Tirumala: మిచౌంగ్‌ తుఫాన్ ఎఫెక్ట్‌తో తిరుమలలో భారీవర్షం

మిచౌంగ్ తుఫాన్ ఎఫెక్ట్‌తో తిరుమల, తిరుపతిలో భారీ వర్షం పడుతోంది. కొండపై జలాశయాలు నిండాయి. వర్షానికి ఓ వైపు భక్తులు ఇబ్బందిపడుతున్నా..మరోవైపు సెల్ఫీలు దిగుతూ సందడి చేస్తున్నారు.

Tirumala: మిచౌంగ్‌ తుఫాన్ ఎఫెక్ట్‌తో తిరుమలలో భారీవర్షం
Tirumala Rains
Follow us

|

Updated on: Dec 04, 2023 | 7:56 PM

మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో రెండు రోజులుగా తిరుపతి, తిరుమలలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. దీంతో శ్రీవారి భక్తులు, యాత్రికులు, ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. తిరుమలలో దాదాపు 10 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. మరోవైపు చలి గాలుల తీవ్రత కొనసాగుతోంది. దీనికి తోడు తుఫాను ప్రభావంతో గంటకు 50 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో భారీ ఈదురు గాలులు వీస్తున్నాయి. కొండపై మంచు కమ్ముకోవడం, దీంతో పాటు భారీ వర్షాలు పడుతుండటంతో తిరుమలలో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. బలమైన ఈదురు గాలులు, వర్షానికి తిరుమలలోని పలు ప్రాంతాలతో పాటు రెండవ ఘాట్ రోడ్‌లో చెట్లు కొమ్మలు, రాళ్లు విరిగి పడుతున్నా యి. శ్రీవారి పాదాలు వెళ్ళే మార్గాలకు అనుమతి నిరాకరించారు టీటీడీ అధికారులు. ఘాట్ రోడ్డు ద్వారా వెళ్లే ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ ధరించి, టర్నింగ్‌ దగ్గర జాగ్రత్తగా వెళ్లాలని సూచించారు. అటు తిరుమలలో పడుతున్న భారీ వర్షాలకు గోగర్భం, పాపవినాశనం, డ్యాములకు భారీగా వర్షపు నీరు వచ్చి చేరింది.

మరోవైపు భారీ వర్షాలు కురుస్తున్నా…కొందరు భక్తులు మాత్రం తిరుమల కొండల్లో ఎంజాయ్‌ చేస్తున్నారు. ఆకాశగంగ, పాపవినాశనం, కపిలతీర్థం దగ్గర జలపాతలు కనువిందు చేస్తున్నాయి. భారీ వర్షానికి కొండవాలులో సెలయేరు పారుతుంటే…భక్తులు సెల్ఫీలు తీస్తూ సందడి చేస్తున్నారు. మొత్తంమీదా తుఫాను ప్రభావంతో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య భారీగా తగ్గింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.