Telangana: కొత్త సీఎం కోసం కాన్వాయ్‌ రెడీ..

Telangana: కొత్త సీఎం కోసం కాన్వాయ్‌ రెడీ..

Ram Naramaneni

|

Updated on: Dec 04, 2023 | 5:43 PM

కొత్త సీఎం కోసం కొత్త కాన్వాయ్‌ని సాధారణ పరిపాలన విభాగం రెడీ చేసింది.  ప్రాథమికంగా వైట్ కలర్ కాన్వాయ్‌ సిద్దం చేశారు అధికారులు. దిల్‌కుషా గెస్ట్‌హౌస్‌కి 6 ఇన్నోవా కార్లు చేరుకున్నాయి. రెండు కొత్త కార్లు కాగా 4 ఇప్పటికే నెంబర్ ప్లేట్ అలాట్ అయిన కార్లు ఉన్నాయి. ప్రమాణస్వీకారం తర్వాత కొత్త కాన్వాయ్‌లో సీఎం ఇంటికి వెళ్లేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 

కొత్త సీఎం కోసం కొత్త కాన్వాయ్‌ని సాధారణ పరిపాలన విభాగం రెడీ చేసింది.  ప్రాథమికంగా వైట్ కలర్ కాన్వాయ్‌ సిద్దం చేశారు అధికారులు. దిల్‌కుషా గెస్ట్‌హౌస్‌కి 6 ఇన్నోవా కార్లు చేరుకున్నాయి. రెండు కొత్త కార్లు కాగా 4 ఇప్పటికే నెంబర్ ప్లేట్ అలాట్ అయిన కార్లు ఉన్నాయి. ప్రమాణస్వీకారం తర్వాత కొత్త కాన్వాయ్‌లో సీఎం ఇంటికి వెళ్లేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే బాధ్యతలు చేపట్టిన కొత్త సీఎం.. తన అభీష్టం మేరకు కాన్వాయ్‌ను మార్చుకునే అవకాశం ఉంది.

మరోవైపు తెలంగాణలో రెండో శాసనసభను గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ రద్దు చేశారు. మంత్రివర్గ సిఫార్సు మేరకు రెండో శాసనసభను రద్దు చేశారు గవర్నర్‌.  కొత్త ప్రభుత్వానికి సంబంధించి సాంకేతికపరమైన ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..