AP Minister: మిర్చి యార్డులో మంత్రి.. మహిళా కూలీలతో మాటామంతి..

గుంటూరు జిల్లా మిర్చికి హాబ్.. .ఘాటైన మిరపకాలయ సాగుకు పెట్టింది పేరు. ఆసియాలోనే అతి పెద్దదైన మిర్చి మార్కెట్ యార్డు గుంటూరులోనే ఉంది. గుంటూరు అనగానే కారమే గుర్తొస్తోంది. ఇక్కడ రాజకీయ నాయకుల మాట తీరు, నడవడికను కూడా గుంటూరు కారంతో పోలుస్తుంటారు. దీంతో ఎన్నికల సమయంలో కూడా మిర్చి, కారం పదాలు ఎక్కువుగా దొర్లుతుంటాయి. చిలకలూరిపేట నుండి గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి మారిన మంత్రి విడదల రజిని మిర్చి కూలీ అవతారం ఎత్తారు.

T Nagaraju

| Edited By: Srikar T

Updated on: Mar 01, 2024 | 8:59 PM

గుంటూరు జిల్లా మిర్చికి హాబ్.. .ఘాటైన మిరపకాలయ సాగుకు పెట్టింది పేరు. ఆసియాలోనే అతి పెద్దదైన మిర్చి మార్కెట్ యార్డు గుంటూరులోనే ఉంది. గుంటూరు అనగానే కారమే గుర్తొస్తోంది. ఇక్కడ  రాజకీయ నాయకుల మాట తీరు, నడవడికను కూడా గుంటూరు కారంతో పోలుస్తుంటారు.

1 / 6
దీంతో ఎన్నికల సమయంలో కూడా మిర్చి, కారం పదాలు ఎక్కువుగా దొర్లుతుంటాయి. చిలకలూరిపేట నుండి గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి మారిన మంత్రి విడదల రజిని మిర్చి కూలీ అవతారం ఎత్తారు. ఎందుకనుకుంటున్నారా..మిర్చి మార్కెట్ యార్డు చుట్టుపక్కల ఎక్కువ మంది మహిళలు మిర్చి కూలీలుగా ఉంటారు.

2 / 6
ఉదయం నుండి సాయంత్రం వరకూ మిరప కాయల తొడిమెలు వలుస్తుంటారు. అయితే మిర్చి కూలీలకు అదే స్థాయిలో అనారోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి. కేజీ మిరప కాయలకు తొడిమెలు తీస్తే పదిహేను రూపాయల కూలీ ఇస్తారు. కారం కోరు కారణంగా కూలీలు అనేక సమస్యలు ఎదుర్కొంటారు.

3 / 6
ఈ క్రమంలోనే కూలీల సమస్యలు తెలుసుకొనటానికి మంత్రి రజిని మహిళా కూలీల వద్దకు వెళ్లారు. వారితో కూర్చొని మిరపకాయల తొడిమెలు వలిచారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాలను గురించి అడిగి తెలుసుకున్నారు.

4 / 6
మిర్చి కూలీల సమస్యల పరిష్కారం కోసం ఏం చేయాలో ఆ మేరకు ప్రభుత్వంతో మాట్లాడి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. మంత్రి నేరుగా మిర్చి కూలీల వద్దకు వచ్చి వారితో కలిసి మాట్లాడటం, వారి సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో మహిళలు సంతోషం వ్యక్తం చేశారు.

5 / 6
మంత్రి తమ నియోజకవర్గంలోనే పోటీ చేస్తుందని తెలుసుకొని మరింతగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తూ ముందుకు సాగుతున్న రజిని ఎన్నికల ప్రచారంలో భాగంగా వివిద వర్గాలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా మిర ఘాటుతో మొదలు పెట్టారు. మహిళలు కూడా ఆమెకు కారమంతా ఘాటు అభిమానాన్నే ఇస్తారో లేదో తెలియాలంటే మరికొద్దీ రోజులు ఆగాల్సిందే.

6 / 6
Follow us