను మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి, టిడిపి నేత డాక్టర్ సోమనాథ్ ఆశిస్తున్నారు.

Chandrababu: టీడీపీ అభ్యర్థుల తొలిజాబితా ప్రకటనపై ఈ నియోజకవర్గంలో భగ్గుమన్న విభేదాలు
Telugudesam
J Y Nagi Reddy
| Edited By: Srikar T|

Updated on: Mar 01, 2024 | 8:23 PM

Share

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో టిడిపి విభేదాలు తారాస్థాయికి చేరిన సందర్భంలో జిల్లా టిడిపి అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు ఆజ్యం పోశాయి. పార్టీ అనుమతి లేకుండా కార్యక్రమాలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని బహిరంగంగా మాట్లాడటంతో ఒక వర్గాన్ని టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తోంది. దీంతో విభేదాలు రోడ్డున పడ్డాయి. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు టిడిపి టికెట్‎ను మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి, టిడిపి నేత డాక్టర్ సోమనాథ్ ఆశిస్తున్నారు. తనకే టికెట్ అని ఇద్దరు ప్రచారం చేసుకుంటున్నారు ప్లెక్సీలు బ్యానర్లు ఏర్పాటు చేశారు.

ఎమ్మిగనూరు ఇన్చార్జిగా మాజీ ఎమ్మెల్యే జయ నాగేష్ ఉంటున్నారు. గత కొన్ని రోజుల నుంచి ఎంజీ బ్రదర్స్ కుటుంబానికి చెందిన మాచాని సోమనాథ్ రంగంలోకి దిగారు. వేరే జిల్లాలో డాక్టర్‎గా స్థిరపడిన సోమనాథ్ ఎమ్మిగనూరులో ప్రచారం చేయడం సంచలనంగా మారింది. సైకిల్ యాత్రలు కూడా చేశారు. పార్టీ అండదండలు, ఆదేశాలు లేకుండా ప్రచారం చేస్తారా అనేది చర్చ అయింది. ఒకవేళ అదే నిజమైతే మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి పరిస్థితి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. కర్నూలు బీసీ సదస్సులో రెండు వర్గాలు కుర్చీలతో కొట్టుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత చంద్రబాబు జయ నాగేశ్వర్ రెడ్డిని పిలిపించి మాట్లాడారు. తనకు అభయమిచ్చారని మాజీ ఎమ్మెల్యే చెప్పుకుంటున్నారు. ఈ సందర్భంలో జిల్లా టిడిపి అధ్యక్షులు బీటి నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు టికెట్ తనకే వస్తుందని చెప్పుకుంటున్నారని, పార్టీ అనుమతి లేకుండా సైకిల్ యాత్ర చేస్తే పార్టీ చర్యలు తీసుకుంటుందని పరోక్షంగా డాక్టర్ సోమనాథ్‎ని ఉద్దేశించి మాట్లాడారు.

బీటీ నాయుడు కర్నూలు జిల్లా టిడిపి అధ్యక్షుడు..

  • డాక్టర్ సోమనాథ్ మాత్రం ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నారు. సైకిల్ యాత్రలతోపాటు ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. నియోజవర్గంలో ఫ్లెక్సీలు బ్యానర్లు ఏర్పాటు చేశారు. టికెట్ ఎవరికి వచ్చేది త్వరలోనే తేలుతుందని అంటున్నారు.

డాక్టర్ సోమనాథ్ ఎమ్మిగనూరు టిడిపి నేత..

  • మరోవైపు జగనేశ్వర్ రెడ్డి ధీమాగా ఉన్నారు. తనకే టికెట్ వస్తుందని ఆశిస్తున్నారు. చంద్రబాబును కలిసిన తర్వాత మార్పు వచ్చిందని అంటున్నారు.

బి బి జయ నాగేశ్వర్ రెడ్డి ఎమ్మిగనూరు మాజీ ఎమ్మెల్యే..

  • ఉమ్మడి కర్నూలు జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ నియోజకవర్గం ఇప్పటికే 9 నియోజకవర్గాలకు టిడిపి అభ్యర్థులను ప్రకటించింది మిగిలిన ఐదు నియోజకవర్గాలలో ఎమ్మిగనూరు కూడా ఒకటి ఉంది. దీంతోనే టికెట్ ఎవరికి వస్తుందని దానిపై ఉత్కంఠ నెలకొంది.
ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..