AP Politics: ఈ జిల్లాలో మారిన రాజకీయ ముఖచిత్రం.. ఒకటైపోయిన ప్రత్యర్థి కుటుంబాలు..

టిడిపి అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత మొదటిసారిగా కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి డోన్ వచ్చారు. కర్నూలు జిల్లాలో ప్రత్యర్థులుగా పేరు ఉన్న కోట్ల, కేఈ కుటుంబాలు ఇద్దరు కలిసి డోన్‎లో ర్యాలీ చేయడం చర్చనీయాంశమైంది. గత 50 ఏళ్లుగా కోట్ల ఫ్యామిలీ కర్నూలు పార్లమెంటుకు పోటీ చేస్తూ వస్తోంది. ఈసారి ఎంపీ టికెట్ కాకుండా డోన్ టిడిపి ఎమ్మెల్యేగా కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి పోటీ చేస్తున్నారు.

AP Politics: ఈ జిల్లాలో మారిన రాజకీయ ముఖచిత్రం.. ఒకటైపోయిన ప్రత్యర్థి కుటుంబాలు..

| Edited By: Srikar T

Updated on: Mar 01, 2024 | 7:59 PM

టిడిపి అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత మొదటిసారిగా కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి డోన్ వచ్చారు. కర్నూలు జిల్లాలో ప్రత్యర్థులుగా పేరు ఉన్న కోట్ల, కేఈ కుటుంబాలు ఇద్దరు కలిసి డోన్‎లో ర్యాలీ చేయడం చర్చనీయాంశమైంది. గత 50 ఏళ్లుగా కోట్ల ఫ్యామిలీ కర్నూలు పార్లమెంటుకు పోటీ చేస్తూ వస్తోంది. ఈసారి ఎంపీ టికెట్ కాకుండా డోన్ టిడిపి ఎమ్మెల్యేగా కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి పోటీ చేస్తున్నారు.

మొదటిసారి డోన్ రావడంతో కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించారు. కోట్ల కుటుంబం నుంచి సూర్యప్రకాశ్ రెడ్డి సుజాత రాఘవేంద్ర రెడ్డి, కేయి ఫ్యామిలీ నుంచి కేఈ కృష్ణమూర్తి కేజీ ప్రభాకర్ కేఈ శ్యాంబాబు హాజరయ్యారు. డోన్లో ర్యాలీ నిర్వహించారు. స్థానికంగా ఉన్న ఓ ఫంక్షన్ హాల్‎లో సమావేశం ఏర్పాటు చేశారు. రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమే అని రెండు కుటుంబాల నేతలు స్పష్టం చేశారు. డోన్లో టిడిపి నుంచి కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి పోటీలో నిలువగా.. వైసీపీ నుంచి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తలపడనున్నారు. టిడిపి నుంచి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి గెలవబోతున్నానంటూ జోస్యం చెప్పారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow us