Andhra Pradesh: క్యాబినెట్‌ కూర్పులో బాబు చాణక్యం చూపించారా?.. ఈక్వేషన్స్‌ అన్నీ సమపాళ్లలో కుదిరాయా?

ఏపీలో NDA సర్కార్‌ కొలువుదీరింది. చంద్రబాబుతో పాటు 24 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నికల ముందు బీజేపీ-టీడీపీతో కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 24 మంది మంత్రుల్లో 17 మంది తొలిసారిగా మంత్రి పదవి చేపట్టారు. ఇక సీనియర్లను కాదని.. కొత్తవారికి టీడీపీ పట్టం కట్టింది. అదే సమయంలో యువతకు ప్రాధాన్యత ఇచ్చింది పార్టీ.

Andhra Pradesh: క్యాబినెట్‌ కూర్పులో బాబు చాణక్యం చూపించారా?.. ఈక్వేషన్స్‌ అన్నీ సమపాళ్లలో కుదిరాయా?
Big News Big Debate
Follow us

|

Updated on: Jun 12, 2024 | 7:05 PM

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేశారు.  చంద్రబాబుతోపాటు పవన్‌ కళ్యాణ్‌, మరో 23 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. 24 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తే అందులో 17 మంది కొత్తవారే ఉన్నారు. వీరిలో 10 మంది తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచారు. కేవలం 7గురు మాత్రమే గతంలో మంత్రులుగా పనిచేశారు. ముగ్గురు మహిళలకు చోటు దక్కింది.  కేసరపల్లిలో జరిగిన ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ఎన్డీయే అధినేతలు హాజరయ్యారు. సీఎంలు, మాజీసీఎంలతో పాటు.. బీజేపీ అగ్రనేతలంతా పాల్గొన్నారు.

సీఎంగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబును ప్రధాని ఆప్యాయంగా ఆలింగనం చేసుకోవడంతో చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారు. రాష్ట్రానికి ఎన్డీయే సపోర్ట్‌ బలంగా ఉందని సంకేతాలు పంపారు కూటమి నేతలు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తామన్నారు మంత్రి అనిత. పోర్ట్‌ఫోలియో ఏదైనా చంద్రబాబు మార్క్ ఉండేలా ముందుకెళ్తానన్నారు. అమరావతి ఇకపై అభివృద్ధిలో పరుగులు పెడుతుందన్నారు మంత్రులు.

ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణం చేసినరోజే కాంగ్రెస్‌ ప్రశ్నాస్త్రాలు సంధించింది. పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోని ఐదు అంశాలపై నిలదీశారు కేంద్ర మాజీ మంత్రి జైరామ్‌ రమేష్‌. ప్రత్యేక హోదా, పోలవరంతో పాటు విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ సహా అనేక అంశాలపై సోషల్‌ మీడియా ద్వారా ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ప్రశ్నలు ఎలా ఉన్నా.. తిరుమల దర్శనానికి వెళ్లిన సీఎం చంద్రబాబునాయుడు రేపు బాధ్యతలు చేపట్టిన వెంటనే కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. మెగా డిఎస్సీ, ల్యాండ్‌టైటిలింగ్‌ యాక్ట్‌, పెన్షన్‌ పెంపు, అన్నా క్యాంటిన్లు, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ఫైల్స్‌పై సంతకాలు చేయనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…