Satya Kumar: బీజేపీ తరఫున ఒకే ఒక్కడు.. మహామహులను వెనక్కినెట్టి అనూహ్యంగా మంత్రి పదవి..!
మహామహులను వెనక్కినెట్టి అనూహ్యంగా మంత్రి పదవి దక్కించుకున్నారా నాయకుడు. రెండు నెలల కాలంలోనే టికెట్ సాధించి గెలిచి, మంత్రి పదవితో మరింత సంచలనం సృష్టించారు. జాతీయ నేతల ఆశీస్సులు ఆయనకు ప్లస్ అయ్యాయా..? అగ్రనేతల అండదండలే అందలమెక్కించాయా? ఆ బీసీ నాయకుడి లక్కు వెనుక ఈక్వేషన్స్ ఏంటి?

మహామహులను వెనక్కినెట్టి అనూహ్యంగా మంత్రి పదవి దక్కించుకున్నారా నాయకుడు. రెండు నెలల కాలంలోనే టికెట్ సాధించి గెలిచి, మంత్రి పదవితో మరింత సంచలనం సృష్టించారు. జాతీయ నేతల ఆశీస్సులు ఆయనకు ప్లస్ అయ్యాయా..? అగ్రనేతల అండదండలే అందలమెక్కించాయా? ఆ బీసీ నాయకుడి లక్కు వెనుక ఈక్వేషన్స్ ఏంటి? ఇదే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.
మహామహులను తలదన్ని అనూహ్యంగా మంత్రి పదవి దక్కించుకున్నారు. రెండు నెలల్లో టికెట్ సాధించుకుని, గెలుపు మంత్రం పఠించాడు. ఏకంగా చంద్రబాబు నాయుడు కేబినెట్‌లో ఏకైక బీజేపీ మంత్రిగా ఛాన్స్ కొట్టేశాడు. ఆ నేత ఎవరో కాదు..! ధర్మవరం బీజేపీ ఎమ్మెల్యే సత్య కుమార్. భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు దగ్గర వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన సత్య కుమార్ అనూహ్యంగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు.
బీజేపీ తరఫున హిందూపురం ఎంపీ టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు సత్య కుమార్. కానీ అనూహ్యంగా ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ, బలమైన ప్రత్యర్థి కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మీద గెలిచి సంచలనం సృష్టించారు సత్య కుమార్. ఏకంగా చంద్రబాబు నాయుడు కేబినెట్‌లో మంత్రి పదవి చేపట్టి చరిత్ర సృష్టించారు.
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యక్తిగత కార్యదర్శిగా, జాతీయ రాజకీయాలకు మాత్రమే దగ్గరగా ఉన్న సత్య కుమార్, చంద్రబాబు మంత్రివర్గంలో చోటు దక్కటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. బీజేపీ జాతీయ కార్యదర్శిగా, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వ్యక్తిగత కార్యదర్శిగా బిజెపి కేంద్ర నాయకత్వానికి అతి సన్నిహితంగా ఉన్న సత్య కుమార్ ప్రస్తుత ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారారు. బీజేపీ తరఫున ఎనిమిది మంది గెలుపొందినప్పటికీ కేవలం సత్య కుమార్ కు మాత్రమే మంత్రి పదవి దక్కడం వెనుక అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయనే చెప్పుకోవాలి..!
సత్య కుమార్ కు మంత్రి పదవి దక్కడంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రభావం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా సత్య కుమార్ ఢిల్లీ లాబీయింగ్ బాగానే పనిచేసినట్లు ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తొలుత హిందూపురం ఎంపీ టికెట్ ఆశించి భంగపడ్డ సత్య కుమార్ అనూహ్యంగా ధర్మవరం పొలిటికల్ స్క్రీన్ పై అరంగేట్రం చేశారు. వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిపై గెలుపొందారు. స్థానికేతరుడైన సత్య కుమార్ గెలుపులో ధర్మవరం టీడీపీ ఇంచార్జి పరిటాల శ్రీరామ్ తన భుజస్కందాల మీద వేసుకుని ఎన్నికల ప్రచారం నిర్వహించి గెలుపు తీరాలకు చేర్చారు.
హిందూపురం ఎంపీ బరిలో నిలిచి కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పాలని అనుకున్న సత్య కుమార్, ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చక్రం తిప్పబోతున్నారు. బీజేపీ తరఫున ఎనిమిది మంది ఎమ్మెల్యేలు గెలిస్తే, అందులో హేమాహేమీలైన సృజన చౌదరి, విష్ణు కుమార్ రాజు, ఆదినారాయణ రెడ్డి, కామినేని శ్రీనివాస్ లను కాదని సత్య కుమార్‌కు మంత్రి పదవి దక్కింది. ఇప్పుడు ఇదే ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. బీజేపీలో ఇంత మంది హేమాహేమీలు ఉండగా పొత్తులో భాగంగా వచ్చే ఒకే ఒక్క మంత్రి పదవి కూడా తొలిసారి గెలిచిన సత్య కుమార్ కే రావడం రాష్ట్ర రాజకీయాల్లో కొంత సంచలనంగానే కనిపిస్తుంది. భీజేపీ జాతీయ రాజకీయాలను దగ్గరుండి చూసిన సత్య కుమార్ కు మంత్రి పదవి దక్కడం వెనుక ఏపీలో బీజేపీ భవిష్యత్తు రాజకీయాలు ముడిపడి ఉన్నట్లు కనిపిస్తుందంటున్నారు విశ్లేషకులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…
