Andhra Pradesh: ఏపీపై తుఫాను ఎఫెక్ట్.. పలు విమాన సర్వీసులు రద్దు.!
పశ్చిమ బంగాళాఖాతంలో వాయుగుండంగా ఏర్పడిన తుఫాను ఏపీపై అధిక ప్రభావం చూపనుంది. మంగళవారం ఉదయానికల్లా నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీరం దాటనున్న నేపధ్యంలో ఏపీవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుపాను ప్రభావంతో దక్షిణ కోస్తాఅతలాకుతలమవుతోంది. తిరుపతిలోని అనేక ప్రాంతాలు జలయమమయ్యాయి. కుండపోత వర్షంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోయాయి.
పశ్చిమ బంగాళాఖాతంలో వాయుగుండంగా ఏర్పడిన తుఫాను ఏపీపై అధిక ప్రభావం చూపనుంది. మంగళవారం ఉదయానికల్లా నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీరం దాటనున్న నేపధ్యంలో ఏపీవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుపాను ప్రభావంతో దక్షిణ కోస్తాఅతలాకుతలమవుతోంది. తిరుపతిలోని అనేక ప్రాంతాలు జలయమమయ్యాయి. కుండపోత వర్షంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. నగరంలోని పలు పల్లపు ప్రాంతాల్లోకి నీరు చేరడంతో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. దీంతో శరవేగంగా జాగ్రత్తలు చేపట్టిన అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ క్రమంలో ఇండిగో, స్పైస్ జెట్ ఎయిర్వేస్ సంస్థలు పలు విమానాలను రద్దు చేశాయి.
హైదరబాద్ నుంచి తిరుపతికి రావాల్సిన ఇండిగో 6E 7534 విమానం వాతావరణం అనుకూలించకపోవడంతో తిరుపతి విమానాశ్రయంలో ల్యాండ్ కాకపోవడంతో తిరిగి హైదరాబాద్‌కు మళ్లించారు. అలాగే హైద్రాబాద్ నుంచి తిరుపతికి రావలసిన స్పైస్ జెట్ 6E 7738 విమానాన్ని బెంగుళూరు విమాాశ్రయానికి మళ్లించారు. తిరుపతి-హైదరాబాద్ స్పైస్ జెట్ విమానానాన్ని రద్దు చేశారు. విజయవాడ-విశాఖ ఇండిగో విమానాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే తిరుపతి జిల్లా రేణిగుంటకు ప్రతిరోజూ రాకపోకలు సాగించే ఎయిర్ ఇండియా విమానాన్ని కూడా రద్దు చేశారు. దీంతో ఇక్కడి నుంచి వెళ్లాల్సిన ప్రయాణికులు కొందరు బెంగళూరు, మరికొందరు చెన్నైకి వెళ్లి అక్కడినుంచి వారి గమ్యస్థానాలకు చేరుకున్నారు. ఉదయం హైదరాబాదు నుంచి రేణిగుంటకు వచ్చే స్పైస్‌జెట్, ఇండిగో విమానాలు కాస్త ఆలస్యంగా వచ్చాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.