AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

4G Service: ఏపీ మారుమూల గ్రామాలకు మహర్దశ.. 209 గ్రామాలకు అందనున్న 4జీ సేవలు..

ఆంధ్రప్రదేశ్‌లోని మారుమూల గ్రామాలు సైతం ఇక పూర్తిస్థాయి టెక్నాలజీని అందిపుచ్చుకోనున్నాయి. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు 4జీ సేవలు, ఒకేసారి 100 జియో టవర్నర్లు అందుబాటులోకి వచ్చాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం నాడు...

4G Service: ఏపీ మారుమూల గ్రామాలకు మహర్దశ.. 209 గ్రామాలకు అందనున్న 4జీ సేవలు..
Internet
Shiva Prajapati
|

Updated on: Jun 15, 2023 | 3:50 PM

Share

ఆంధ్రప్రదేశ్‌లోని మారుమూల గ్రామాలు సైతం ఇక పూర్తిస్థాయి టెక్నాలజీని అందిపుచ్చుకోనున్నాయి. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు 4జీ సేవలు, ఒకేసారి 100 జియో టవర్నర్లు అందుబాటులోకి వచ్చాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం నాడు క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. 209 మారుమూల ప్రాంతాలగ్రామాలకు 4జీ సేవలు అందనున్నాయి.

అల్లూరి సీతారామరాజు జిల్లాలో 85 టవర్లు, పార్వతీపురం మన్యం జిల్లాలో 10 టవర్లు, అన్నమయ్య జిల్లాలో 3 టవర్లు, వైఎస్ఆర్ జిల్లాలో 2 టవర్లను ప్రారంభించిన సీఎం. టవర్లను ఏర్పాటు చేసిన రిలయెన్స్‌ సంస్థ. భవిష్యత్తులో 5జీ సేవలను అప్‌గ్రేడ్‌ చేయనుంది జియో. టవర్లు ఏర్పాటు కారణంగా మారుమూల ప్రాంతాల్లో మరింతగా మెరుగుపడనున్నాయి ప్రభుత్వ సేవలు. ఆయా గ్రామాల్లోని గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్‌ క్లినిక్స్, ప్రభుత్వ పాఠశాలలు అన్నింటికీ మరింత కనెక్టివిటీ, మెరుగైన నాణ్యతతో ఇంటర్నెట్ సేవలు అందనున్నాయి. ఈ చర్యల ద్వారా విద్యార్థులకు ఇ-లెర్నింగ్ సదుపాయం అందుబాటులోకి వస్తుంది. మెరుగైన ఆరోగ్య సేవలు, ఆర్థికంగానూ ఆయా ప్రాంతాలకు మరింత లబ్ధి చేకూరనుంది.

రాష్ట్రంలో సెల్‌ సర్వీసులు లేని 5,459 ఆవాసాలకు సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి చేసింది. మొబైల్, ఇంటర్నెట్‌ సర్వీసులు ద్వార మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు వారి ముంగిటకే సేవలు అందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దీంట్లో భాగంగా యూనివర్సిల్‌ సర్వీస్‌ ఆబ్లిగేషన్‌ ఫండ్‌ (యూఎస్‌ఓఎఫ్‌) ద్వారా సెల్‌టవర్ల ఏర్పాటు కార్యక్రమాన్ని చేపట్టింది ప్రభుత్వం.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం ఏర్పాటు చేసిన సెల్‌ టవర్ల పరిధిలో 150 ఎంబీపీఎస్‌ డౌన్లోడ్, 50 ఎంబీపీఎస్‌ అప్‌లోడ్‌ చేసుకునేందుకు ఇప్పుడు అవకాశం ఏర్పడుతుంది. కేంద్ర ప్రభుత్వంలోని సంబంధిత శాఖలతో సంయమనం చేసుకుని, సెల్‌టవర్ల ఏర్పాటు కార్యక్రమాన్ని వేగవంతం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అవరసమైన మౌలిక సదుపాయాలను యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. ఈ మొత్తం ప్రాజెక్టు కింద కొత్తగా 2,849 ప్రాంతాల్లో టవర్లు ఏర్పాటు చేసింది. ఇందుకోసం ఇప్పటికే 2,463 చోట్ల స్థలాలు అప్పగించింది రాష్ట్ర ప్రభుత్వం.

ఈ సందర్భంగా ప్రసంగించిన సీఎం జగన్.. రాష్ట్రంలో ఇంటర్నెట్ సేవలు అందించేందుకు సహకరించిన కంద్ర ప్రభుత్వం, జియో, ఎయిర్‌టెల్, బీఎస్ఎన్ఎల్ సంస్థలకు ధన్యవాదాలు తెలిపారు. డిసెంబరు నాటికి రాష్ట్రంలో సెల్‌ సర్వీసులు లేని ఆవాసాలకు ఇంటర్నెట్‌ కనెక్టివిటీతో పాటు పెద్ద ఎత్తున మార్పులు రానున్నాయన్నారు సీఎం జగన్. అన్ని సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్‌ క్లినిక్స్, స్కూళ్లకూ ఇంటర్నెట్‌ కనెక్షన్‌ లభిస్తుందని, రేషన్‌ పంపిణీ, ఇ–క్రాప్‌ బుకింగ్‌ కూడా సులభమవుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభత్వం అమలు చేస్తు్న్న సంక్షేమ పథకాలను అత్యంత పారదర్శకంగా, లంచాలకు, వివక్షకు తావులేకుండా అందించగలుగుతున్నామని పేర్కొన్నారు సీఎం జగన్.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..