AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: అనపర్తిలో హైటెన్షన్.. టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి అరెస్ట్..

అనపర్తి రాజకీయం మరోసారి హీటెక్కింది. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య మాటల యుద్ధం కాస్తా ప్రమాణాల వరకు వెళ్లింది. ఎమ్మెల్యే 500 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారనేది మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆరోపణ. తన దగ్గర ఆధారాలున్నాయని చెప్తున్న రామకృష్ణారెడ్డి.. ఇవాళ నిరూపించేందుకు సిద్ధమయ్యారు. దీనికి సత్తి సూర్యనారాయణ రెడ్డి కూడా సై అన్నారు.

Andhra Pradesh: అనపర్తిలో హైటెన్షన్.. టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి అరెస్ట్..
Anaparthi Politics
Shaik Madar Saheb
|

Updated on: Mar 01, 2024 | 12:40 PM

Share

అనపర్తి రాజకీయం మరోసారి హీటెక్కింది. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య మాటల యుద్ధం కాస్తా ప్రమాణాల వరకు వెళ్లింది. ఎమ్మెల్యే 500 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారనేది టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆరోపణ. తన దగ్గర ఆధారాలున్నాయని చెప్తున్న రామకృష్ణారెడ్డి.. ఇవాళ నిరూపించేందుకు సిద్ధమయ్యారు. దీనికి వైసీపీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి కూడా సై అన్నారు. నడిచి వస్తావో హెలికాప్టర్ ఎక్కి వస్తావో.. వేదిక సిద్ధమంటూ ప్రకటించారు. రామకృష్ణారెడ్డి రాకపోతే ఆధారాలు నిరూపించలేకపోయినట్లే అన్నారు. అయితే తన సవాల్‌ను నిరూపించుకునేందుకు సిద్ధమైన రామకృష్ణారెడ్డిని పోలీసులు ఆయన ఇంటి దగ్గరే అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

శుక్రవారం ఉదయం నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇంటి నుంచి బయల్దేరారు. 7 కిలోమీటర్ల దూరంలో టెంట్‌ ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి దగ్గరకు బయల్దేరారు. కార్యకర్తలు భారీగా తరలి రావడంతో వారికి అభివాదం చేస్తూ బయల్దేరారు. అయితే పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో సూర్యనారాయణ రెడ్డి ఇంటికి వెళ్లాలంటూ రామకృష్ణారెడ్డి పట్టుబట్టడంతో పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. దీంతో టీటీపీ కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

కాగా.. నేతల సవాళ్లతో అనపర్తిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. 70 మంది పోలీసులతో ఎమ్మెల్యే ఇంటి దగ్గర బందోబస్తు ఏర్పాటుచేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పకడ్భందీగా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పుడే కాదు గతంలోనూ ఇద్దరు నేతల మధ్య సవాళ్లు, ప్రమాణాల చాలెంజ్‌లు కొనసాగాయి. ఇదే రాజకీయ ప్రత్యర్థులు బిక్కవోలు వినాయకుడి దగ్గర 2020 డిసెంబర్‌లో సత్య ప్రమాణాలు చేశారు. అప్పటి ఎపిసోడ్ తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనంగా మారింది. ఈ క్రమంలో పోటీపోటీ సవాళ్లతో ఇవాళ మరోసారి ఉద్రిక్తత నెలకొంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..