AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan Kalyan : తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి.. అధికారులకు డిప్యూటీ సీఎం కీలక ఆదేశాలు

Cyclone Montha Alert: మొంథా తుపాను కాకినాడ ప్రాంతంలో తీరం దాటనున్న నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉండాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. జిల్లా పరిధిలోని 12 మండలాల పరిధిలో తుపాను ప్రభావం ఉండనున్న క్రమంలో ప్రభావిత ప్రాంతాల్లో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని సూచించారు.ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా రక్షణ చర్యలు చేపట్టాలని, ప్రభావిత ప్రాంతాల ప్రజలను ముందస్తుగా పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో డిప్యూటీసీఎం పవన్ కల్యాణ్ అధికారులకు కీలక సూచనలు చేశారు. 

Pawan Kalyan : తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి.. అధికారులకు డిప్యూటీ సీఎం కీలక ఆదేశాలు
Pawan Kalyan Disaster Direc
Anand T
|

Updated on: Oct 27, 2025 | 7:22 PM

Share

మొంథా తుపాను కాకినాడ ప్రాంతంలో తీరం దాటనున్న నేపథ్యంలో జిల్లా అధికారులతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తుఫాన్ నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచించారు.జిల్లా పరిధిలోని 12 మండలాల పరిధిలో తుపాను ప్రభావం ఉండనున్న క్రమంలో ప్రభావిత ప్రాంతాల్లో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని సూచించారు. ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా రక్షణ చర్యలు చేపట్టాలని, ప్రభావిత ప్రాంతాల ప్రజలను ముందస్తుగా పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు. ముఖ్యంగా గర్భిణులు, బాలింతలు, వృద్ధులను గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని తెలిపారు. ఆంబులెన్సులు, అత్యవసర సర్వీసులు సిద్ధం చేసుకోవాలని, ఆసుపత్రుల్లో బెడ్ల సంఖ్య పెంచుకోవాలని సూచనలు చేశారు. మండలాల వారీగా కంట్రోల్ రూములు ఏర్పాటు చేసి సమాచారం కోసం అత్యవసర ఫోన్ నంబర్లు అందుబాటులో ఉంచాలని చెప్పారు.

మొంథా తుపాను ప్రభావం కాకినాడ జిల్లా పరిధిలోని 12 మండలాలపై ఉండనున్నట్టు వాతావరణ శాఖ హెచ్చరికల ద్వారా తెలుస్తోందని.  మంగళవారం కాకినాడ పరిసరాల్లో తీరం దాటే అవకాశం ఉందని ఆయన అయన అన్నారు. తుపాను తీరం దాటే సమయంలో బలమైన ఈదురుగాలులు, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని. తుపానును ఎదుర్కొనేందుకు ప్రభావిత మండలాల పరిధిలో యంత్రాంగం పూర్తి సన్నద్దతో ఉండాలన్నారు. ముందస్తు రక్షణ చర్యలు భాగంగా తీర ప్రాంత గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. అయితే ఇప్పటికే 260 పునరావాస కేంద్రాలను గుర్తించినట్టు అధికారులు పవన్ కల్యాణ్‌కు తెలిపారు. పిఠాపురం నియోజకవర్గంతో పాటు కాకినాడ జిల్లావ్యాప్తంగా ఇప్పటికే 142 మంది గర్భిణులను గుర్తించి పునరావాస కేంద్రాలకు తరలించినట్టు జిల్లా కలెక్టర్  తెలిపారు.

వారికి అవసరం అయిన పౌష్టికాహారం, వైద్య సాయం అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేసిన విషయాన్ని ప్రజలకు తెలియజేయాలని. తుపాను పట్ల ప్రజల్లో భయాందోళనలు లేకుండా గ్రామాల్లో మైకుల ద్వారా తుపాను ప్రభావం, తీసుకుంటున్న సహాయక చర్యలను వివరించాలని పవన్ కల్యాణ్ సూచించారు. గజ ఈతగాళ్లను తీర ప్రాంతంతో పాటు లోతట్టు ప్రాంతాలు, వాగుల వద్ద సిద్ధంగా ఉంచాలని. గాలుల తీవ్రతకు విద్యుత్ స్తంభాలు నేల కూలే అవకాశం ఉందని. తక్షణం వాటిని పునరుద్దరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బ తినే అవకాశం ఉన్నందున అత్యవసర పరిస్థితుల్లో యంత్రాంగం శాటిలైట్ ఫోన్ల ద్వారా సమాచారం చేరవేయాలన్నారు

అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకోవాలి

తుపాను ప్రభావం ఉన్న అన్ని మండల కేంద్రాల్లో తహసీల్దార్లు, వీర్వోలు అందుబాటులో ఉండాలి. పోలీసులు.. ముంపు ప్రాంతాల్లో భద్రత చర్యల పర్యవేక్షణ పెంచాలి. పునరావాస కేంద్రాలకు వెళ్లే ప్రజల ఇళ్లకు సైతం భద్రత కల్పించాలి. ప్రజలు ఇళ్లలో లేని సమయంలో దొంగతనాలు జరగకుండా సీసీ కెమెరాలతో ప్రత్యేక భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేయాలి. ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలి. ఏలేరు ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేసే అవకాశం ఉన్నందున నీటి పారుదల శాఖ అధికారులు ప్రజలను అప్రమత్తం చేయాలి. బలహీనంగా ఉన్న చెరువులు, వాగులు, కుంటల గట్లను గుర్తించి రక్షణ చర్యలు తీసుకోవాలి. గండ్లు పడితే పూడ్చేందుకు వీలుగా ఇసుక బస్తాలు సిద్ధం చేసుకోవాలని సూచించారు.

తుపాను తీవ్రత ఉన్నందున మత్స్యకార గ్రామాలను మత్స్యశాఖ అధికారులు అప్రమత్తం చేయాలని అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచించారు. మత్స్యకారులు వేటకు వెళ్లకుండా కట్టడి చేయాలని.. మత్స్యకారుల బోట్లు దెబ్బ తినకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని.. కూరగాయలు, నిత్యవసర సరకుల సరఫరాకు అడ్డంకులు లేకుండా మార్కెటింగ్ శాఖ అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు.

కాకినాడ జిల్లాకు రూ. కోటి అత్యవసర నిధి

తుపాను ప్రభావిత ప్రాంతాల ప్రజలకు అత్యవసర సాయం నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం రూ. 19 కోట్ల విడుదల చేసిందని. అందులో కాకినాడ జిల్లాకు కోటి రూపాయిలు కేటాయిస్తున్నట్టు తెలిపారు. ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస కేంద్రాల్లో సౌకర్యాల కల్పన, ప్రజలకు నిత్యవసర సరుకుల పంపిణీ, ఇళ్లు కూలడం, దెబ్బ తినడం వంటి సంఘటనలు జరిగితే తక్షణ సాయం చేయడం వంటి చర్యలు తీసుకోవాల”ని దిశానిర్దేశం చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
ఇకపై ఆధార్ కార్డు అవసరం లేదు.. కొత్త ఆధార్ యాప్.. ప్రత్యేకత ఏంటి?
ఇకపై ఆధార్ కార్డు అవసరం లేదు.. కొత్త ఆధార్ యాప్.. ప్రత్యేకత ఏంటి?