Cyclone Michaung: తుఫాన్ ఎఫెక్ట్.. సముద్రం నీరు 5 కి.మీ. మేర ముందుకు చొచ్చుకొచ్చే అవకాశం!
దక్షిణ కోస్తాలో తుఫాను తీరం దాటే ప్రాంతానికి ఉప్పెన ముప్పుపొంచి ఉందా..? అనంటే అవునని అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఎందుకంటే తుఫాను తీరం దాటే సమయంలో అలలు భారీగా ఎగసిపడతాయి. సముద్రపు నీరు ఐదు కిలోమీటర్ల వరకు ముందుకు వస్తుందని అంటున్నారు అధికారులు. దీన్ని బట్టి చూస్తే మళ్లీ ఆ ప్రాంతంలో ఉప్పెన ముప్పు పొంచి ఉన్నట్టే. బంగాళాఖాతంలో మిచాంగ్ తీవ్ర తుపానుగా మారింది. బాపట్ల సమీపంలో రేపు తీరం దాటుతుంది. తీరం దాటే సమయంలో అలలు 1.5 మీటర్ల ఎత్తు వరకు భారీగా ఎగసిపడతాయి..

నెల్లూరు, డిసెంబర్ 4: దక్షిణ కోస్తాలో తుఫాను తీరం దాటే ప్రాంతానికి ఉప్పెన ముప్పుపొంచి ఉందా..? అనంటే అవునని అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఎందుకంటే తుఫాను తీరం దాటే సమయంలో అలలు భారీగా ఎగసిపడతాయి. సముద్రపు నీరు ఐదు కిలోమీటర్ల వరకు ముందుకు వస్తుందని అంటున్నారు అధికారులు. దీన్ని బట్టి చూస్తే మళ్లీ ఆ ప్రాంతంలో ఉప్పెన ముప్పు పొంచి ఉన్నట్టే. బంగాళాఖాతంలో మిచాంగ్ తీవ్ర తుపానుగా మారింది. బాపట్ల సమీపంలో రేపు తీరం దాటుతుంది. తీరం దాటే సమయంలో అలలు 1.5 మీటర్ల ఎత్తు వరకు భారీగా ఎగసిపడతాయి. సముద్రపు నీరు ఐదు కిలోమీటర్ల వరకు ముందుకు చొచ్చుకొస్తుంది. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు అధికారులు. తుఫాను తీరందాటుతున్న సమయంలో కచ్చా ఇల్లు కూలిపోతాయి, చెట్లు పడిపోతాయి, కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉందని అంటున్నారు అధికారులు. దక్షిణ కోస్తా తీరానికి తుఫాను మరింత సమీపిస్తుంది.
వాతావరణ శాఖ తాజా బులిటెన్ 22 ప్రకారం…
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో దక్షిణ కోస్తా తీరానికి మరింత సమీపిస్తుంది తుఫాను. చెన్నైకి 100, నెల్లూరుకు 120, పాండిచ్చేరి 220, బాపట్ల 250, మచిలీపట్నానికి 280 కిలోమీటర్ల దూరంలో ఉంది. నెల్లూరు – మచిలీపట్టణం మధ్య బాపట్ల సమీపంలో రేపు ఉదయానికల్లా MICHAUNG తీరం దాటుతుంది. తీవ్ర తుఫాను గానే మిచ్చాంగ్ భూభాగాంపైకి వస్తుంది. తుపాను తీరం దాటే సమయంలో 90- 110 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వేస్తాయని అంటున్నారు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ సునంద.
నెల్లూరు, తిరుపతిలో భారీ వర్షపాతం నమోదు..
కోస్తా, రాయలసీమకు ఈ భారీ వర్ష సూచన కొనసాగుతోంది. ప్రధానపోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి. ఈరోజు ఉదయం నుంచో మధ్యాహ్నం వరకు తిరుపతిలో 11సెంటిమీటర్లు, నెల్లూరు రూరల్ లో 10, అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో 10 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. మరికొన్ని ప్రాంతాల్లోనూ 10 సెంటీమీటర్ల పైగా వర్షపాతం రికార్డ్ అయింది.
తీరం దాటిన తర్వాత కూడా..
తుఫాను తీరం దాటిన తర్వాత కూడా ప్రభావం ఉంటుందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. తీరం దాటిన తర్వాత ఉత్తర కోస్తా వైపు తుఫాను గమనం నేపథ్యంలో.. ఉత్తర కోస్తాపై మరింత ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. రేపు ఎల్లుండి కూడా అలర్ట్ ఇస్తున్నట్లు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ సునంద తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.